HOME »NEWS »CRIME »madhya pradesh man dies after friend inserts air compressor into rectum in katni district su

మలబద్దకం నుంచి రిలీఫ్ కోసం.. పురీషనాళంలోకి గాలి నింపడంతో..

మలబద్దకం నుంచి రిలీఫ్ కోసం.. పురీషనాళంలోకి గాలి నింపడంతో..
ప్రతీకాత్మక చిత్రం

సొంత వైద్యం కొన్నిచోట్ల ప్రాణాలను బలితీసుకుంటున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. కానీ జనాల్లో మాత్రం మార్పు రావడం లేదు.

  • Share this:
    సొంత వైద్యం కొన్నిచోట్ల ప్రాణాలను బలితీసుకుంటున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. కానీ జనాల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా మలబద్దకంతో బాధపడుతున్న ఓ వ్యక్తి స్నేహితుడి సాయం కోరాడు. తాను చెప్పిన విధంగా మూత్రనాళంలో గాలి నింపాలని కోరాడు. తీరా మూత్రనాళానికి ఎయిర్ కంప్రెస్ బిగించడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో కాట్ని జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. సుఖ్‌రామ్ యాదవ్ అనే వ్యక్తి కొంతకాలంగా మలబద్దకంతో బాధపడుతున్నాడు. దీని నుంచి ఉపశమనం పొందేందుకు తన మూత్రనాళంలోకి గాలి నింపాలని భావించాడు. ఇందుకోసం సాయం చేయాల్సిందిగా ఉమారియా ప్రాంతానికి చెందిన తన స్నేహితుడు వినోద్ ఠాకూర్‌(35)ను కోరాడు. తన మూత్రనాళంలోకి గాలిని పంప్ చేయాల్సిందిగా వినోద్‌కు చెప్పాడు. అయితే దాని వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయని ఆలోచించకుండా.. సుఖ్‌రామ్ చెప్పినట్టుగా చేశాడు.

    సుఖ్‌రామ్ మూత్రనాళంలో ఎయిర్ కంప్రెసర్ బిగించాను. దీంతో కొద్దిసేటికే అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో కంగారు పడిపోయిన వినోద్ వెంటనే అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అడిని జబల్‌పూర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతడికి మూడు సర్జరీలు చేశారు. అయితే వైద్యులు ఎంతగా ప్రయత్నించినప్పటికీ సుఖ్‌రామ్‌ను కాపాడలేకపోయారు. అంతర్గత అవయవాలు దెబ్బతినడంతో సుఖ్‌రామ్ మరణించాడని వైద్యులు తెలిపారు.



    ఈ ఘటనపై మాదవ్‌నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ సంజయ్ దుబే మాట్లాడుతూ.. నిందితుడు వినోద్ ఠాకూర్‌పై ఐపీసీ సెక్షన్ 337 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు తెలిపారు. వినోద్‌ను అరెస్ట్ చేసిన్టటు కూడా వెల్లడించారు. వినోద్ నేరాన్ని అంగీకరించాడని తెలిపారు. కాగా, నిందితుడు వినోద్.. అతడు కాట్ని జిల్లాలోని భరోలి గ్రామంలోని ఓ ప్రాసెసింగ్ యూనిట్ ఆఫ్ పల్సెస్‌లో పనిచేస్తున్నాడు.

    ఇక, మధ్యప్రదేశ్‌లో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఇది రెండోది. గత ఏడాది శివపూరి జిల్లాలో ఓ 40 ఏళ్ల కార్మికుడి మూత్ర నాళంలో ఎయిర్ కంప్రెసర్ బిగించిన ముగ్గురు వ్యక్తులు అతన్ని హత్య చేశారు.
    Published by:Sumanth Kanukula
    First published:January 17, 2021, 08:01 IST