Honeytrap : హనీట్రాప్‌లో షాకింగ్ విషయాలు... మాజీ ఎంపీకి చెందిన 31 సీడీలు బహిర్గతం

Honey Trap Sex Racket : ఒకటా రెండా... 31 సీడీలు... అన్నీ బూతు పురాణాలే. దీన్ని బట్టీ అర్థం చేసుకోవచ్చు... హనీ ట్రాప్ ఏ రేంజ్‌లో సాగిందో. దర్యాప్తు చేస్తున్న సిట్ బృందానికి మైండ్ బ్లాంకవుతోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: September 30, 2019, 12:09 PM IST
Honeytrap : హనీట్రాప్‌లో షాకింగ్ విషయాలు... మాజీ ఎంపీకి చెందిన 31 సీడీలు బహిర్గతం
ఈ దాడిలో ఇద్దరు నిర్వహకులతో పాటు, ఒక విటుడు, ఏడుగురు బాధిత మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలం నుంచి 32 వేల నగదు, 3 సెల్ ఫోన్లు, స్వాధీనం చేసుకున్నారు.
  • Share this:
Honey Trap Scandal : హనీట్రాప్ అంశం మధ్యప్రదేశ్ రాజకీయాల్ని కుదిపేస్తోంది. ఈ సెక్స్ రాకెట్‌లో ఓ మాజీ ఎంపీ ఎలా బుక్కైందీ తాజాగా బయటపడింది. ఆ మాజీ ఎంపీకి సంబంధించిన 31 సీడీల బూతు పురాణాలు బయటపడ్డాయి. ఈ సీడీలను అడ్డం పెట్టుకొని... ఓ మహిళా వగలాడి... తరచుగా ఆ ప్రజాప్రతినిధిని బ్లాక్‌మెయిల్ చేసినట్లు తెలిసింది. లోక్‌సభ ఎన్నికల సమయంలో తనకు టికెట్ ఇవ్వరేమో అన్న భయంతో... ఆ మాజీ ఎంపీ... ఆమెకు ఫ్లైట్ టికెట్ ఇచ్చి... దుబాయ్‌కి పంపి... కొన్ని నెలలపాటూ ఆమెను అక్కడే ఉంచి... అయిన ఖర్చులన్నీ ఆయనే భరించిన అంశం కూడా తెరపైకి వచ్చింది. విశ్వసనీయ వర్గాల ప్రకారం... సిట్ అధికారుల దర్యాప్తులో ఏం తేలిందంటే... సీడీలు బయటపెట్టకుండా ఉండేందుకు ఆ మాయలాడి మహిళ... మొదట రూ.2 కోట్లు డిమాండ్ చేసింది. ఆ డబ్బు ఇచ్చినా... ఆమె వదల్లేదు. తన దగ్గర మొత్తం 31 పోర్నోగ్రఫీ సీడీలు ఉన్నాయని చెప్పి... ఆ మాజీ ఎంపీని పదే పదే బ్లాక్‌మెయిల్ చేసి... ఆర్థికంగా ఆయన్ని పీల్చి పిప్పి చేసింది.

కొత్త నంబర్ నుంచీ కాల్ వస్తే చాలు... ఆ భోపాల్ కిలేడీయే చేసిందేమోనన్న భయంతో ఆ మాజీ ఎంపీకి ముచ్చెమటలు పట్టేసేవి. ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా టెన్షన్ తగ్గేది కాదు. ఆయన్ని అడ్డం పెట్టుకొని... ఆ కంత్రీ లేడీ... కొన్ని NGOల్లో సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేలా చేసుకుంది. రోజూ ఈ టెన్షన్ భరించే కంటే చావడం మేలనుకున్నారట ఆ పెద్దాయన. అనుకోవడమే కాదు... సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారు. దాంతో ఎందుకైనా మంచిదనుకున్న ఆ మాయలాడి... కొన్నాళ్లు ఆ నేత జోలికి వెళ్లడం మానేసింది. మళ్లీ ఇటీవల బెదిరింపుల పంజా విసిరింది. తన ఎన్జీవో కోసం డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసింది. హనీట్రాప్ బాగోతం బయటపడటంతో ఇటీవలే సిట్ అధికారులు ఆమెను అరెస్టు చేశారు. ఇప్పుడు ఆమెనూ, ఆ మాజీ ఎంపీనీ పక్కపక్కన కూర్చోబెట్టి... ప్రశ్నల ఆస్త్రాలు సంధిస్తున్నారు.

మాజీ ఎంపీ ఎలా బుక్కయ్యారంటే : తన రాజకీయ పార్టీ కార్యక్రమంలో ఓ సీనియర్ నేతను తొలిసారిగా ఆమె కలిసింది. వలపుల వల విసిరింది. నీకు నేను కరెక్టు కాదన్న ఆయన... ఈ మాజీ ఎంపీని తగులుకోమని సూచించారట. అలా మాజీ ఎంపీని కలిసింది. తన NGO పనుల కోసం అంటూ... తరచూ ఆయన దగ్గరకు వెళ్లసాగింది. మత్తుగా మాట్లాడుతూ... గమ్మత్తుగా వల్లో వేసుకుంది. బుద్ధి లేని ఆ ఎంపీ... ఆమె బుట్టలో పడ్డారు. కట్ చేస్తే... సీక్రెట్ వీడియో కెమెరా ఆన్ అయ్యింది. వివిధ సందర్భాల్లో రహస్య కలయికలతో.... 31 అశ్లీల సీడీలు తయారయ్యాయి. ఆ తర్వాత బ్లాక్‌మెయిల్ తంతు నడిచింది.

మన దేశ అదృష్టం కొద్దీ ఆ మాజీ ఎంపీకి మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ రాలేదు. హనీట్రాప్ వ్యవహారం తెలియడం వల్లే పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఇప్పుడా పెద్దమనిషి ఒరగబెటుతున్న పెద్ద పదవులేవీ లేవు. ఇక సీడీల తంతు బయటకు వచ్చింది కాబట్టి... పరువు గంగలో కలిసినట్లే.
Published by: Krishna Kumar N
First published: September 30, 2019, 12:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading