Home /News /crime /

MAA PRESIDENT MANCHU VISHNU OFFICE THEFT CASE NEW TURN ACCUSED NAGA SRINU ALLEGES MANCHU FAMILY CASTE REMARKS MKS

Manchu Vishnu ఆఫీసులో చోరీ: కులం పేరుతో Manchu Family అమ్మ‌నా బూతులు: హెయిర్ డ్రెసర్ నాగ శ్రీను

మంచు ఫ్యామిలీ, నాగశ్రీను

మంచు ఫ్యామిలీ, నాగశ్రీను

మంచు కుటుంబం మరో వివాదంలో ఇరుక్కుంది. మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆఫీసులో చోరీ కేసు షాకింగ్ మలుపు తిరిగింది. నిందితుడు నాగశ్రీను సెల్ఫీ వీడియోతో ప్రత్యక్షమయ్యాడు. కులం పేరుతో అమ్మనా బూతులు తిట్టారని నిందితుడు ఆరోపించాడు. వివరాలివే..

ఇంకా చదవండి ...
టాలీవుడ్ పెద్దలుగా కొనసాగుతోన్న మంచు కుటుంబం మరో వివాదంలో ఇరుక్కుంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు ఆఫీసులో చోరీ కేసు షాకింగ్ మలుపు తిరిగింది. లక్షల విలువ చేసే హెయిర్ డ్రెసింగ్ సామాగ్రి ఎత్తుకెళ్లాడంటూ మంచు విష్ణు పోలీసులకు ఫిర్యాదు చేసిన కేసులో నిందితుడు నాగశ్రీను సెల్ఫీ వీడియోతో ప్రత్యక్షమయ్యాడు. గత 10ఏళ్లుగా మంచు కుటుంబానికి నమ్మకంగా పనిచేస్తున్నానని, కులం పేరుతో అమ్మనా బూతులు తిట్టినందుకే పని మానేశానని, చోరీకి పాల్పడలేదని నాగశ్రీను చెప్పుకొచ్చాడు. వివరాలివి..

మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆఫీలో చోరీ ఘటన చర్చనీయాంశం కావడం తెలిసిందే. అంతకంటే షాకిస్తూ, ఆ కేసులో నిందితుడైన హెయిర్ డ్రెసర్ నాగశ్రీను మంచు కుటుంబంపై సంచలన ఆరోపణలు చేశాడు. గత నెల 17 నుంచి కనిపించకుండా పోయిన నాగశ్రీను.. సోమవారం నాడు ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. కుల వివక్ష, మంగలి వృత్తిని కించపరుస్తూ మోహన్ బాబు కుటుంబం తిట్టడమే ఈ వివాదానికి అసలు కారణమని నిందితుడు పేర్కొన్నాడు. నాగశ్రీను వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Vishnu Manchu: మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆఫీసులో చోరీ.. ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే అవాక్కే!


ఆ వీడియోలో నాగశ్రీను ఏం చెప్పాడంటే.. ‘మోహన్ బాబు, మంచు విష్ణు కలిసి నన్ను చిత్ర హింసలు పెట్టి, చెప్పుకోలేని విధంగా బూతులు తిట్టి, కులం పేరుతో అవమానించిన కారణంగా నేను ఉద్యోగం మానేశాను. అలా మానేసినందుకు 5 లక్షల విలువ చేసే హెయిర్ డ్రెస్సింగ్ సామగ్రి చోరీ అని నా మీద అక్రమంగా కేసు పెట్టారు. మోహన్ బాబు నన్ను తిట్టడం, నన్ను మోకాళ్ళ మీద కూర్చోపెట్టి కొట్టడం మా ఆఫీసులో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఫిబ్రవరి 17 న మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ సంఘటన జరిగింది.

Kadapa: కామంతో కళ్లుమూసుకుపోయిన తల్లి.. ప్రియుడితో కలిసి కన్నకూతుర్ని ఏం చేసిందంటే..


నాపై లేనిపోని కేసులు పెట్టడంతో ఆ విషయం విని నా తల్లి కి గుండె నొప్పి వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యింది. 10 ఏళ్లుగా మోహన్ బాబు వద్ద నమ్మకంగా పనిచేస్తున్నాను. నాపై ఇలాంటి నిందలు వేయడం మీకు భావ్యం కాదు. విష్ణు బాబు నాపై అనవసరంగా కేసు పెట్టించారు. వారు అన్న బూతులు నేను మీకు చెప్పలేను. ఆ మాటలు పడలేకే నేను ఉద్యోగం మానేశాను. నాలాంటి చిన్నవారి జీవితాలతో ఆదుకోవడం మీలాంటి పెద్దవాళ్లకు తగదు. దయచేసి నన్ను వదిలేయండి. ఈ వీడియో చూసిన పెద్దలు నాకు న్యాయం చేయండి’అని నాగశ్రీను అన్నాడు.

CM KCRకు పీకే-Revanth Reddyకి ఎస్కే: ముందస్తు ఎన్నికల ప్లాన్ మామూలుగా లేదు..గురువుకు షాక్?


పోలీసుల కథనం ప్రకారం.. మా అధ్యక్షుడు మంచు విష్ణు వద్ద బోరబండకు చెందిన యు.నాగశ్రీను హెయిర్‌ డ్రెసర్ గా పనిచేస్తున్నాడు. ఈ నెల 17న జూబ్లీహిల్స్‌ సీబీఐ కాలనీలోని కార్యాలయంలో విష్ణుకు చెందిన రూ.5లక్షల విలువైన హెయిర్‌ డ్రెస్సింగ్‌, మేకప్‌ సామగ్రిని చెప్పకుండా, ఎలాంటి ఫర్మిషన్ లేకుండా తీసుకెళ్లాడు. ఫోన్ లో సంప్రదించేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రావడం లేదు. నాగశ్రీను చోరీకి పాల్పడినట్లు విష్ణు మేనేజర్‌ సంజయ్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. కాగా, నిందితుడు నాగశ్రీను చేసిన కులవివక్ష ఆరోపణలపై మంచు కుటుంబం స్పందించాల్సి ఉంది.
Published by:Madhu Kota
First published:

Tags: Hyderabad police, MAA President, Manchu mohan babu, Manchu Vishnu, Tollywood

తదుపరి వార్తలు