MADHYA PRADESH POLICE HAVE ARRESTED A WOMAN WHO KILLED HER HUSBAND AND SPENT THE NIGHT WITH HER BOYFRIEND NEAR THE BODY SNR
మధ్యప్రదేశ్‌లో ప్రియుడితో భర్తను చంపించింది.. శవం పక్కనే నైటంతా..
Photo Credit:Youtube
OMG: మధ్యప్రదేశ్‌లో భర్తను అతి కిరాతకంగా హత్య చేయించింది మహిళ. భర్త శవం దగ్గర రాత్రంతా ప్రియుడితో గడిపింది. మర్డర్ కేసులో పగిలిన సెల్‌ఫోన్ ద్వారా లేడీ ఖిలాడీనే ఈ మర్డర్ డ్రామా ఆడిందని గుర్తించారు.
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేయించింది ఓ వివాహిత. అర్ధరాత్రి సమయంలో ప్రియుడ్ని తన ఇంటికి పిలిపించుకొని అతడితోనే భర్తను మర్డర్ చేయించింది. మృతదేహాన్ని పక్కనే పెట్టుకొని తెల్లవారే వరకూ ప్రియుడితో శారీక సుఖాన్ని పొంది అతడ్ని అక్కడి నుంచి పంపించి హైడ్రామా ఆడింది. మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో జరిగిన ఈ మర్డర్ కేసులో సెల్‌ఫోన్ ఆధారంగా మిస్టరీ చేధించారు పోలీసులు. రాజ్‌ఘర్(rajgarh) జిల్లా సుథాలియా (Suthalia)పోలీస్ స్టేషన్ పరిధిలోని బెరియాఖేడి గ్రామానికి చెందిన 30సంవత్సరాల రామ్ దినేష్ మీనా (Ram dinesh meena)ఈనెల 21న హత్యకు గురయ్యాడు. ఇంట్లో నిద్రపోతున్న సమయంలో అతని భార్య జ్యోతి (Jyothi)ఆమె ప్రేమించిన వ్యక్తి చైన్‌సింగ్ లోధా (Chainsingh lodha)అనే యువకుడ్ని ఇంటికి పిలిపించి భర్తను హత్య చేయించింది. రాత్రంతా అతనితో గడిపి తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి భర్తను చంపేశారని అత్త,మామల్ని నమ్మించే ప్రయత్నం చేసింది. జ్యోతిపై అనుమానం వచ్చిన దినేష్‌మీనా తల్లిదండ్రులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. స్పాట్‌కి చేరుకున్న పోలీసులు మృతుని భార్య జ్యోతిని ప్రశ్నించారు. హత్య జరిగిన సమయంలో తాను నిద్రపోతున్నట్లుగా చెప్పింది. సాక్ష్యుల్ని విచారించిన పోలీసులు ఘటన స్తలంలో పగిలిన సెల్‌ఫోన్ (Cell phone)స్వాధీనం చేసుకొని దాన్ని రిపేర్ చేయించారు. అందులో అసలు నిజం బయటపడింది.
భర్త శవం పక్కనే ప్రియుడితో శృంగారం..
మృతుని తల్లిదండ్రుల ఫిర్యాదుతో జ్యోతిని విచారించిన పోలీసులు హత్య జరిగిన సమయంలో పక్కనే ఉన్న తాను నిద్రపోతున్నట్లుగా పోలీసులకు చెప్పింది. పోలీసులు అడిగిన ప్రశ్నలకు పొంతన లేని సమాధానం ఇవ్వడంతో ఆమెను అనుమానితురాలిగా అదుపులోకి తీసుకొని అసలు విషయం రాబట్టారు. మర్డర్ అనంతరం ఇంట్లో దొరికిన పగిలిన ఫోన్‌ని స్వాధీనంచేసుకొని దాన్ని బాగు చేయించారు. అందులో ఈ హత్య జరగడానికి అసలు కారణం తెలిసింది. గ్రామంలో కిరాణషాపు పెట్టుకున్నాడు మృతుడు దినేష్‌మీనా. అదే షాపులో అతని భార్య పాతికేళ్ల జ్యోతి కూర్చునేది. బెరియాఖేడి గ్రామంలో ఉండే చైన్‌సింగ్ లోధా దినేష్ కిరాణషాపులో సరుకులు తీసుకెళ్లేందుకు వచ్చి అతని భార్యతో ప్రేమించాడు. ఆమెతో మాట్లాడేందుకు చాన్‌సింగ్ జ్యోతికి ఓ సెల్‌ఫోన్ కొనిచ్చాడు. ఫోన్‌లో ఇద్దరూ మాట్లాడుకోవడం గమనించిన దినేష్ ఆ ఫోన్‌ని పగలగొట్టాడు. పోలీసులు స్వాదీనం చేసుకున్న ఫోన్ అదే కావడంతో ఈ వివరాలన్ని ఫోన్ రిపేర్ చేయించడంతో బయటపడ్డాయి.
నిందితుల్ని పట్టిచ్చిన సెల్‌ఫోన్..
జ్యోతి సెల్‌ఫోన్‌ని దినేష్ పగలగొట్టడంతో కొద్ది రోజుల తర్వాత మరో సెల్‌ఫోన్ ప్రియురాలికి కానుకగా ఇచ్చాడు చాన్‌సింగ్. ఇద్దరి మధ్య విడదీయలేని బంధం ఏర్పడటంతో దినేష్ భార్యతో గొడవపడ్డాడు. తమ విషయం భర్తకు తెలిసిపోయిందని..అతను ప్రాణాలతో ఉంటే తాము మాట్లాడుకోవం, కలవడం జరగదని భావించి అడ్డుతొలగించుకోవాలని ప్లాన్ వేసింది. అందులో భాగంగానే ఈనెల 21అర్ధరాత్రి ప్రియుడ్ని ఇంటికి పిలిపించి భర్తను అంతమొందించినట్లుగా పోలీసుల విచారణ తేలింది. శారీరక సుఖం కోసం భర్తను మర్డర్ చేయించిన జ్యోతితో పాటు హత్య చేసి చైన్‌సింగ్ లోధాను అరెస్ట్ చేసి జైలుకు పంపారు పోలీసులు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.