ప్రియుడితో వెళ్లిపోయిన కుమార్తె.. అందరికీ లేఖలు రాసిన తండ్రి..

కుమార్తె ప్రియుడితో వెళ్లిపోవడంతో ఆ తండ్రికి కడుపుమండింది. దీంతో అంత్యక్రియలు నిర్వహించాడు.

news18-telugu
Updated: August 3, 2019, 3:36 PM IST
ప్రియుడితో వెళ్లిపోయిన కుమార్తె.. అందరికీ లేఖలు రాసిన తండ్రి..
కుమార్తె అంత్యక్రియలకు రావాలంటూ తండ్రి పంపిన లేఖలు (Image:ANI)
  • Share this:
తన కూతురు ఓ అబ్బాయితో వెళ్లిపోవడంతో కడుపుమండిన ఓ తండ్రి ఆమె చనిపోయినట్టు ప్రకటించి ఖర్మకాండలు నిర్వహించాడు. కుమార్తె అంత్యక్రియలకు రావాలంటూ ఊళ్లో అందరికీ లేఖలు కూడా పంచాడు. మధ్యప్రదేశ్‌లో ఈ ఘటన జరిగింది. మధ్యప్రదేశ్‌లోని ఖచ్రోడ్ గ్రామానికి చెందిన ఓ 19 ఏళ్ల యువతి జూలై 25న గ్రామానికి చెందిన ఓ యువకుడితో వెళ్లిపోయింది. దీంతో గ్రామంలో ఆ తండ్రి పరువుపోయింది. తీవ్ర అవమానాన్ని ఎదుర్కొన్న ఆ తండ్రి... పారిపోయిన తన కూతురు ఇక తనకు లేదని భావించాడు. తన కుమార్తె చనిపోయిందని ప్రకటించారు. గ్రామస్తులు, బంధువులు అందరికీ ఈ మేరకు లేఖలు పంపాడు. ఖర్మకాండలకు తప్పకుండా రావాలంటూ వారికి విజ్ఞప్తి చేశాడు. ఆ లేఖలో కుమార్తె ఫొటోను కూడా ముద్రించాడు.

First published: August 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>