Home /News /crime /

మామకు యాక్సిడెంట్ అయింది.. వెంటనే రావాలని అత్తను తీసుకెళ్లిన అల్లుళ్లు.. కట్ చేస్తే..

మామకు యాక్సిడెంట్ అయింది.. వెంటనే రావాలని అత్తను తీసుకెళ్లిన అల్లుళ్లు.. కట్ చేస్తే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

‘అత్త మామకు యాక్సిడెంట్ అయింది. వెంటనే రా.. ’ అంటూ ఇద్దరు యువకులు ఓ మహిళను ఇంట్లో నుంచి బయటకు తీసుకొని వెళ్లారు. ఆ యువకులు బయటి వ్యక్తులు కూడా కాదు.. ఆమెకు మేనల్లుళ్లు అవుతారు.

    ‘అత్త మామకు యాక్సిడెంట్ అయింది. వెంటనే రా.. ’ అంటూ ఇద్దరు యువకులు ఓ మహిళను ఇంట్లో నుంచి బయటకు తీసుకొని వెళ్లారు. అయితే వారు అనుకున్న చోటుకు చేరుకున్నాక ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులు బయటి వ్యక్తులు కూడా కాదు.. ఆమెకు మేనల్లుళ్లు అవుతారు. రెండు నెలల క్రితం జరిగిన ఈ షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో గ్వాలియర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. గ్వాలియర్ జిల్లాలోని మహారాజ్‌పురా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో బాధిత మహిళ.. తన భర్తతో కలిసి నివాసం ఉంటుంది. ఆమె భర్త ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తాడు. అతడు తరచూ రాత్రి సమయాల్లో ఎక్కువగా ఆటో నడుపుతుంటాడు.

    ఇక, వారి ఇంటి పరిసర ప్రాంతాల్లో అరవింద్ మహౌర్, సోనూ మహౌర్ నివాసం ఉంటున్నారు. వీరద్దరు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. అయితే మహిళతో ఉన్న బంధుత్వం కారణంగా వారు ఆమెను మామి(అత్త) అని పిలిచేవారు. రెండు నెలల క్రితం ఓ రోజు రాత్రి బాధితురాలి భర్త.. ఎప్పటిలాగానే రాత్రి పూట ఆటో నడిపేందుకు వెళ్లాడు. అయితే కొద్దిసేపటి తర్వాత అరవింద్, సోనూలు బాధితురాలి ఇంటికి వచ్చారు. మామ ఆటోకు ప్రమాదం జరిగిందని చెప్పి ఆమెను ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లారు.

    ఇద్దరు ఆమెను మహారాజ్‌పురా అడవి ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లాక.. బెదిరింపులకు పాల్పడి అత్యాచారం చేశారు. అనంతరం ఈ ఘటనకు గురించి ఎవరికైనా చెబితే ఆమె భర్తను, పిల్లలను చంపేస్తామని హెచ్చరించారు. దీంతో భయపడిపోయిన బాధితురాలు.. రెండు నెలలు మౌనంగా ఉండిపోయింది. అయితే ఇటీవలి కాలంలో నిందితుల తరచూ బ్లాక్‌మెయిల్ చేస్తుండటంతో బాధితురాలు తన భర్తతో కలిసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అపవాద పడతుందమోనన్న ఆలోచనతో తాను రెండు నెలలుగా మౌనంగా ఉన్నట్టుగా చెప్పింది.

    అయితే నిందితులు ప్రతిరోజు వారితో సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి తెస్తున్నట్టుగా మహిళ ఫిర్యాదులో పేర్కొంది. అందుకు నిరాకరిస్తే తన భర్త, పిల్లలను చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నట్టుగా తెలిపింది. ఈ బెదిరింపులకు ఎక్కువ కావడంతో పోలీసులను ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది. దీంతో పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేశామని, త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Crime news, Gang rape, Madhya pradesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు