Home /News /crime /

MADHYA PRADESH MAN DIES AFTER FATHER CHOPS OFF HIS HAND IN FIGHT OVER BIKE KEYS COPS PAH

OMG: నువ్వేం తండ్రి వయ్యా .. ఇంత చిన్న విషయానికే ఇలా చేయ్యాలా..?

దర్యాప్తు చేపట్టిన అధికారులు

దర్యాప్తు చేపట్టిన అధికారులు

Madhya pradesh: తండ్రి, కొడుకు సరదాగా బయటకు వెళ్తున్నారు. అంతలో మరో కొడుకు.. బైక్ కీ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది.

కొన్నిసార్లు పిల్లలు తమ పెద్దలు చెప్పిన మాటలను అసలు పట్టించుకోరు. ఏది వద్దని చెబితే అదిమాత్రమే చేయడానికి ఇంట్రెస్ట్ చూయిస్తుంటారు. కొన్ని సందర్భాలలో మొండిగా ముందుకు వెళ్తుంటారు. కొంత మంది బిడ్డలు డబ్బులు కావాలని, సెల్ ఫోన్ కొనివ్వాలని, ప్రాపర్టీ తమ పేరుమీద రాయాలని వేధిస్తుంటారు. ఒక వేళ ఇవ్వకపోతే.. గొడవలకు దిగుతుంటారు. కొన్నిసార్లు.. వీరి అన్న మాటలకు ఒప్పుకొకపోతే.. తల్లిదండ్రులమీద తిరగబడుతుంటారు. కొన్నిసార్లు.. గొడవ పడి, హత్యలు చేయడానికి కూడా వెనుకాడరు. ఇలాంటి కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. మధ్యప్రదేశ్ లో (Madhya pradesh) దారుణమైన ఘటన జరిగింది. దామోహ్ లోని పఠారియా ప్రాంతంలోని బోబాయి గ్రామంలో అమానుష ఉదంతం జరిగింది. మోతీ పటేల్ అనే వ్యక్తికి, రామ్ కిసాన్, సంతోష్ పాటేల్ అనే ఇద్దరు కొడుకులు. అయితే.. బయటకు వెళ్లాలని.. మోతీ పటేల్, సంతోష్ కు బైక్ ఇవ్వాలని కోరాడు. దీనికి సంతోషల్ నిరాకరించాడు.



ఈ క్రమంలో.. మోతీ పటేల్, రామ్ లు కలసి.. సంతోష్ పటేల్ చేయిపట్టుకున్నారు. అతని చేయిని బలవంతంగా చెక్క బల్లపై ఉంచి, కోసేశారు. దీంతో తీవ్ర రక్త స్రావంతో అతగాడు ఆస్పత్రికి వెళ్లాడు. అప్పటికే ఎక్కువగా రక్తం కారిపోవడంతో.. అతగాడు అపస్మారక స్థితిలోనికి వెళ్లిపోయాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా కన్నతల్లి కసాయిగా ప్రవర్తించింది.

పూర్తి వివరాలు.. కర్ణాటకలో (Karnataka)  దారుణ ఘటన జరిగింది. బెంగళూరులోని ఎస్ఆర్ నగర్ లో ఉన్న ఒక ఇంట్లో దారుణ ఘటన జరిగింది. ఒక మహిళ నాలుగో అంతస్థులో బాల్కనీలో నిలబడీ తన కూతురుని కిందకు విసిరేసింది. దీంతో చిన్నారి తలపగలి అక్కడే చనిపోయింది.  ఈ క్రమంలో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల ప్రకారం.. నాలుగేళ్ల బాలికకు మాటలు రావని, వినబడదని అందుకే తల్లి ఇలా చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాకుండా బాలిక తల్లి, సాఫ్ట్ వేర్ ఇంజినీర్, తల్లి డెంటల్ డాక్టర్. అయితే.. తల్లి మానసిక ప్రవర్తనపై కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో మహిళ కొన్నిరోజులుగా తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం తల్లి కింద విసిరేసిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ క్లిప్పింగ్స్ వైరల్ గా (viral news) మారాయి.
Published by:Paresh Inamdar
First published:

Tags: Burtally murder, Crime news, Madhya pradesh

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు