హోమ్ /వార్తలు /క్రైమ్ /

OMG : పడకగదిలో భర్త నీచపు పనులు .. వీడియోలు తీసి భార్యను కోటి రూపాయలు ఇవ్వమని బ్లాక్‌మెయిల్

OMG : పడకగదిలో భర్త నీచపు పనులు .. వీడియోలు తీసి భార్యను కోటి రూపాయలు ఇవ్వమని బ్లాక్‌మెయిల్

(Photo Credit:Youtube)

(Photo Credit:Youtube)

OMG: కట్టుకున్న భర్త భార్య పాలిట శాడిస్ట్‌గా మారాడు. డబ్బు, తన నీచమైన కోర్కెలు తీర్చుకునేందుకు భార్యను ఓ ఆట బొమ్మగా మార్చి బ్లాక్‌మెయిల్ చేశాడు. భర్త పెట్టే టార్చర్‌ను నాలుగేళ్లుగా భరిస్తూ వచ్చిన బాధితురాలు చివరగా పోలీసుల ముందు భర్త బండారం బయటపెట్టింది.

ఇంకా చదవండి ...

పెళ్లి జరిగిన తర్వాత యువతికి భర్తే సంరక్షకుడు. మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లో మాత్రం భర్తే ఓ దుర్మార్గుడిగా అవతారమెత్తాడు. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ప్రవర్తించాడు. భార్య శీలానికి వెల కడుతూ రోజూ నిత్యం బ్లాక్ మెయిల్(Blackmail)చేస్తూ వచ్చాడు. భర్త టార్చర్ భరించలేక మానసిక క్షోభ తట్టుకోలేక బాధితురాలు మహిళా పోలీస్‌ స్టేషన్‌(Police Station)కి వెళ్లి భర్త బండారాన్ని బయటపెట్టింది. మొగుడి రూపంలో ఉన్న శాడిస్ట్‌(Sadist)గురించి పూర్తిగా తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు.

భర్త కాదు శాడిస్ట్..

మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని లసుడియా పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగరిక కాలనీలో నివసిస్తున్న 30సంవత్సరాల యువతికి 2018లో కాన్పూర్‌లోని యువకుడితో గ్రాండ్‌గా వివాహం జరిగింది. అబ్బాయి కోరినట్లుగా ఇండోర్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో వివాహం జరిపించారు అమ్మాయి తల్లిదండ్రులు. వివాహం సందర్భంగా కట్నకానుల రూపంలో 40 తులాల బంగారం, లగ్జరీ కారుతో పాటు ఇంట్లోకి అవసరమయ్యే వస్తువులన్నీ కట్టబెట్టారు. పెళ్లి జరిగిన తర్వాత హనీమూన్ పేరుతో కాన్పూర్‌లోని ఓ హోటల్‌కి తీసుకెళ్లిన భర్త ఆమెను వర్ణించలేనంతగా ఇబ్బంది పెట్టాడు. శారీరక కోరిక తీర్చుకోవడంతో పాటు శాడిస్ట్‌లా బిబేవ్ చేశాడు. ఫస్ట్ నైట్ నుంచి భర్త నీచమైన పనుల్ని మహిళ భరిస్తూ వచ్చింది.

ఇది చదవండి : స్నేహితుడిని దారుణంగా హత్య చేసి.. అతని భార్యతో కాపురం.. ఆ తర్వాత ఏమైందంటే?భార్యతో నీచమైన పనులు..

కట్టుకున్న భర్తలో ఆమె గమనించని మరో దుర్మార్గపు కోణం ఆలస్యంగా బయటపడింది. భార్య స్నానం చేస్తున్నా, డ్రెస్‌లు మార్చుకుంటున్న ప్రదేశాల్లో కెమెరాలు అమర్చి ఆమె నగ్నవీడియోలను షూట్ చేసి వాటిని చూపించి బ్లాక్‌ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. కాన్పూర్‌కి చెందిన ఈ కిరాతకపు భర్త చేస్తున్న దుర్మార్గపు చర్యలను ఖండించాల్సిన కుటుంబ సభ్యులు అతడికి సపోర్ట్‌గా నిలబడ్డారు. బాధితురాలిని స్వయంగా డబ్బు కోసం బ్లాక్‌మెయిల్ చేశాడు. తాను రహస్యంగా తీసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తానని లేదంటే తనకు కోటి రూపాయలు ఇవ్వాలని మహిళకు చెప్పాడు.


డబ్బు కోసం భార్యనే బ్లాక్‌మెయిల్..

బాధితురాలు భర్త చేసే వెదవ వేషాలు భరించలేకపోయింది. కన్నవాళ్ల దగ్గర నుంచి కోటి రూపాయలు తెచ్చి అలాంటి శాడిస్ట్‌కి ఇవ్వడం సరికాదని భావించి పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసింది. బాధితురాలు చెప్పిన మాటలను ముందుగా నమ్మని పోలీసులు తమదైన స్టైల్లో విచారించి, సాక్ష్యాలను పరిశీలించడంతో భర్త ఓ శాడిస్ట్‌తో పోల్చారు. బాధితురాలి భర్తతో పాటు అత్తమామ, ఇంట్లో ఉంటున్న ఆడపడుచుపై అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈకేసులో విచారణ పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా చూస్తామని పోలీసులు తెలిపారు.

ఇది చదవండి : మాయమాటలు చెప్పి ఏడాది పాటు మోజు తీర్చుకున్నాడు.. ఆ ఒక్కమాట అడగ్గానే యువతి ఇంటికి వెళ్లి..

First published:

Tags: Crime news, Madhya pradesh

ఉత్తమ కథలు