Shocking: తెల్లవారుజామున మూడేళ్ల చిన్నారి ఏడుపు విని నిద్రలేచిన తల్లి.. అయ్యో పాపం పాపను ఆ స్థితిలో చూసి..

ప్రతీకాత్మక చిత్రం

ఓ తల్లి తన మూడేళ్ల కూతురితో కలిసి నిద్రించింది. ఆ తర్వా త కొన్ని గంటలకు కూతురు ఏడుపు వినిపించడంతో ఆమె నిద్రలేచింది. అయితే ఆమె పక్కన కూతురు లేదు. ఇంటి బయట నుంచి ఏడుపు శబ్దం రావడంతో అక్కడికి చేరుకుంది.

  • Share this:
    ఓ తల్లి తన మూడేళ్ల కూతురితో కలిసి నిద్రించింది. ఆ తర్వా త కొన్ని గంటలకు కూతురు ఏడుపు వినిపించడంతో ఆమె నిద్రలేచింది. అయితే ఆమె పక్కన కూతురు లేదు. ఇంటి బయట నుంచి ఏడుపు శబ్దం రావడంతో అక్కడికి చేరుకుంది. అక్కడ కూతురు ఉన్న స్థితిని చూసి ఆమె నోట మాట రాలేదు. తీవ్రమైన షాక్‌లోకి వెళ్లిపోయింది. ఇందుకు కారణం ఆ పసిపాపను ఓ మృగాడు అపహరించి.. అత్యాచారం చేశాడు. అనంతరం ఇంటి బయట వదిలివెళ్లాడు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh) రేవా జిల్లాలో (Rewa district) చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. గురువారం తెల్లవారుజామున ఈ దారుణం చోటుచేసుకుందని వారు చెప్పారు.

    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. థియోంతర్ పోలీస్ స్టేషన్ (Theonthar police station) పరిధిలోని జనేహ్‌ ప్రాంతానికి చెందిన బాలిక తల్లిదండ్రులు ఓ గుడిసెలో నివసిస్తున్నారు. బుధవారం రాత్రి బాలికను తన పక్కన పెట్టుకుని తల్లి నిద్రించింది. అయితే వారికి ఇంటికి సమీపంలోనే ఉండే యువకుడు అర్ధరాత్రి సమయంలో బాలికను ఎత్తుకెళ్లాడు. అనంతరం బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాలిక ఇంటి బయట ఆమెను వదిలిపెట్టి వెళ్లాడు.

    Hyderabad: బాలికతో పరిచయం.. ప్రేమించానని మాయ మాటలు.. చివరకు పిన్ని ఇంటికి తీసుకెళ్లి..

    అయితే బాలిక ఏడుపు విన్న తల్లి నిద్రలేచింది. కూతరు కోసం చూడగా.. ఆమె వారు ఉంటున్న గుడిసె బయట కనిపించింది. దీంతో అక్కడికి చేరుకున్న బాలిక తల్లి.. ఆ స్థితిలో ఆమెను చూసి షాక్ తింది. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే బాలికను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

    Married Woman: భర్త కోసం 1,000 కి.మీ ప్రయాణించిన భార్య.. ఊహించని షాక్ ఇచ్చిన మామ..

    ఈ ఘటనకు సంబంధించి రేవా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శివ కుమార్ వర్మ (Shiv Kumar Verma) మాట్లాడుతూ.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టుగా చెప్పారు. అతడిని విచారిస్తున్నట్టుగా వెల్లడించారు. ఇక, ప్రస్తుతం బాధిత బాలిక రేవా పట్టణంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది. అయితే పరిస్థితి మాత్రం విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు.
    Published by:Sumanth Kanukula
    First published: