లవ్... సెక్స్... దోఖా: వివాహేతర సంబంధం ఎలా బయటపడింది?

లత ఓ వ్యక్తితో హోటల్ గదిలోకి వెళ్లింది. ఈ విషయం తెలియగానే లత భర్త ఫ్లైట్‌లో వచ్చాడు. హోటల్ గదికి వెళ్లాడు. తలుపు తట్టాడు. కాసేపటి తర్వాత తలుపు తెరిచింది లత. అశోక్ లోపలికి వెళ్లి చూశాడు. అంతే... పెద్ద గొడవ జరిగిపోయింది.

news18-telugu
Updated: October 30, 2018, 11:32 AM IST
లవ్... సెక్స్... దోఖా: వివాహేతర సంబంధం ఎలా బయటపడింది?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
డిటెక్టీవ్‌లు డీల్ చేసే కేసులు... పోలీసులు దర్యాప్తు చేసే కేసుల్లానే ఉంటాయి. అడుగడుగునా ఎన్నో మలుపులు, ఊహించని పరిణామాలు, నమ్మలేని క్లైమ్యాక్స్... ఇలాంటి డిటెక్టీవ్ కథలెన్నో. అయితే ఈ కథలు ఎక్కువగా మానవ సంబంధాల చుట్టే తిరుగుతుంటాయి. అలాంటిదే ఈ కథ కూడా. ఓరోజు లక్నో నుంచి మాకు ఫోన్ కాల్ వచ్చింది. అటువైపు మాట్లాడుతున్నది అశోక్. "నా భార్య గురించి నిజం తెలుసుకోవాలి, తను కాసేపట్లో ఢిల్లీకి వస్తోంది" అని చెప్పాడు అశోక్. అతను చాలా తొందరలో ఉన్నాడు. కానీ అసలేం జరిగిందో తెలియకుండా మేం ఎలా దర్యాప్తు చేస్తాం. అందుకే... ఏం జరిగిందో చెప్పమని అశోక్‌నే అడిగాం. అశోక్ ఏం చెప్పాడంటే...

"మేము లక్నోలో నివసించేవాళ్లం. మాకు ఇద్దరు పిల్లలు. కూతురు 12వ తరగతి, కొడుకు 7వ తరగతి చదువుతున్నారు. కొంతకాలంగా లత ప్రవర్తనలో విచిత్రమైన మార్పు కనిపిస్తోంది. లత తరచూ ఢిల్లీ వెళ్తోంది. కారణం ఆమె పుట్టిల్లు ఘజియాబాద్‌లో ఉంది. బంధువులంతా ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్‌లో ఉంటున్నారు. కానీ ఇటీవల తరచూ ఢిల్లీ వెళ్తోంది. కారణాలు అడిగితే పొంతనలేని సమాధనాలు చెబుతోంది. ఈరోజు కూడా లత శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీకి బయల్దేరింది. తన కొలీగ్ ఇంట్లో ఫంక్షన్ ఉందని చెప్పింది కానీ అడ్రస్ ఎక్కడో తెలియదు. ఇప్పుడే కాదు... గతంలో కూడా లత ఒంటరిగా ప్రయాణించేది. పిల్లల్ని తీసుకెళ్లమన్నా ఒప్పుకునేది కాదు. లత ప్రవర్తనతో నాకు విసుగొచ్చింది. అందుకే నిజం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నా. తన వివరాలు మీకు ఇస్తాను. లత రైలు దిగిన తర్వాత ఆమెను అనుసరించండి. ఎప్పటికప్పుడు నాకు సమాచారం ఇవ్వండి."

ఇవీ అశోక్ చెప్పిన మాటలు. ఒక విషయం మాకు స్పష్టంగా అర్థమైంది. ఇక మేం దర్యాప్తు ఎక్కడ మొదలుపెట్టాలో తెలిసింది. రైలు ఢిల్లీకి రాగానే మా పని మొదలుపెట్టాలనుకున్నాం. లత వివరాలు తీసుకున్నాం. మా టీమ్ ఢిల్లీ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. లక్నో నుంచి లత అక్కడికే వస్తోంది. లత రైలు దిగగానే మా టీమ్ ఆమెను అనుసరించింది. ఆమెకు తెలియకుండానే ఫాలో అయింది మా టీమ్.

#LoveSexDhokha: affair with boy friend, Wife cheated husband 

లత ముందుగా క్యాబ్ బుక్ చేసుకుంది. కొద్ది దూరం వెళ్లాక క్యాబ్ దిగింది. అశోక్ చెప్పిన దాని ప్రకారం లత ఢిల్లీ, నోయిడా లేదా ఘజియాబాద్‌కు వెళ్లాలి. కానీ ట్యాక్సీ గుర్గావ్ వైపు వెళ్తుండటంతో మా అనుమానం పెరిగింది. కాసేపటి తర్వాత క్యాబ్ ఓ కాఫీ షాప్ దగ్గర ఆగింది. లత లోపలికి వెళ్లింది. అక్కడ ఓ వ్యక్తి లతను కలిసేందుకు వచ్చాడు. కాసేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు. కాఫీ తాగారు. బయటకి వచ్చారు. లత ఆ వ్యక్తి కారులోకి వెళ్లింది. అక్కడ్నుంచి ఇద్దరూ బయల్దేరారు. ఆ కారు ఓ హోటల్ ముందు ఆగింది. అది మరీ అంత పెద్ద హోటలేమీ కాదు. అలాగని ఆర్డినరీది కాదు. కాస్త బాగానే ఉంది. ఇద్దరూ రిసెప్షన్‌కు వెళ్లారు. ఫార్మాలిటీస్ పూర్తి చేసి ఓ గది బుక్ చేసుకున్నారు.


ఇక్కడే మాకు సమస్య ఎదురైంది. మేం హోటల్‌లోకి వెళ్లలేకపోయాం. మేం కూడా హోటల్‌లో గది తీసుకోవడం వల్ల వచ్చేదేమీ లేదు. అయితే హోటల్‌లో ఏ గదిలో ఉన్నారో మేం తెలుసుకోవాలనుకున్నాం. హోటల్‌కు గోడ కాకుండా గ్లాస్ విండో ఉండటంతో మెట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇద్దరూ మెట్లు ఎక్కి పైకి వెళ్తున్నట్టు మాకు కనిపించింది. ఇద్దరూ థర్డ్ ఫ్లోర్‌లో ఉన్న గదికి వెళ్లారు. సరిగ్గా మధ్యాహ్నం 12.30 గంటలవుతోంది. లత హోటల్ గదిలోకి వెళ్లడంతో ఇక ఆమెపై నిఘా పెట్టలేకపోయాం. మేం అప్పటివరకు అశోక్‌కు అప్‌డేట్స్ ఇచ్చాం. తను వెంటనే అక్కడికి వస్తానని అశోక్ చెప్పాడు. అయితే వాళ్లు హోటల్ గదిలో ఎంతసేపు ఉంటారో తెలియదు. కానీ అశోక్ మాత్రం తన కూతుర్ని తీసుకొని ఫ్లైట్‌లో వచ్చాడు. హోటల్‌ దగ్గరకు చేరుకున్నాడు.
#LoveSexDhokha: affair with boy friend, Wife cheated husband
ప్రతీకాత్మక చిత్రం


హోటల్‌కు రాగానే అశోక్ మమ్మల్ని కలిశాడు. రిసెప్షన్‌లో వివరాలు తెలుసుకున్నాడు. నేరుగా ఆ గదికి వెళ్లాడు. తలుపు బాదాడు. లోపలి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. మళ్లీ కొన్నిసార్లు తలుపు బాదాడు. ఎవరూ అని లోపలి నుంచి లత అడిగింది. మేం రూమ్ సర్వీస్ అని చెప్పాం. కానీ తలుపు తెరిచేందుకు ఆమె ఒప్పుకోలేదు. ఇప్పుడు ఎలాంటి రూమ్ సర్వీస్ అవసరం లేదు. తర్వాత రమ్మని సమాధానమిచ్చింది. దీంతో అశోక్ మాట్లాడాడు. స్నానం చేస్తున్నానని, బట్టలు వేసుకొని వస్తానని చెప్పింది. కాసేపటి తర్వాత లత తలుపు తెరిచింది. అశోక్ కోపంతో ఆమె వైపు చూశాడు. "ఎందుకొచ్చారు" అని లత అడిగింది. సమాధానం చెప్పకుండా అశోక్ లోపలికి వెళ్లాడు. రూమ్ మొత్తం చెక్ చేశాడు. ఆ వ్యక్తి ఎక్కడా కనిపించలేదు. కిటికీ తెరిచి చూశాం. బాత్‌రూమ్‌లో చెక్ చేశాం. ఎక్కడా అతను కనిపించలేదు. అశోక్ మమ్మల్ని అనుమానంగా ప్రశ్నించాడు. అయితే ఇద్దరూ హోటల్ గదిలోకి వెళ్లడం మేం చూశామని, ఇప్పటికీ ఆ కారు పార్కింగ్‌లోనే ఉందని చెప్పాం.


లత వరుసగా ప్రశ్నలు వేస్తూనే ఉంది. కానీ మేం సమాధానం చెప్పలేదు. ఆ వ్యక్తి కోసం వెతుకుతూనే ఉన్నాం. కానీ మాకు ఎక్కడో ఏదో అనుమానం వచ్చింది. మంచంపై ఉన్న పరుపు తీసేశాం. అది బాక్స్ బెడ్. అది చూసి లత మమ్మల్ని అడ్డుకుంది. కానీ మేం ఆ బాక్సును తెరిచాం. ఆ వ్యక్తి అందులోనే దాక్కున్నాడు. అతడిని అక్కడ దాచేందుకే లత వెంటనే తలుపు తెరవకుండా సమయం తీసుకుందని మాకు అర్థమైంది. లతకు చెమటలు పట్టాయి. అతడిని అశోక్ తిడుతున్నాడు. కొట్టడం మొదలుపెట్టాడు. లత అడ్డుకోబోతే ఆమెనూ కొట్టాడు. మేం అశోక్‌ను సముదాయించాం. ఇలా చేస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరించాం. మాట్లాడేందుకు సోఫాలో కూర్చున్నాం.

#LoveSexDhokha: affair with boy friend, Wife cheated husband
ప్రతీకాత్మక చిత్రం


లతకు ఆమె కూతురు నచ్చజెప్పడం మొదలుపెట్టింది. కానీ లత మాట వినట్లేదు. ఇంత జరిగాక ఇక తాను లక్నోకు రానని, ఆ వ్యక్తితోనే ఢిల్లీలో ఉంటానని తెగేసి చెప్పింది. లత కూతురు తన సోదరుడికి కాల్ చేసి తల్లితో మాట్లాడించాలని ప్రయత్నించినా వినలేదు. ఫోన్ విసిరికొట్టింది. మొండిగా ప్రవర్తించింది. ఆమెను ఒప్పించేందుకు అశోక్ ప్రయత్నించినా ఫలితం లేదు. "నేను లక్నోకు రాను. మీకు విడాకులు కావాలంటే తీసుకోండి. ఏం చేయాలనుకుంటే అది చేసుకోండి. నేను విజయ్‌తో కలిసి అతని ఇంట్లోనే ఉంటాను. మన బంధం ఇవాళ్టితో ముగిసింది" అని తెగేసి చెప్పింది లత.

విజయ్ కూడా ఆమెకే మద్దతు ఇచ్చాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. లత తీసుకున్న నిర్ణయం అశోక్‌కు షాకిచ్చింది. ఈ వయస్సులో పెళ్లి చేసుకుంటే అందరూ ఏమనుకుంటారని, పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని అశోక్ ఇప్పుడు బాధపడుతున్నాడు.

(ఇది 'ట్రాక్ ఐ డిటెక్టీవ్ ఏజెన్సీ' సీఎండీ వేద్ ప్రకాష్ జోషి డీల్ చేసిన కేసుల్లో ఒకటి. ఇది నిజమైన కథే. పాత్రలూ నిజమైనవే. కానీ పాత్రల పేర్లు మార్చాం.)

ఇవి కూడా చదవండి:

లవ్... సెక్స్... దోఖా: భార్యతో శృంగారానికి భర్త ఎందుకు ఇష్టపడలేదు?

వాట్సప్‌లో న్యూస్18 తెలుగు అలర్ట్స్: ఇలా రిజిస్టర్ చేసుకోవాలి...

మీ బడ్జెట్‌లో ఈ 5 మార్పులు కనిపించాయా? అప్పులపాలవుతున్నట్టే...

ఐటీ నోటీస్ వచ్చిందా? ఏం చేయాలో తెలుసా?

ఎస్‌బీఐ ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్: తగ్గిన ఏటీఎం విత్‌డ్రా లిమిట్

ఫ్రీ యాప్స్ వాడుతున్నారా? మీ డేటా గల్లంతే...

ఎల్ఐసీలో ప్రీమియం డిపాజిట్ రూల్ మారింది తెలుసా?

Video: అప్పుల ఊబిలోకి ప్రయాణం... ఇవే 5 హెచ్చరికలు

Photos: ఖరీదైన కార్లు, ఫ్లాట్లు... మనసున్న మహారాజు దీపావళి గిఫ్ట్‌లు

Photos: ఇస్తాంబుల్‌లో కొత్త ఎయిర్‌పోర్ట్ విశేషాలు తెలుసా?
First published: October 30, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు