హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking Twist: హోటల్‌లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో పోలీసుల రైడ్.. శృంగారం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన ఈ జంట ఎవరో తెలిసి..

Shocking Twist: హోటల్‌లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో పోలీసుల రైడ్.. శృంగారం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన ఈ జంట ఎవరో తెలిసి..

నిందితులను అరెస్ట్ చేసి తరలిస్తున్న పోలీసులు

నిందితులను అరెస్ట్ చేసి తరలిస్తున్న పోలీసులు

వాళ్లిద్దరు ప్రాణంగా ప్రేమించుకున్న ప్రేమికులు కాదు. భార్యాభర్తలు అంతకన్నా కాదు. ఆమె భర్తకు మస్కా కొట్టింది. అతను భార్యకు ద్రోహం చేశాడు. ఇద్దరూ కలిసి తమకు అనుకూలమైన హోటల్‌లో రూమ్ తీసుకున్నారు. ఇద్దరూ శృంగారం చేస్తుండగా ఆ హోటల్‌లో పోలీసుల తనిఖీలు జరిగాయి.

ఇంకా చదవండి ...

  వాళ్లిద్దరు ప్రాణంగా ప్రేమించుకున్న ప్రేమికులు కాదు. భార్యాభర్తలు అంతకన్నా కాదు. ఆమె భర్తకు మస్కా కొట్టింది. అతను భార్యకు ద్రోహం చేశాడు. ఇద్దరూ కలిసి తమకు అనుకూలమైన హోటల్‌లో రూమ్ తీసుకున్నారు. ఇద్దరూ శృంగారం చేస్తుండగా ఆ హోటల్‌లో పోలీసుల తనిఖీలు జరిగాయి. తొలుత భార్యాభర్తలమని పోలీసుల ఎదుట బుకాయించినా తామిద్దరం వివాహేతర సంబంధం బాపతని ఒప్పుకోక తప్పలేదు. ఇలా ఈ జంట అడ్డంగా బుక్కయింది. ఈ ఘటన బీహార్‌లోని మోతిహారి పట్టణంలో వెలుగుచూసింది.

  ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. మోతిహారి పట్టణంలోని పానీ ట్యాంక్ చౌక్ దగ్గరలో ఉన్న ఓ రెసిడెన్షియల్ హోటల‌్‌లో వ్యభిచార దందా జోరుగా సాగుతోంది. హోటల్ యాజమాన్యంతో పాటు హోటల్ సిబ్బంది కూడా ఈ దందాలో భాగస్తులే. బయటకు కుటుంబాలు బస చేసే హోటల్‌లా కనిపించినా లోపల మాత్రం అంతా వ్యభిచారం చేసే మహిళలు, విటులే. అంతేకాదు, ఈ హోటల్‌లో వాళ్లతో పాటు వివాహేతర సంబంధాలు పెట్టుకున్న బాపతులకు కూడా గదులు అద్దెకిస్తారు. కానీ.. అంతా గుట్టుగా సాగుతుంది. అమ్మాయిలను సప్లయ్ చేసే వ్యక్తులకు తప్ప ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఈ హోటల్ యాజమాన్యం జాగ్రత్తపడింది.

  అయితే.. నేరం ఏదో ఒకరోజు బయటపడక తప్పదుగా. ఇక్కడా అదే జరిగింది. కొన్ని నెలలుగా వ్యభిచార దందాతో మూడుపువ్వులు ఆరుకాయలన్నట్టుగా సాగుతున్న ఈ హోటల్ బాగోతం గురించి పోలీసులకు సమాచారం అందింది. ఇంకేముంది.. ఈ సమాచారం తెలిసిన వెంటనే సదరు హోటల్‌పై పోలీసులు రైడ్స్ జరిపారు. ఆ హోటల్‌లో ఓ జంట అడ్డంగా బుక్కయింది. అది కూడా ఇద్దరూ కలిసి శృంగారం చేస్తున్న సమయంలో దొరికిపోయారు. వాళ్లిద్దరూ విటుడు, వేశ్య అని తొలుత పోలీసులు భావించినప్పటికీ.. ఇద్దరినీ విచారించగా విస్తుపోయే నిజం వెలుగుచూసింది. తామిద్దరం భార్యాభర్తలమని తొలుత చెప్పినా ఆ తర్వాత నిజం ఒప్పుకోక తప్పలేదు. కొన్నాళ్ల నుంచి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నామని.. ఈ హోటల్ గురించి తెలిసి ఇక్కడ కలిశామని వాళ్లు చెప్పడంతో అవాక్కవడం పోలీసుల వంతయింది. వీళ్లిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.

  ఇది కూడా చదవండి: Female Teacher: టీ తాగడానికని లేడీ టీచర్ ఇంటికెళ్లి ఎంత పనిచేశాడు.. ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిన వీడియో..!

  పోలీసుల తనిఖీ గురించి ముందే తెలుసుకున్న హోటల్ సిబ్బంది ఆ హోటల్ మేనేజర్‌తో సహా అక్కడి నుంచి తప్పించుకున్నారు. అయితే.. పోలీసులు ఆ హోటల్ యజమానులైన కౌషల్ కిషోర్, రాహుల్ కుమార్, వ్యభిచార దందాకు యువతులను సప్లయ్ చేస్తున్న ఒక మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే హోటల్ ఉద్యోగుల్లో కొందరిని అదుపులోకి తీసుకున్నామని, మిగిలిన వారిని కూడా త్వరలో పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. ఈ హోటల్‌లో ఈ చీకటి దందా కొన్ని నెలల నుంచి సాగుతుందని తెలిసి స్థానికులు అవాక్కయ్యారు. ఇన్నాళ్లూ ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్త పడిన ఆ హోటల్ యాజమాన్యం ప్రస్తుతం జైలు పాలైంది.

  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Couple affair, Crime news, Latest news, Lovers, Prostitution racket

  ఉత్తమ కథలు