ప్రస్తుతం మ్యాట్రిమోనియల్ మోసాలు (Matrimonial fraud) పెరిగిపోతున్నాయి. పెళ్లి కాని అబ్బాయిలే టార్గెట్ గా, గ్యాంగ్ లు అమ్మాయిలతో మాట్లాడించి యువకులను ముగ్గులోకి దింపుతున్నారు. వీరే ఒక గ్యాంగ్ లుగా ఏర్పడుతున్నారు. అమ్మాయిలను పరిచయంచేస్తున్నారు. ఆ తర్వాత.. వారు రంగంలోకి దిగుతున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజులు ఇంట్లో ఉంటున్నారు. ఆ తర్వాత ఎదో వంక చెప్పుకుని,రాత్రికి రాత్రే బంగారు, నగదు తీసుకొని (Gold and money) చెక్కెస్తున్నారు. ఇలాంటి పెళ్లి మోసాలకు చెందిన ఘటనలు ప్రతిరోజు వార్తలలో ఉంటున్నాయి. ఇప్పుడు ఈ కోవకు చెందిన నిత్య పెళ్లి కూతురి బాగోతం వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు.. మధ్య ప్రదేశ్ లో (Madhya pradesh) దొంగ పెళ్లిళ్ల బాగోతం వెలుగులోనికి వచ్చింది. భోపాల్ కు ఈ ఘటన చోటు చేసుకుంది. భోపాల్ కు చెందిన కాంత ప్రసాద్ నాథ్ అనే వ్యక్తి మంచి పెళ్ళి (Wedding) సంబంధాల కోసం చూస్తున్నాడు.ఈ క్రమంలో ఇతనికి మధ్య వర్తుల ద్వారా దినేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దినేష్ తనకు, పూజ అనే బంధువు ఉందని ఆమెకు పెళ్లి కాలేదని చెప్పాడు. దీంతో దినేష్ తో మాట్లాడి, పూజతో పెళ్లికి రెడీ అయ్యారు. పెళ్లి ఖర్చుల కోసం 85 వేలు తీసుకున్నాడు. ఆ తర్వాత.. వీరి పెళ్లి వైభవంగా జరిగింది. అయితే, పెళ్లయిన ఎనిమిది రోజులకు, పూజ, తన బంధువైన దినేష్ భార్యకు ఆరోగ్యం బాగాలేదని చెప్పింది. ఆ తర్వాత.. చూడటానికి వెళ్లాలని చెప్పింది. అయితే, భార్య మాటలు నిజమని నమ్మిన కాంతప్రసాద్ పంపించాడు.
ఆమె వెళ్లిన కొన్ని రోజులకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది. దినేష్ కోసం ఆరాతీస్తే.. అతని ఫోన్ కూడా స్విచ్ వచ్చింది. ఆ తర్వాత.. వీరి కోసం చుట్టుపక్కల ఆరాతీస్తే ఎవరు తెలియదన్నారు. దీంతో తాను మోసపోయాయని నాథ్ గ్రహించాడు. ఆమె ఇంట్లోని బంగారం, నగదు తీసుకుని వెళ్లిందని తెలిసి ఖంగుతిన్నాడు. ఆ తర్వాత..స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూజ గురించి విచారణ చేపట్టారు. భోపాల్ లో మహిళను అదుపులోనికి తీసుకున్నారు . పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోనికి వచ్చాయి.
మహిళ అసలు పేరు సీమాఖాన్ అని పోలీసులు గుర్తించారు. అదే విధంగా, కిలేడీ ఇప్పటి వరకు 15 పెళ్లిళ్లు చేసుకుందని అన్నారు. ఇప్పటి వరకు రియా, రీనీ, సుల్లానా, అనే పేర్లతో చెలామణి అయిందని అన్నారు. ప్రతి పెళ్లి మోసానికి దినేష్ ఆమెకు 35 వేలు ఇస్తాడని నిందితురాలు విచారణలో తెలిపింది. దీంతో పోలీసులు కూడా అవాక్కయ్యారు. ఇప్పటి వరకు వీరి గ్యాంగ్ లో 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.