Home /News /crime /

MADHYA PRADESH HOCKEY PLAYERS HUT DEMOLISHED IN ANTI ENCROACHMENT DRIVE PAH

OMG: జాతీయ హకీ ప్లేయర్ కి ఘోర అవమానం.. అతను ఉంటున్న ఇంటిని కూల్చేసిన అధికారులు..

సాగు దావర్ ఇంటిని కూల్చేస్తున్న అధికారులు

సాగు దావర్ ఇంటిని కూల్చేస్తున్న అధికారులు

Madhya Pradesh: మందసౌర్ జిల్లాలో జాతీయ హకీ క్రీడాకారిణికి ఘోరమైన అవమానం జరిగింది. ఆమె నివాస సముదాయాన్ని అధికారులు కూల్చివేశారు.

మధ్య ప్రదేశ్ లో (Madhya pradesh) అధికారులు అక్రమంగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్న వారిపై కొరడా ఝుళిపించారు. మందసౌర్ ప్రాంతంలో అధికారులు అక్రమంగా ఉన్న నివాస సముదాయాలను స్పెషల్ డ్రైవ్ చేపట్టి మరీ కూల్చడం ప్రారంభించారు. దీనిలో జాతీయ స్థాయి హకీ ప్లేయర్ (National Hockey player) సాగు దావర్ (Sagu dawar House) ఇల్లు కూడా ఉంది. అధికారులు  తమ ఇల్లు కూల్చవద్దని ఎంతగా ప్రాధేయ పడిన వినిపించుకొకుండా కూల్చడం ప్రారంభించారు. తాము ఎన్నో దశాబ్దాలుగా ఇక్కడే ఉంటున్నామని తెలిపారు. అయినప్పటికి అధికారులు వినిపించుకోలేదు.

దీంతో  కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య (Suicide attempt) చేసుకొవడానికి కూడా సాగు దావర్  ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అతని చేతిలో నుంచి కిరోసిన్ బాటిల్ ను లాక్కున్నారు. వారిని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాగు దావర్ మాట్లాడుతూ.. అధికారుల తమ పట్ల దారుణంగా ప్రవర్తిచారని ఆవేదన వ్యక్తం చేసింది. తమకు రెండు,మూడు రోజులు గడువు ఇవ్వాలని కోరామని.. అప్పుడు తమ వస్తువులు,తీసుకుని వెళ్లిపోతామని చెప్పారు.

అయినా.. అధికారులు వినిపించుకొకుండా తమ ఇళ్లను కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఆక్రమణలను తొలగించిన తర్వాత.. అక్కడ క్రీడాకారుల కోసం హస్టల్ నిర్మించడానికి ఆ భూమిని ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే విధంగా, గుడిసెలలో నివసించే వారికి మందసౌర్ జిల్లాలోని అలవాడ ఖేడి ప్రాతంలో ప్రత్యామ్నాయ భూమిని కేటాయించామని అధికారులు తెలిపారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Hockey, House, Madhya pradesh

తదుపరి వార్తలు