హోమ్ /వార్తలు /క్రైమ్ /

వామ్మో... తల్లి లాంటి అత్తపై కోడలి కిరాతకం... ఫోన్ ఎక్కువగా మాట్లాడొద్దన్నందుకు.. ఎంత పనిచేసింది..

వామ్మో... తల్లి లాంటి అత్తపై కోడలి కిరాతకం... ఫోన్ ఎక్కువగా మాట్లాడొద్దన్నందుకు.. ఎంత పనిచేసింది..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Madhya pradesh: కోడలు తరచుగా ఫోన్ లో అతిగా మాట్లాడేది. తన ఇంటిపనులు కూడా వదిలేసి ఆ ఫోన్ లోనే ఎప్పుడు మునిగిపోయి ఉండేది. దీంతో అత్త పలు మార్లు పద్ధతిని మార్చుకొవాలని తన కోడలికి సూచించింది.

ఆడవాళ్లు సహాజంగా పెళ్లిచేసుకుని అత్తగారింట్లోకి వెళుతుంటారు. అయితే, పుట్టింట్లో వారు పెరిగిన వాతావరణం, పద్ధతులు అత్తగారింట్లో ఉండక పోవచ్చు. అక్కడి పద్ధతులను పాటించాలి. కొన్ని సార్లు.. కొత్తగా వెళ్లిన ఇంట్లో చిన్న పాటి వాగ్వాదాలు జరుగుతుంటాయి. పుట్టింట్లో ఎంత గారాబంగా పెరిగిన, అత్తగారింటికి వెళ్లాక అక్కడి పద్ధతులను ఫాలో అవ్వాలి. అయితే, కొందరు అమ్మాయిలు అతిగా ప్రవర్తిస్తుంటారు. పుట్టింట్లో మాదిరిగానే ఉండాలని అనుకుంటారు. వారి మనసుకి వ్యతిరేకంగా ఏచిన్న పనిచేయడానికి సైతం ఇష్టపడరు. ఈ క్రమంలో కొడలికి, అత్తింటి వారి మధ్య వాగ్వాదాలు జరుగుతుంటాయి. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. మధ్య ప్రదేశ్ (Madhya pradesh) లోని దామోహ్ జిల్లా దారుణం జరిగింది. కొడియా గ్రామంలోని హట్టా ప్రాంతంలో ఓ కోడలు తన అత్తను అత్యంత దారుణంగా కొట్టి చంపింది. కొడియా గ్రామంలో నివసిస్తున్న అజయ్ బర్మన్ అనే యువకుడు తన తల్లి నన్నీబాయితో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో అజయ్ బర్మన్ కు, మరో యువతితో పెళ్లయింది. అయితే, కోడలు ఎప్పుడు చూసిన ఫోన్ లోనే ఉండేది. దీంతో అత్త నన్నీబాయి విసిగిపోయింది. పద్ధతి మార్చుకొవాలని సూచించింది. కానీ ఆమె మారలేదు. పైగా అత్తపై కోపం పెంచుకుంది.ఎలాగైన అత్తను తప్పించాలను కుంది. ఒక రోజు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

కోడలు.. కోపంతో అత్తను కర్రలతో,రాడ్ లతో ఇష్టమోచ్చినట్లు కొట్టింది. దీంతో ఆమె రక్తపుమడుగులో (Brutally murdered) కింద పడింది. ఆ తర్వాత.. కోడలు తన భర్తకు ఫోన్ చేసింది. అత్త, ఎక్కడో పడి గాయాలతో ఇంటికి వచ్చిందని కట్టుకథ అల్లింది. దీంతో అతను వెంటనే ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే తన తల్లి చనిపోయింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. భార్య ప్రవర్తన అనుమానస్పదంగా ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమెను అదుపులోనికి తీసుకుని విచారించారు దీంతో ఆమె నిజాన్ని ఒప్పుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

First published:

Tags: Brutally murder, Crime news, Madhya pradesh, Wedding

ఉత్తమ కథలు