Home /News /crime /

MADHYA PRADESH TEEN DIES BY SUICIDE AFTER FATHER FAILS TO RECHARGE PHONE DATA PACK SHOCKING INSUDENT GOES VIRAL PAH

Shocking: ఓరి భగవంతుడా.. వీడేంటి.. ఇంత చిన్న విషయం కోసం సూసైడ్ చేసుకున్నాడు..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Madhya pradesh: జబల్ పూర్ లో దారుణమైన సంఘటన వెలుగులోనికి వచ్చింది. తమ కొడుకు కోసం తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకుంటు కష్టపడుతున్నారు. కానీ అతను మాత్రం.. ఒక చిన్న పని కోసం తన వాళ్లకు తీరని శోకం మిగిల్చాడు.

Teen Dies By Suicide After Father Fails To Recharge Phone: ప్రస్తుత సమాజంలో నేటి యువత క్షణికావేశంలో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమూల్యమైన తమ జీవితాలను మధ్యలోనే ముగించేస్తున్నారు. తమ వాళ్లు పెట్టుకున్న కలలను కల్లలు చేస్తున్నారు. కొందరు ప్రేమలో విఫలమయ్యామని, పరీక్షలో పాస్ కాలేదని సూసైడ్ చేసుకుంటున్నారు. మరికొందరు, సరైన ఉద్యోగం రాలేదని, పెద్దవాళ్లు తిట్టారని క్షణికావేశంలో తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇక మరికొందరు ఫోన్ కొనివ్వలేదని, పండగలకి బట్టలు కొనివ్వలేదని, ఎదైన ఇష్టమైన వస్తువు కొనివ్వలేదని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం మధ్య ప్రదేశ్ లో జరిగింది.

పూర్తి వివరాలు... మధ్య ప్రదేశ్ లోని జబల్ పూర్ లో ఒక బాలుడు చిన్న విషయానికే తన నూరెళ్ల జీవితానికి ముగింపు పలికాడు. తన కోసం తల్లిదండ్రులు కూలీ పనులు చేస్తున్నారని ఏమాత్రం ఆలోచించలేదు. 14 ఏళ్ల బాలుడు తన తల్లిదండ్రులకు ఫోన్ రిచార్జ్ చేయమని చెప్పాడు. కానీ వారు దాన్ని పట్టించుకోలేదు. బాలుడు... డాటా రిచార్జ్ చేస్తే ఎక్కువ సమయం దానిలోనే నిమగ్నమై ఉంటున్నాడని, వారు రిచార్జ్ చేయలేదు. దీంతో అతను మానసికంగా ఒత్తిడికి లోనయ్యాడు.

ఇంట్లో అమ్మనాన్నలు కూలీపనికి వెళ్లగానే.. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకుని వచ్చి చూసేసరికి తమ కూమారుడు విగత జీవిగా కనిపించాడు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. బాలుడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను చనిపోయాడని వైద్యులు నిర్దారించారు. బాలుడి తల్లిదండ్రులన ఓదార్చడం ఎవరి తరం కాలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికులను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది.

గతంలో ఒడిశాలో బాలికపై అత్యాచారం ఘటన జరిగింది.

Odisha Court Sentences Minor To 10 Years Imprisonment: ఒడిశాలోని కియోంజర్ జిల్లాలో దారుణ ఉదంతం జరిగింది. జాతరకు తీసుకెళ్తానని చెప్పి ఒక బాలుడు..  బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గతంలో జరిగింది. తాజాగా, నిందితుడికి కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. సమాజంలో.. మహిళలపై అఘాయిత్యాలు, వేధింపులను (Molested on Woman) నిరోధించడానికి ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన కొందరు కామాంధులలో మార్పులు రావడం లేదు. ఇప్పటికి మహిళలు, యువతులను టార్గెట్ చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారు.

పూర్తి వివరాలు.. ఒడిశాలోని కియోజంర్ జిల్లాలో దారుణం జరిగింది. ఒక బాలుడు .. బాలికను జాతరకు తీసుకెళ్తానని మాయమాటలు చెప్పాడు. అతని మాయమాటలు నమ్మి.. ఆమె అతనితో వెళ్లింది. ఆ తర్వాత.. ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ ఘటన జరిగిన తర్వాత.. వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనవరి 15, 2017న నేరం చేసినందుకు దోషికి పోక్సో న్యాయమూర్తి సుభాశ్రీ త్రిపాఠి ₹ 5,000 జరిమానా కూడా విధించారు. అత్యాచార బాధితురాలికి ₹ 4 లక్షలు పరిహారంగా చెల్లించాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీని ప్రత్యేక కోర్టు ఆదేశించింది. అదే విధంగా నిందితుడు.. జువైనల్‌లో 21 ఏళ్లు వచ్చే వరకు ఉండాలని ఆతర్వాత.. సాధారణ జైలుకు తరలించాలని కోర్టు అధికారులను ఆదేశించిందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Madhya pradesh, Mobile Data, Student suicide

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు