మధ్యప్రదేశ్(Madhya Pradesh)కి చెందిన బీజేపీ లోక్‌సభ సభ్యురాలినే బెదిరిస్తూ ఫోన్ కాల్(Phone call)చేశాడో ఆగంతకుడు. ఏకంగా చంపుతానంటూ ఎంపీకి కాల్ చేసి చెప్పిన ఆడియో టేప్(Audio tape)ఇప్పుడు విస్తృతంగా వైరల్ అవుతోంది. భోపాల్ ఎంపీ(Bhopal MP)ప్రజ్ఞాసింగ్‌ఠాకూర్(Pragya Singh Thakur)కి ఈ అనుభవం ఎదురవడంతో కమలనాథుల్లో ఒకింత కలవరం మొదలైంది. ఫోన్ చేసి బెదిరించిన వ్యక్తి వివరాలు అతని చిట్టా రాబడుతున్నారు పోలీసులు(Police). ఇంకా విచిత్రం ఏమిటంటే అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం(Underworld Don (Dawood Ibrahim)గ్యాంగ్‌కి చెందిన వాడినంటూ ఫోన్‌లో చెప్పడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
అధికార పార్టీ ఎంపీకే వార్నింగ్..
బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్‌ఠాకూర్‌కి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఎవరో అపరిచితుడు తాన పేరు ఇక్బాల్ కస్కర్ అని తాను మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడ్ని అంటూ అధికార పార్టీకి చెందిన ఎంపీకి కాల్ చేసి చెప్పాడు. అంతటితో సరిపెట్టకుండా ఎంపీ ప్రజ్ఞాఠాకూర్‌ని చంపుతానంటూ ఫోన్‌లో వార్నింగ్ ఇచ్చాడు. మంత్రి తనను ఎందుకు చంపాలనుకుంటున్నారని అడిగితే మీరు ముస్లింలపై విషం చిమ్ముతున్నారని అందుకే టార్గెట్ చేసినట్లు తెలిపాడు. ఎందుకు చంపుతున్నామో చంపే ముందు చెబుతామని ఫోన్‌లో చెప్పడంతో ఎంపీ సైతం అతనికి ధీటుగా బదులిచ్చారు. ముస్లింలు అనే వాళ్లు ఇలా మంచి వాళ్లు ఎంతో ప్రేమగా ఉంటారని..మీకు నిజంగా దమ్ముంటే ముందుకు వచ్చి మాట్లాడమని ఫోన్ పెట్టేశారు. ప్రజ్ఞాఠాకూర్ అపరిచితుడితో మాట్లాడిన ఫోన్ వాయిస్‌కి సంబంధించిన ఆడియో టేపులు సోషల్ మీడియాతో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ప్రజ్ఞాసింగ్‌ని చంపుతానంంటూ ఫోన్‌కాల్ ..
ఎంపీ ఫిర్యాదుతో టీటీ నగర్ పోలీసులు ఫోన్‌లో బెదిరించిన వ్యక్తిపై శనివారం కేసు నమోదు చేసినట్లు పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ చైన్ సింగ్ రఘువంశీ తెలిపారు. ఎంపీ ఫిర్యాదులో తనకు శనివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో చంపుతానంటూ ఇక్బాల్ కస్కర్ అనే అపరిచితుడు బెదిరించాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎంపీని బెదిరించిన కేసులో పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై ఐపీసీ 506, 507 సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు.
వైరల్ అవుతున్న ఆడియో కాల్ వీడియో..
ఫోన్‌లో ఎంపీనే చంపుతాననని బెదిరించిన వ్యక్తిని గుర్తించే పనిలో పడ్డారు. ఖచ్చితంగా అతని ఆచూకి కనుగొంటామని..అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు పోలీసులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Madhya pradesh, Pragya Thakur, Viral Video