హోమ్ /వార్తలు /క్రైమ్ /

OMG: భార్యను అతి కిరాతకంగా హత్య చేసిన భర్త.. కారణం ఏంటంటే..

OMG: భార్యను అతి కిరాతకంగా హత్య చేసిన భర్త.. కారణం ఏంటంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Madhya pradesh: కట్టుకున్న భార్య రోజు టార్చర్ చేసేది. కొన్నాళ్లు భరించాడు. టార్చర్ మరింత ఎక్కువ కావడంతో తట్టుకొలేక పోయాడు.

కొందరు కామాంధులు మహిళల పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. వారిని హింసిస్తు.. అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కొందరు పెళ్లి చేసుకుని తమ భార్యలకు టార్చర్ చూపిస్తున్నారు. మరికొన్ని చోట్ల భార్యలు కూడా భర్తలను వేధిస్తున్నారు. అయితే, కొందరు పెళ్లి చేసుకుని పని పాట లేకుండా జులాయిగా తిరుగుతుంటారు. ఈ క్రమంలో ఇంట్లో గొడవలు జరుగుతాయి. దీంతో క్షణికావేశంలో ఎదుటివారి ప్రాణాలు తీయడం కానీ, తమ ప్రాణాలను తీసుకొవడం కానీ చేస్తుంటారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. మధ్యప్రదేశ్ లో  (Madhya pradesh) అమానుష ఘటన చోటుచేసుకుంది. జబల్ పూర్ లో శుక్రవారం దారుణం జరిగింది. విభోర్ సాహు అనే వ్యక్తి, రీతు అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజుల పాటు వీరి కాపురం సజావుగా సాగింది. అయితే, విభోర్ సాహు పనిపాట లేకుండా ఎప్పుడు ఇంట్లోనే ఉండేవాడు. అతడిని పలుమార్లు పని చూసుకోవాలని భార్య చెప్పింది. అతను ఇంట్లోనే ఉండేవాడు. ప్రతి దానికి ఇంట్లో వారిమీదనే డిపెండ్ అయ్యేవాడు.

ఈ క్రమంలో ఇద్దరి మధ్య తరచుగా (Family disputes) గొడవలు జరిగేవి. శుక్రవారం రోజు ఇంట్లో అత్త, మరిది ఇంటి నుంచి బైటకు వెళ్లారు. దీంతో ఇద్దరు గొడవ పడ్డారు. ఎందుకు పని చూసుకొవట్లేదని, ఎలా పోషిస్తారంటూ, భర్తను నోటికొచ్చినట్లు తిట్టింది. దీంతో అతను కోపంలో రెచ్చిపోయాడు. విచక్షణ కోల్పోయి.. కత్తెర తీసుకుని భార్యపై దాడిచేశాడు. ఆమె గొంతు కోసి హతమార్చాడు. ఆతర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కాసేటికి బయటకు వెళ్లిన అత్త, మరిది ఇంటికి వచ్చి చూసేసరికి ఇద్దరు విగత జీవులుగా కన్పించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసుల విచారణలో భార్య భర్తలు తరచుగా ఉద్యోగం విషయంలో గొడవలు పడేవారని తెలిసింది. దీంతో కోపంలో దారుణానికి ఒడిగట్టి, తనను తాను సూసైడ్ చేసుకున్నట్లు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా ఒక కోడలు అత్తపై దారుణానికి ఒడగట్టింది.

మధ్య ప్రదేశ్ (Madhya pradesh) లోని దామోహ్ జిల్లా దారుణం జరిగింది. కొడియా గ్రామంలోని హట్టా ప్రాంతంలో ఓ కోడలు తన అత్తను అత్యంత దారుణంగా కొట్టి చంపింది. కొడియా గ్రామంలో నివసిస్తున్న అజయ్ బర్మన్ అనే యువకుడు తన తల్లి నన్నీబాయితో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో అజయ్ బర్మన్ కు, మరో యువతితో పెళ్లయింది. అయితే, కోడలు ఎప్పుడు చూసిన ఫోన్ లోనే ఉండేది. దీంతో అత్త నన్నీబాయి విసిగిపోయింది. పద్ధతి మార్చుకొవాలని సూచించింది. కానీ ఆమె మారలేదు. పైగా అత్తపై కోపం పెంచుకుంది.ఎలాగైన అత్తను తప్పించాలను కుంది. ఒక రోజు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

కోడలు.. కోపంతో అత్తను కర్రలతో,రాడ్ లతో ఇష్టమోచ్చినట్లు కొట్టింది. దీంతో ఆమె రక్తపుమడుగులో (Brutally murdered) కింద పడింది. ఆ తర్వాత.. కోడలు తన భర్తకు ఫోన్ చేసింది. అత్త, ఎక్కడో పడి గాయాలతో ఇంటికి వచ్చిందని కట్టుకథ అల్లింది. దీంతో అతను వెంటనే ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే తన తల్లి చనిపోయింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. భార్య ప్రవర్తన అనుమానస్పదంగా ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమెను అదుపులోనికి తీసుకుని విచారించారు దీంతో ఆమె నిజాన్ని ఒప్పుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

First published:

Tags: Brutally murder, Crime news, Madhya pradesh

ఉత్తమ కథలు