Home /News /crime /

కుక్కపై లైంగిక దాడికి పాల్పడ్డ వ్యక్తి.. వీడియో వైరల్ కావడంతో..

కుక్కపై లైంగిక దాడికి పాల్పడ్డ వ్యక్తి.. వీడియో వైరల్ కావడంతో..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు మూగ జీవాలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ఇండియాలో కూడా ఇలాంటి ఘటనలు ఎక్కడో ఓ చోట వెలుగుచూస్తునే ఉన్నాయి.

    కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు మూగ జీవాలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ఇండియాలో కూడా ఇలాంటి ఘటనలు ఎక్కడో ఓ చోట వెలుగుచూస్తునే ఉన్నాయి. అయితే తాజాగా ఓ వ్యక్తి కుక్కపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారడంతో అతని వికృత చర్య వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. బరేలా స్టార్ సిటీలోని నివాసం ఉంటున్న 54 ఏళ్ల వ్యక్తి ఆడ కుక్కను రేప్ చేశాడు. ఇంటి బయట మెట్ల మీద కూర్చున్న అతడు కుక్కను లైంగికంగా హింసించాడు. అయితే ఇందుకు సంబంధించిన దృశ్యాలు కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అవి కాస్త వైరల్‌గా మారాయి. దీంతో కొందరు జంతు ప్రేమికులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పోలీసులు నిందితుడిపై సెక్షన్ 377(unnatural sex)తో పాటుగా, జంతువులతో క్రూరంగా ప్రవర్తించనందుకు కూడా కేసు నమోదు చేశారు.

    దీంతో పోలీసులు నిందితుడిని స్టేషన్‌కు పిలిపించి విచారణ చేపట్టారు. తొలుత ఈ ఆరోపణలను ఖండించిన ఆ వ్యక్తి.. వీడియోను చూపించడంతో చివరకు తన తప్పును అంగీకరించాడు. అతని అరెస్ట్ చేసిన పోలీసులు జిల్లా కోర్టు మందు హాజరుపరిచారు. అనంతరం అతడిని కస్టడీకి తరలించారు. అయితే నిందితుడు చాలా అతను కుక్కను రేప్ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

    ఇక, మూగజీవాలను హింసించేవారిని కఠినంగా శిక్షించాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Crime news, Dog, Madhya pradesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు