Ragging Suicide Case: ర్యాగింగ్ కేసులో కోర్టు సంచలన తీర్పు.. నలుగురు యువతులకు..

ప్రతీకాత్మక చిత్రం

కాలేజ్ సీనియర్ల ర్యాగింగ్, వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన యువతి కేసులో దాదాపు ఏడున్నర ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు వెలువరించింది.

  • Share this:
    కాలేజ్ సీనియర్ల ర్యాగింగ్, వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన యువతి కేసులో దాదాపు ఏడున్నర ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో నలుగురు యువతులను దోషులుగా తేల్చిన కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వారికి ఐదేళ్ల చొప్పున జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.
    ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో చోటుచేసుకుంది. ర్యాగింగ్ భూతానికి బలైన యువతి కేసు విచారణ చేపట్టిన అడిషనల్ జిల్లా జడ్డి అమిత్ రంజన్ ఈ తీర్పు వెలువరించారు. అలాగే నలుగురు దోషులకు రూ. 2000 చొప్పున జరిమానా విధించారు. వివరాలు.. భోపా‌లోని ఆర్కేడీఎఫ్ కాలేజ్‌లో బీ ఫార్మసీ సెకండీయర్ చదువుతున్న 18 ఏళ్ల అనిత శర్మ 2013 ఆగస్టు 13న ఆత్మహత్య చేసుకుంది. భోపాల్ కమల నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీవన్ విహార్ సోసైటీలోని తన ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది.

    తాను చనిపోవడానికి ముందు అనిత ఓ సూసైడ్ నోట్‌ను రాసింది. "నా చావుకు నలుగురు సీనియర్లతో పాటుగా, ఓ కాలేజ్ ఫ్యాకల్టీ మెంబర్ కూడా కారణం. కాలేజ్‌లో చేరినప్పటి నుంచి ఆ నలుగురు సీనియర్లు నన్ను వేధించడం మొదలుపెట్టారు. తనతో మిడ్ సెమిస్టర్ కాపీస్‌ను తనతో రాయించారు. ఈ విషయాన్ని ఫ్యాకల్టీ మెంబర్ మనీష్ గుప్తా దృష్టికి తీసుకెళ్లగా.. అతడు కాలేజ్‌లో కొనసాగాలంటే సీనియర్లు చెప్పినట్టు నడుచుకోవాలని అన్నాడు. నేను ఫ్యాకల్టీ మెంబర్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలుసకున్నా నలుగురు సీనియర్ గర్ల్స్ మరింతగా వేధించడం మొదలుపెట్టారు. తనపై యాసిడ్ పోస్తానని బెదిరించారు. రేప్ చేపిస్తామని కూడా హెచ్చరించారు"అని అనిత సూసైడ్ నోట్‌లో పేర్కొంది.

    ఈ ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. నేషనల్ హ్యుమన్ రైట్స్ కమిషన్ కూడా దీనిపై సీరియస్‌గా స్పందించింది. ఇక, తాజాగా ఈ కేసులో నిందితులుగా ఉన్న నిధి మాగ్రే, దీప్తి సోలంకి, దివ్యన్షి శర్మ, కృతి గౌర్‌లను కోర్టు దోషులుగా తేల్చి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఐదో నిందితుడిగా ఉన్న ఫ్యాకల్టీ మెంబర్ మనీష్ గుప్తాకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అతడిని నిర్దోషిగా ప్రకటించింది.
    Published by:Sumanth Kanukula
    First published: