మధ్యప్రదేశ్(Madhya pradesh)లో ప్రియురాలిని చంపిన ప్రేమోన్మాదిని పోలీసులు (Police)అరెస్ట్ చేశారు. నాలుగు రోజుల క్రితం ఓ రిసార్ట్(Resort)లో జరిగిన యువతి హత్య కేసులో నిందితుడే ప్రియురాలిని చంపడానికి గల కారణాలతో సహా స్వయంగా తానే చెబుతున్న వీడియో(Video)లను సోషల్ మీడియా (Social media)గ్రూప్‌లో పోస్ట్ చేయడంతో దొరికిపోయాడు. జబల్పూర్(Jabalpur)లోని మేఖ్లా రిసార్ట్‌లో అభిజిత్ పాటిదార్ (Abhijit Patidar)అనే యువకుడు మరో యువతితో కలిసి రిసార్ట్‌లో సరదాగా గడిపారు. అయితే ఈనెల 8వ తేది నాడు యువతి రక్తం మడుగులో పడి ఉంది. ఆమె వెంట వచ్చిన ప్రియుడు మాయమైపోయాడు. మృతురాలి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మిస్టరీని చేధించారు.
ప్రియురాలిని చంపిన ప్రేమోన్మాది..
మధ్యప్రదేశ్ జబల్పూర్లో నాలుగు రోజుల క్రితం దారుణం జరిగింది. మేఖ్లా రిసార్ట్‌లోని రూం నంబర్-5లో యువతిని హత్యకు గురైన రక్తపు మడుగులో పడి ఉంది. యువతిని చంపింది ఎవరో కాదు ..ఆమెతో పాటు రిసార్ట్‌కి వచ్చిన ఆమె ప్రియుడే హతమార్చాడు. ఈ విషయాన్ని తానే చంపిన తర్వాత కసిగా వీడియో రికార్డ్ చేసి యువతి సోషల్ మీడియా హ్యాండిల్లో షేర్ చేశాడు. అయితే కొద్ది సేపటికే ఆ వీడియోని తొలగించాడు. మృతురాలి సోదరి ఫోన్ చేస్తే రిప్లై రాకపోవడంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హత్యోదంతం బయటపడింది.
బ్లాక్మెయిల్ చేసిందనే కసితో..
ఫోన్ సిగ్నల్, కాల్‌డేటా ఆధారంగా యువతి హత్య జరిగిన రిసార్ట్‌కి చేరుకన్న పోలీసులు అత్యంత ఉన్మాదంతో హతమార్చినట్లుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు వీడియోల ఆధారంగా అతనే హత్య చేసినట్లుగా నిర్ధారించుకున్నారు. అయితే కేవలం మృతురాలిని తాను గాఢంగా ప్రేమిస్తే తనకు నమ్మకద్రోహం చేసిందని ..బ్లాక్మెయిల్ చేయడం వల్లే హతమార్చానంటూ రెండో సారి షేర్ చేసిన వీడియోలో వెల్లడించాడు నిందితుడు అభిజిత్ పాటిదార్.
రిసార్ట్‌కు తీసుకెళ్లి మర్డర్..
ప్రియురాలిని ఉన్మాదంతో హతమార్చిన యువకుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో కూడా తానే చంపినట్లుగా నేరస్తుడు పాటిదార్ అంగీకరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అసలు ఆ రాత్రి రిసార్ట్‌లో ఏం జరిగింది...? యువతి ప్రవర్తనపై నిందితుడు అభిజిత్ పాటిదార్‌కు ఎందుకు అంత దారుణానికి పాల్పడ్డాడనే విషయంపై ఆరా తీస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Madhya pradesh, Viral Video