ప్రస్తుతం సమాజంలో కొంత మంది కణికావేశంలో దారుణమైన నేరాలకు పాల్పడుతున్నారు. కొత్త బట్టలు కొనివ్వలేదని, సెల్ ఫోన్ కొనివ్వలేదని సూసైడ్ చేసుకుంటున్నారు. మరికొందరు ప్రియురాలు, ప్రేమను అంగీకరించలేదని, ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యామని కారణలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇంకొందరు ఉద్యోగం రాలేదని చిన్న పాటి కారణాలతోనే ఆత్మహత్యలు (Suicide) చేసుకుంటున్నారు. మరికొందరు తమ భార్యలు.. చికెన్ కూర వండలేదని, ఇల్లు సరిగ్గా ఉంచలేదని వారిపై దాడులకు పాల్పడుతున్నారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు.. మధ్య ప్రదేశ్ లో (Madhya pradesh) అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. దేవాస్ జిల్లాలోని హత్పిప్లియా పట్టణంలో ఈ ఉదంతం జరిగింది. తిల్యఖేడీ కి చెందిన దినేష్ మాలి, యశోద మాలి భార్య భర్తలు. ఈ క్రమంలో దినేష్ మాలీ పనిమీద ఇంటినుంచి బయటకు వెళ్లి సాయంత్రం ఇంటికి చేరుకున్నాడు. భార్యకు ఆకలేస్తుందని.. వెంటనే వడ్డించాలని కోరాడు. భార్య మాత్రం.. వంట అవ్వలేదని, కాసేపు ఆగాలని ఏవేవో కహానీలు చెప్పింది. దీంతో కోపంతో విచక్షణ కోల్పోయాడు. అక్కడే ఉన్న బట్టలు ఉతికే బ్యాట్ (Man hits wife with laundry bat) తీసుకుని ఆమె తలపై బలంగా దాడిచేశారు. అడ్డు వచ్చిన కూతురిపై కూడా దాడిచేశాడు.
ఆ తర్వాత.. ఇంటిలో ఉన్న బావి దగ్గరకు తీసుకెళ్లి తోసేశాడు. ఆ తర్వాత... అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే కూతురు సమీప బంధువుకు ఫోన్ చేసి చెప్పింది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితురాలిని బావి నుంచి బైటకు తీశారు. ఆమెను ఆస్పత్రికి తరలించారు. యశోద మాలిని చూసిన వైద్యులు అప్పటికే చనిపోయిందని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదిలా ఉండగా ఒక వ్యక్తి ఆరు బయట నిద్రిస్తున్న భార్యను హత్య చేశాడు.
ఉత్తర ప్రదేశ్ లో (Uttar pradesh) దారుణం చోటు చేసుకుంది. అసోథమ్ ప్రాంతంలో శివబరన్ శర్మ (68), లలిత (66) దంపతులు. వీరికి బబ్లూ అనే కొడుకు ఉన్నాడు. కాగా, శివబరన్ శర్మ బుధవారం.. తన భార్య ఆరుబయట పడుకుని ఉండటాన్ని గమనించాడు. ఆ తర్వాత.. మెల్లగా వెళ్లి నిద్రలో ఉన్నన లలితపై కత్తితో దాడిచేసి (brutally murder) హత్యచేశాడు. ఆ తర్వాత అక్కడే ఒక పక్కన ఏమి జరగనట్లు కూర్చొని ఉన్నాడు.
పొద్దున తన తల్లి రక్తపు మడుగులో ఉండటాన్ని బబ్లూ గమనించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. శివబరన్ తాను.. తన భార్యను హత్య చేసినట్లు అంగీకరించాడు. వెంటనే అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.