పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై నిర్భయ కేసు నమోదు

ఆశీష్ వేధింపులతో భయభ్రాంతులకు గురై, తప్పించుకున్నామని తెలిపింది. అక్కడి సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తే నిజాలు బయటకు వస్తాయని ఆమె పేర్కొంది.

news18-telugu
Updated: December 1, 2019, 3:39 PM IST
పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై నిర్భయ కేసు నమోదు
ఆశిష్ గౌడ్, సంజన
  • Share this:
పటాన్ చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశిష్ ‌గౌడ్‌పై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. దీంతో పోలీసులు అతడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. శనివారం రాత్రి ఆశిష్ తమతో అసభ్యంగా ప్రవర్తించినట్లు బిగ్ బాస్ కంటెస్టంట్ సంజన ఫిర్యాదు చేసింది. దీంతో మాదాపూర్ పోలీసులు ఆశిష్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆశిష్ పరారీలో ఉన్నట్లు సమాచారం.

బిగ్ బాస్ రెండో సీజన్ కంటెస్టెంట్ సంజన ... నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశీష్ గౌడ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆశిష్ తనపై మద్యం బాటిళ్లతో దాడికి దిగాడని ఆమె పేర్కొంది. బిల్డింగ్‌పై నుంచి తోసి వేయడానికి ప్రయత్నించాడని ఆమె ఆరోపించింది.హైదరాబాద్, హైటెక్స్ సమీపంలోని నోవాటెల్ హోటల్ లో శనివారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సంజన తెలిపింది. రాత్రి 2 గంటల సమయంలో తన స్నేహితురాలితో కలిసి నిలబడివున్న సమయంలో ఈ ఘటన జరిగిందని తెలిపింది. ఆశీష్ వేధింపులతో భయభ్రాంతులకు గురై, తప్పించుకున్నామని తెలిపింది. అక్కడి సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తే నిజాలు బయటకు వస్తాయని ఆమె పేర్కొంది.

అయితే బీజేపీ యువనేతగా ఉన్న ఆశిష్ గౌడ్ షాద్‌నగర్ హత్యాచార ఘటనపై ఆందోళనలో పాల్గొని నిందితులకు కఠిన శిక్షలు పడేలని డిమాండ్ చేసిన కాసేపటికే ఇలా పబ్పులో అమ్మాయిల్ని వేధింపులకు గురి చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

First published: December 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>