భార్య ఇంట్లో లేని సమయంలో కూతరిపై లైంగిక దాడి.. బంధువుల ఇంట్లో ఉన్న కూడా వదలని కీచకుడు

ప్రతీకాత్మక చిత్రం

కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన ఓ తండ్రి కీచకుడిగా మారాడు. కన్నకూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు.

 • Share this:
  కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన ఓ తండ్రి కీచకుడిగా మారాడు. కన్నకూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏడాదిపాటు పలుమార్లు రేప్ చేసి.. ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. తల్లి సాయంతో బాధిత బాలిక పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. భోపాల్‌లోని జహంగీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామంలో 6వ తరగతి చదవుతున్న బాలికపై ఆమె తండ్రి రేప్ చేశాడు. ఏడాది క్రితం బాలిక తల్లి పని మీద బయటకు వెళ్లిన సమయంలో అతడు తొలిసారిగా బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పలుమార్లు బాలికపై అత్యాచారం చేశాడు.ఇక, కొద్ది రోజుల క్రితం బాలిక బామ్మ చనిపోవడంతో.. ఆమె అక్కడికి వెళ్లింది. తాతయ్యకు తోడుగా అక్కడే ఉంటుంది.

  అయితే ఫిబ్రవరి 28న అక్కడికి చేరుకున్న బాలిక తండ్రి.. మరోసారి నీచపు చర్యకు పాల్పడ్డాడు. మద్యం మత్తులో మరోసారి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇక, తండ్రి ఆగడాలు భరించలేకపోయిన బాలిక.. తల్లికి అసలు విషయం చెప్పింది. దీంతో బాలిక తల్లి.. భర్తను నిలదీసింది. అయితే అది జీర్ణించుకోలేని బాలిక తండ్రి.. వారిద్దరిపై దాడి చేశాడు. ఈ క్రమంలోనే బాలిక తల్లి సాయంతో పోలీసులను ఆశ్రయించింది.

  ఏడాదికిపైగా తండ్రి తనపై లైంగికదాడికి పాల్పడుతున్నాడని బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై మొదటిసారి దాడి జరిగినప్పుడు తన తమ్ముళ్లు కూడా ఇంట్లోనే ఉన్నారని చెప్పింది. అయితే తన తండ్రిని అరెస్ట్ చేస్తారనే భయంతో ఈ విషయం గురించి ఇన్ని రోజులు ఎవరికి చెప్పలేదని బాలిక పోలీసులతో చెప్పింది.ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. ఇక, బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమెపై రేప్ జరిగినట్టు నిర్ధారణ అయిందని పోలీసులు తెలిపారు.
  Published by:Sumanth Kanukula
  First published: