MADHYA PRADESH ADVOCATE THRASHES WOMAN LITIGANT IN FULL PUBLIC VIEW OUTSIDE COURTROOM IN SHAHDOL VIDEO GOES VIRAL PAH
Shocking: రెచ్చిపోయిన లాయర్.. కోర్టు ఆవరణలో మహిళపై పిడిగుద్దులు.. వీడియో వైరల్...
యువతిని కొడుతున్న లాయర్
Madhya pradesh: లాయర్ రెచ్చిపోయాడు. మహిళా అని కూడా చూడకుండా అమానుషంగా ప్రవర్తించాడు. కోర్టు ఆవరణలో ఆమెను డ్రెస్ పట్టుకుని లాగి పరిగెత్తించి మరీ కొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
కొందరు ఆవేశంలో మహిళలపై అఘాయిత్యాలకు, దాడులకు పాల్పడుతున్నారు. కొందరు మహిళలపై దాడిచేయడం, కొట్టడం (Attack on woman) వంటివి చేస్తుంటారు. ప్రభుత్వాలు మహిళల భద్రత, దాడులను రూపు మాపడానికి అనేక చట్టాలను తీసుకొస్తున్నాయి. కానీ ఇప్పటికి వీరిపట్ల అమానుష సంఘటనలు ప్రతిరోజు వార్తలలో ఉంటున్నాయి. ప్రస్తుతం ఒక లాయర్ (Advocate attack on woman) మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు.. మధ్య ప్రదేశ్ లోని (Madhya pradesh) షాడోల్ జిల్లాలో అమానుష సంఘటన జరిగింది. 23 ఏళ్ల భారతీ పటేల్ అనే మహిళ తన భర్తతో వివాదాల కారణంగా విడాకులు తీసుకుంది. భర్త తరపు కేసును భగవాన్ సింగ్ (58) ఏళ్ల లాయర్ వాదిస్తున్నాడు. అయితే, ఆమె తన భర్త నుంచి న్యాయపరంగా రావాల్సిన భరణం విషయంలో కోర్టులో కేసు వేసింది. దీంతో వీరి మధ్య కేసు నడుస్తోంది.
బాధితురాలు భారతీ పటేల్ కోర్టుకు వచ్చింది. దీంతో లాయర్ భగవాన్ సింగ్ ఆమెను చూసి నోటికొచ్చినట్లు తిట్టాడు. అంతటితో ఆగకుండా.. ఆమె డ్రెస్ పట్టుకుని లాగాడు. మహిళ అని కూడా చూడకుండా.. కోర్టు ఆవరణలో పరిగెత్తించి, పరిగెత్తించి కొట్టాడు. (Advocate brutally attack on woman) ఆ మహిళ పై లాయర్ దాడిచేస్తుంటే.. ఏ ఒక్కరు కూడా ఆపడానికి ముందుకు రావడం లేదు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు లాయర్ పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటన పట్ల న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఒడిశాలో వివాహితపై (Odisha) బాలాసోర్ జిల్లాలో దారుణం జరిగింది.
సభ్యసమాజం తలదించుకునే ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. బాలాసోర్ లో కు చెందిన సదరు భార్య భర్తలకు 2017లో పెళ్లి (marriage) జరిగింది. కొన్ని రోజుల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. మహిళను.. అత్త గారు తరచుగా వరకట్నం (Dowry harass ment) కోసం వేధిస్తుండే వారు. భర్త కూడా ఆమెను హింసిస్తుండే వాడు. వీరికి రెండున్నరేళ్ల కొడుకు ఉన్నాడు.
అయితే, ఈ మధ్య వీరి హింసలు మరింత ఎక్కువయ్యాయి. భర్త తరపు వారు.. మహిళను ఒక తాంత్రికుడి (Tantrik) దగ్గరకు తీసుకెళ్లారు. ఆమెకు కొన్ని దోషాలు ఉన్నాయని, అవి తగ్గిస్తానన వారికి చెప్పాడు. మహిళను ఇక్కడే ఉంచాలని చెప్పాడు. దీనికి మహిళ నిరాకరించింది. దీంతో భర్త.. పానీయంలో మత్తుపదార్థం కలిపి ఆమెచేత తాగించాడు. సృహ తప్పి పడిపోయాక ఆమెను అక్కడే వదిలేసి వారు వెళ్లిపోయారు. వారికి కావాల్సిన ఆహరాన్ని చాటుగా అందించి వెళ్లిపోయేవారు. బాధిత మహిళ... కొన్ని నెలలుగా అక్కడే ఉంది. మైనర్ కొడుకును కూడా తాంత్రికుడి వద్దనే వదిలేశారు.ఆమెను తాంత్రికుడు (Tantrik rapes woman) ప్రతిరోజు అత్యాచారం చేసేవాడు.
ప్రతిరోజు బాలుడి ముందే తాంత్రికుడు (Woman rapes by tantrik) అఘాయిత్యం చేసేవాడు. ఒక రోజు తాంత్రికుడు తన ఫోన్ ను గదిలో మరిచిపోయి బయటకు వెళ్లాడు. వెంటనే బాధితురాలు తన గొడును తన పుట్టింటి వారికి చెప్పుకుంది. దీంతో ప్రస్తుతం ఈ దారుణం వెలుగులోనికి వచ్చింది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మహిళను కాపాడారు. తాంత్రికుడు పోలీసుల రాకను గమనించి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.