అందరమైన మహిళా ఐఏఎస్ అధికారిపై మనసుపడిన ఓ సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారి ఆమెను దక్కించుకోవడానికి తన క్రిమినల్ బ్రెయిన్ వాడాడు. అయితే, చివరకు కటకటాల పాలయ్యాడు. ఓ అందమైన మహిళా ఐఏఎస్ అధికారి మీద సీఐఎస్ఎఫ్ కమాండెంట్ రంజన్ ప్రతాప్ సింగ్ మనసుపడ్డాడు. ఎలాగైనా ఆమెను పొందాలనుకున్నాడు. అయితే, అప్పటికే ఆమెకు వేరొకరితే వివాహం జరిగింది. అయినా సరే ఆమెను దక్కించుకోవాలన్న దుర్భుద్దితో ఓ ప్లాన్ వేశాడు. ఆమె భర్తను డ్రగ్స్ కేసులో ఇరికించాడు. ఆ కేసు నుంచి ఆమె భర్తను తప్పించడానికి హెల్ప్ చేస్తున్నట్టు నటిస్తే.. ఆమె తనకు దగ్గర అవుతుందని భావించాడు. అయితే, ప్లాన్ రివర్స్ అయింది.
ఐఏఎస్ అధికారి భర్త వద్ద డ్రగ్స్ దొరకడంతో పోలీసులు అవాక్కయ్యారు. ఈ కేసును మరింత లోతుగా విచారించారు. ఆ డ్రగ్స్ గురించి తమకు సమాచారం ఎవరిచ్చారో తెలుసుకున్నారు. ఓ పండ్ల వ్యాపారి సెల్ ఫోన్ నుంచి నుంచి పోలీసులకు ఆ సమాచారం వచ్చినట్టు గుర్తించారు. దీంతో సదరు పండ్ల వ్యాపారిని పట్టుకున్నారు. ఆ వ్యాపారి అసలు విషయాన్ని చెప్పాడు. ఆ రోజు ఓ వ్యక్తి తన సెల్ ఫోన్ తీసుకుని ఫోన్ చేశాడని తెలిపాడు. ఆ చుట్టుపక్కల ఉన్న సీసీకెమెరాలు, ఇతరత్రా ఆధారాలను పరిశీలించగా, అతడు సీఐఎస్ఎఫ్ కమాండెంట్ రంజన్ ప్రతాప్ సింగ్ అని తెలిసింది.
నిందితుడిని పోలీసులు ప్రశ్నించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఐఏఎస్ మీద మనసుపడ్డానని, ఆమె భర్తకు సాయం చేస్తున్నట్టు నటిస్తే తనకు దగ్గరవుతుందని భావించి ఇలా చేసినట్టు చెప్పాడు. డ్రగ్స్ కేసులో ఐఏఎస్ భర్త ఇరుక్కున్న తర్వాత ఈ కేసు గురించి ఆమెకు పలుమార్లు ఫోన్లు కూడా చేశానని చెప్పాడు. ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ నుంచి తాను ఓ ఫ్రెండ్ ద్వారా డ్రగ్స్ తెప్పించానని పోలీసుల విచారణలో తెలిపాడు.
ఆర్టీసీ కార్మికుడి కడుపులో సీఐ పిడిగుద్దులు
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.