Home /News /crime /

MADHYA PRADESH LADY SHO CAUGHT RED HANDED ACCEPTING BRIBE AS PROTECTION MONEY PAH

OMG: పోలీసు ఉద్యోగం.. ఆపై ఒక మహిళా అధికారివై ఉండి  ఇంతలా దిగజారాలా.. పరువును బజారుకు ఈడ్చుకున్నావు కదమ్మా..

అదుపు లోకి తీసుకున్న అధికారులు

అదుపు లోకి తీసుకున్న అధికారులు

Madhya pradesh: సమాజంలో పోలీసులకు ఒక గొప్ప స్థానం ఉంది. తమ ప్రాణాలను పణంగా పెట్టి నేరాలు జరగకుండా చూస్తారు. అలాంటి ఉద్యోగంలో ఉన్న ఒక మహిళా పోలీసు, ఆ శాఖకే చెడ్డ పేరు తీసుకొచ్చింది.

Madhya Pradesh Lady SHO caught red handed: ప్రస్తుత సమాజంలో ప్రభుత్వ అధికారులకు ఒక ప్రత్యేక మైన స్థానం ఉంది.  వారిని అందరు గౌరవిస్తారు.  సమాజంలో కొందరు ప్రభుత్వ అధికారులు తప్పులు చేయడం వల్ల మిగతా వారికి అదే పేరు వస్తుంది. ఒక డిపార్ట్ మెంట్ లో ఏ ఒక్కరు తప్పుచేసిన మిగతా వారందరిని కూడా సమాజం తప్పుపడుతుంది. ప్రభుత్వం ఉద్యోగం కోసం ఎంతో కష్టపడతారు. తీరా ఉద్యోగం వచ్చాక.. చిన్న వాటి కోసం తమ పరువును బజారున ఈడ్చుకుంటారు. కొందరు అధికారులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అనేక మోసాలు, నేరాలకు పాల్పడుతున్నారు. సమాజంలో ఒక ఆదర్శంగా ఉండాల్సిన వారు.. సమాజంలో తలెత్తుకోలేని పనులు చేస్తున్నారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. మధ్య ప్రదేశ్ లోని అగర్ మాల్వా జిల్లాలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ కు మున్నిపరిహర్ అనే మహిళ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా పనిచేస్తుంది. ఆమె ఆ ప్రాంతంలో నేరాలు, బెట్టింగ్ లను నియంత్రించే బదులు, వారిని ప్రొత్సహించింది. అంతటితో ఆగకుండా.. ప్రతినెల మాముళ్లు ఇచ్చుకోవాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలో ఆమె ప్రతి నెల దాదాపు.. 20,000 వేల రూపాయలు సొమ్ము ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకుంది.

అయితే, కొన్ని నెలలుగా కొంత మంది ఆ ప్రాంతంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఈ మధ్య వారు బెట్టింగ్ ఆపేయాలని నిర్ణయించుకున్నారు. కానీ దీనికి మున్ని పరివార్ ఒప్పుకోలేదు. అదే విధంగా బెట్టింగ్ రాకేట్ కొనసాగించాలని బలవంతం చేసింది. ఈ క్రమంలో అధికారి వేధింపులు భరించలేక కొందరు సీబీఐ అధికారులను సంప్రదించారు. వారు కొంత డబ్బు ఇచ్చి అధికారివద్దకు పంపారు. సోమవారం  మహిళా స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు రూ. 29,000 లంచం తీసుకుంటుండగా , ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర కలకలంగా మారింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు విచారణ చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Madhya pradesh, Police arrest, WOMAN

తదుపరి వార్తలు