Home /News /crime /

Married Woman: పుట్టింటికొస్తే ఇలా జరుగుతుందని ఆమె అస్సలు ఊహించనే లేదు.. మంగళవారం సాయంత్రం ఇంట్లో ఉండగా..

Married Woman: పుట్టింటికొస్తే ఇలా జరుగుతుందని ఆమె అస్సలు ఊహించనే లేదు.. మంగళవారం సాయంత్రం ఇంట్లో ఉండగా..

బాధితురాలు

బాధితురాలు

మధ్యప్రదేశ్‌లో ఇండోర్‌లో ఘోరం జరిగింది. ప్రేమ పిచ్చి పట్టిన ఓ సైకో లవర్.. వివాహితపై దాడికి తెగబడ్డాడు. ఆపేందుకు ప్రయత్నించిన ఆమె సోదరుడిపై కూడా దాడి చేశాడు. ఈ దాడిలో ఆ యువతి ముఖం తీవ్రంగా గాయపడటంతో 45 కుట్లు పడ్డాయి.

    ఇండోర్: మధ్యప్రదేశ్‌లో ఇండోర్‌లో ఘోరం జరిగింది. ప్రేమ పిచ్చి పట్టిన ఓ సైకో లవర్.. వివాహితపై దాడికి తెగబడ్డాడు. ఆపేందుకు ప్రయత్నించిన ఆమె సోదరుడిపై కూడా దాడి చేశాడు. ఈ దాడిలో ఆ యువతి ముఖం తీవ్రంగా గాయపడటంతో 45 కుట్లు పడ్డాయి. ప్రాణాపాయం నుంచి ఆమె బయటపడినప్పటికీ ఆ సైకో దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె సోదరుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఇండోర్‌లోని ఆజాద్‌నగర్‌లో ఈ దారుణం వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆజాద్‌నగర్ ప్రాంతానికి చెందిన ఓ యువతికి మూడేళ్ల క్రితం వివాహమైంది. ఆమెను అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఆమెకు వివాహం కాక ముందు నుంచి ప్రేమిస్తున్నాడు. ఆ యువకుడు వన్‌సైడ్ లవ్ చేస్తున్న సమయంలోనే ఆ యువతికి పెళ్లైంది. ఆమె ఇటీవల పుట్టింటికి వచ్చింది. పుట్టింటికి వచ్చిన ఆమెను ఆ యువకుడు గమనిస్తూ ఉన్నాడు.

    ఈ క్రమంలోనే.. గురువారం సాయంత్రం ఆ వివాహితను వేరెవరితోనో చూసిన ఆ సైకో లవర్ ఇంటికెళ్లి మరీ ఆమెపై దాడికి తెగబడ్డాడు. బ్లేడ్‌తో ముఖంపై దాడి చేయడంతో ఆమె ముఖమంతా రక్తంతో ఎర్రబారింది. ఆ సమయంలో ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన సోదరుడిపై కూడా ఆ సైకో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలి సోదరుడు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. దాడి చేసిన అనంతరం ఆ యువకుడు అక్కడ నుంచి పరారయ్యాడు. పోలీసులు ఆ యువకుడిని అర్ధరాత్రి సమయంలో బంధువుల ఇంట్లో ఉండగా అదుపులోకి తీసుకున్నారు.

    ఇది కూడా చదవండి: Oh My God: 108 కిలోల కారం కలిపిన నీళ్లతో ఆలయ పూజారికి అభిషేకం.. ఇలా ఎందుకు చేశారని ఆ ఊరోళ్లను అడిగితే..

    విచారణ సమయంలో ఆ యువకుడు ఎందుకు దాడి చేశావని పోలీసులు అడగ్గా.. ఆమెను చాలా సంవత్సరాలుగా ప్రేమిస్తున్నానని, ఎంతగానో ఇష్టపడ్డానని.. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నానని.. కానీ ఆమె మరొకరిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయిందని.. ఆ కోపంతోనే ఆమెపై దాడికి తెగబడినట్టు నిందితుడు చెప్పాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో ఆజాద్‌నగర్ ప్రాంతంలో నివసిస్తున్న స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అక్కాతమ్ముడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Crime news, Indore, Lover, Madhya pradesh

    తదుపరి వార్తలు