• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • MADHYA PRADESH POLICE UNLAWFUL BEHAVIOR WITH WOMAN WHO NOT WEAR MASK AK

Police Trash Woman: మహిళను నడిరోడ్డుపై ఇష్టానుసారంగా కొట్టిన పోలీసులు.. వీడియో వైరల్

మహిళను లాక్కెళుతున్న పోలీసులు

తన తల్లితో పోలీసులు ఇలా వ్యవహరించడాన్ని ఆమె కూతురు కూడా ప్రతిఘటించింది. దీంతో పోలీసులు ఆమెను పక్కకు తోసేశారు.

  • Share this:
    పోలీసులు కొన్నిసార్లు చాలా కఠినంగా వ్యవహరిస్తుంటారు. తమ విధి నిర్వహణలో భాగంగా ఒక్కోసారి విచక్షణ కోల్పోతుంటారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఇలాగే జరిగింది. కూరగాయాలు కొనేందుకు తన కూతురితో కలిసి మార్కెట్‌కు వచ్చిన ఓ మహిళ మాస్క్ పెట్టుకోలేదు. దీనిపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను అదుపులోకి తీసుకునేందుకు ఎంతగానో ప్రయత్నించారు. ఇందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో సంయమనం కోల్పోయి ఆమెను ఇష్టానుసారంగా కొట్టారు. జుట్టుపట్టుకుని మరీ ఆమెను పోలీసులు కొట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

    ఈ వీడియోలో ఆమెను ఇద్దరు పోలీసులు లాక్కెళ్లడం కనిపించింది. పలుసార్లు ఆమెను కిందపడేశారు. ఆమెను బలవంతంగా పోలీసు జీపు ఎక్కించేందుకు ప్రయత్నించారు. అయితే ఆమె అందుకు ఒప్పుకోలేదు. తన తల్లితో పోలీసులు ఇలా వ్యవహరించడాన్ని ఆమె కూతురు కూడా ప్రతిఘటించింది. దీంతో పోలీసులు ఆమెను పక్కకు తోసేశారు.



    అయితే అసలు ఆమెపై పోలీసులు అంత కఠినంగా వ్యవహరించడానికి అసలు కారణం ఆమె మాస్క్ ధరించకపోవడమే అని తెలిసింది. మాస్క్ పెట్టుకోకపోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద తప్పే. కానీ అలా చేయనుందుకు ఓ మహిళ పట్ల పోలీసులు మరీ ఇంత దారుణంగా వ్యవహరించడం ఏంటనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
    Published by:Kishore Akkaladevi
    First published: