ఇద్దరు మోడల్స్‌తో నగ్న వీడియోలు.. ప్రముఖ నటి, కెమెరామేన్ అరెస్టు

నటి నందితా దత్తా (image credit - instagram)

ఓవైపు రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ వీడియోలు, నగ్న సిరీస్‌ల వ్యవహారం దుమారం రేపుతుంటే... అలాంటిదే మరో ఘటన జరిగింది. పోలీసులు చాలా త్వరగానే యాక్షన్ లోకి దిగి ఆట కట్టించారు.

 • Share this:
  శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా బూతు పురాణం వ్యవహారం బాలీవుడ్‌ను కుదిపేస్తోంది. అతన్ని అరెస్టు చేసిన పోలీసులు... ఇందులో శిల్పా శెట్టి పాత్ర ఎంత అనే అంశంపై ఆరా తీస్తున్నారు. ఇంకా ఏమేం చేశాడో తెలుసుకునేందుకు డొంకంతా కదుపుతున్నారు. అదే సమయంలో... కోల్‌కతాలో ఓ మోడల్ సంచలన ఆరోపణలు చేసింది. నటి నందితా దత్తా (Nandita dutta) తనను బలవంతంగా నగ్నంగా చేసి... బూతు వీడియో (Nude Video) చేయించిందని ఆరోపించింది. ఈ ఆరోపణలపై కేసు నమోదుచేసిన పోలీసులు... వెంటనే స్పందించారు. నటి నందితా దత్తాతోపాటూ... ఫొటోగ్రాఫర్ మైనిక్ ఘోష్ (Mainak Ghosh)ని అరెస్టు చేశారు. వీళ్లిద్దరూ... మోడల్‌తోపాటూ... మరో యువతి న్యూడ్ వీడియోలను ఓ పోర్నోగ్రఫీ వెబ్‌సైట్ (pornographic site)లో అప్‌లోడ్ చేసినట్లు తెలిసింది.

  మోడల్‌తో బలవంతంగా న్యూడ్ వీడియో, ఫొటోషూట్ జరిగిన స్టూడియో ఓనర్ బలిగంజ్‌ని కూడా పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని న్యూటౌన్ పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లి ప్రశ్నించారు. అతని స్టూడియోలోని కెమెరా ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఇది కూడా రాజ్ కుంద్రా వ్యవహారం లాగే ఉందనే అభిప్రాయం పోలీస్ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.

  మోడల్ ఆరోపణలు చేయడంతోనే పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆదివారం అతివేగంగా రైడింగ్ చేసేందుకు స్టూడియోకి వెళ్లారు. అప్పటికే వందల మంది స్టూడియో ముందు ఉన్నారు. ఏంటి ఇంత మంది ఇక్కడ ఉన్నారంటే... ఇక్కడో సినిమా షూటింగ్ జరుగుతోందని చెప్పారు. కానీ పోలీసులు వచ్చింది వేరే పనిమీద కావడంతో... ఇప్పుడు షూటింగ్ జరపడానికి వీల్లేదంటూ... షూటింగ్‌లో వాడుతున్న కెమెరాల్ని కూడా సీజ్ చేశారు.

  నందితా దత్తా... తనను బలిగంజ్ స్టూడియోకి తెచ్చి బలి చేసిందని ఆ మోడల్ ఆరోపించింది. తనతో న్యూడ్ వీడియో బలవంతంగా చేయించిందని చెప్పింది. అంతేకాదు... తన ఫ్రెండ్స్‌లో ఓ యువతిని... వెబ్ సిరీస్ ఆఫర్ ఇప్పిస్తానని చెప్పి... కోల్‌కతాలోని న్యూ టౌన్ హోటల్‌కి తీసుకెళ్లి... అక్కడ ఆమెతో నగ్న వీడియో షూట్ చేయించిందని ఆరోపించింది.

  ఇది కూడా చదవండి: Video: వంట వండుతోందా.. ఆ వంకతో అందాలు చూపిస్తోందా?

  పోలీసులు తమ డ్యూటీ ప్రకారం నందితా దత్తాను అరెస్టు చేశారు. అలాగే... కెమెరామేన్, స్టూడియో ఓనర్‌ని కూడా అరెస్టు చేశారు. ఇక వాళ్లను ప్రశ్నించడం ద్వారా... అలాగే ఫుటేజ్ పరిశీలించడం ద్వారా... మోడల్ చేసిన ఆరోపణల్లో నిజమెంత అనేది తేల్చాల్సి ఉంది. మొత్తానికి ఈ ఘటన బెంగాల్‌లో తుఫానులా అలజడి సృష్టిస్తోంది. సినిమా ప్రపంచంలో రంగుల వెనక... అన్నీ బూతు పురాణాలేనా అనే డౌట్ ప్రజలకు వస్తోంది. హాలీవుడ్, బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకూ అంతా ఇంతేనా అని ప్రశ్నిస్తున్నారు చాలా మంది.
  Published by:Krishna Kumar N
  First published: