Home /News /crime /

MADHYA PRADESH CONGRESS STAR CAMPAIGNER MIRCHI BABA ARRESTED ON RAPE CHARGES FROM GWALIOR HOTEL PAH

కాంగ్రెస్ లో కలకలం.. స్టార్ క్యాంపెయినర్ ‘మిర్చి బాబా’ అరెస్టు.. కారణం ఏంటంటే..

పోలీసుల అదుపులో వైరాగ్యా నంద్ గిరి మహారాజ్..

పోలీసుల అదుపులో వైరాగ్యా నంద్ గిరి మహారాజ్..

Madhya Pradesh: గతంలో కాంగ్రెస్ పార్టీకి మిర్చి బాబా స్టార్ క్యాంపెయినర్ గా పనిచేశారు. కాంగ్రెస్ ను అన్నివిధాల ముందుండి నడిపించారు. తాజాగా, ఆయనపై వచ్చిన ఆరోపణలు తీవ్ర దుమారాన్ని రేకెత్తిస్తున్నాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Madhya Pradesh, India
  టెక్నాలజీ రోజురోజుకి డెవలవ్ అవుతున్న కూడా..  కొంత మంది మహిళలు ఇప్పటికి, దొంగబాబాల చేతిలో మోసపోతున్నారు. వీరి బలహీనతలను ఆసరగా చేసుకున్న వారు.. తమ కోరికలను తీర్చుకుంటున్నారు. కొన్నిచోట్ల మహిళలపై.. వారి సమస్యలను పరిష్కరిస్తామంటూ.. ఏవేవో తాయేత్తులు ఇస్తుంటారు. తమతో శారీరక సంబంధం పెట్టుకుంటే.. సమస్యలన్ని అవే పరిష్కారమవుతాయంటూ కూడా దొంగ బాబాలు బురిడికొట్టిస్తుంటారు.

  ఆతర్వాత.. ఏవో మత్తు పదార్థాలు ప్రసాదంగా ఇచ్చి.. బాధితులపై అఘాయిత్యాలకు తెగబడుతుంటారు. ఇలాంటి ఘటన వెలుగులోనికి వచ్చింది.  మధ్య ప్రదేశ్ లో (Madhya pradesh)  కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. హస్తం పార్టీకి స్టార్ క్యాంపెయినర్ గా పిలవబడే మిర్చిబాబా ఆలియాస్ వైరాగ్యానంద్ గిరి మహారాజ్ పై ఒక మహిళ అత్యాచార ఆరోపణలు చేసింది. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.  నివేదికల ప్రకారం, బాధితురాలు జులైలో బాబాను సందర్శించి సంతానం కలగాలని ఆశీస్సులు కోరింది. బిడ్డను కనాలనే సాకుతో బాబా తనపై మత్తు మాత్రలు తినిపించి అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. దీంతో పోలీసులు రంగంలోనికి దిగిన.. గ్వాలియర్ లోని ఒక హోటల్ లో వైరాగ్యా నంద్ గిరి మహారాజ్ ను అరెస్టు చేశారు. మిర్చిబాబా గతంలో మధ్య ప్రదేశ్ లో.. దిగ్విజయ్ సింగ్ 2019 లోక్ సభ ఎన్నికలలో పోటీకి దిగినప్పుడు వార్తలలో నిలిచారు. ఆయనకు అపోసిషన్ గా.. సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ బరిలో నిలబడ్డారు.

  ఆ సమయంలో.. మిర్చిబాబా.. దిగ్విజయ్ సింగ్ ఎన్నికల బరిలో గెలుస్తారని.. ఆయన గెలవకపోతే జలసమాధి తీసుకుంటానని కూడా అన్నారు. అయితే.. ఎన్నికలలో సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ గెలిచారు. అప్పటి నుంచి మిర్చిబాబా పత్తా లేకుండా పోయారు. తాజాగా, ఇప్పుడు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయన మరోసారి వార్తలలో నిలిచారు. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర దుమారంగా మారింది.

  ఇదిలా ఉండగా  మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో అప్పులు తీర్చేందుకు ఓ భర్త తన భార్యను హత్య చేశాడు. 35 లక్షల ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం భర్త సినిమా తరహాలో భార్యను హత్య చేయడం గమనార్హం. నిందితుడు బ్రాద్రీ ప్రసాద్ అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. అప్పు చెల్లించేందుకు భర్త తన భార్యకు జూన్ నెలలో రూ.35 లక్షలకు బీమా చేయించాడు. వెంటనే ఇన్సూరెన్స్ క్లెయిమ్ పొందడానికి గూగుల్‌లో సెర్చ్ చేశాడు. యూట్యూబ్‌లో వీడియోలను చూశాడు. మొత్తం స్క్రిప్ట్‌ను సిద్ధం చేసిన తర్వాత, భర్త తన భార్యకు మరణశిక్ష విధించాడు.

  వాస్తవానికి జూన్ 26న రాజ్‌గఢ్ జిల్లాలోని కురావర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మన జోడ్ వద్ద పూజా మీనా అనే మహిళ కాల్చి చంపబడింది. బద్రీ ప్రసాద్ మీనా తన భార్య పూజా మీనాను బైక్‌పై తీసుకెళ్లాడు. అదే సమయంలో మన జోడు దగ్గర అతని బైక్ పాడైంది. బద్రి బైక్ ఫిక్స్ చేయడం మొదలుపెట్టాడు. భార్య పూజ రోడ్డు పక్కన కూర్చుంది.

  కొద్దిసేపటికి ముగ్గురు వ్యక్తులు వచ్చి పూజను కాల్చి చంపి పారిపోయారు. పోలీసుల ఎదుట కజిన్ సోదరులే ఈ హత్య చేశారని బడిప్రసాద్‌ ఆరోపించారు. కుర్వార్ పోలీస్ స్టేషన్‌లో బద్రీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
  Published by:Paresh Inamdar
  First published:

  Tags: Crime news, Female harassment, Madhya pradesh

  తదుపరి వార్తలు