Home /News /crime /

LOVERS WERE TRYING TO TAKE A SELFIE WITH THE KALI AS THE BACKDROP BUT PURPORTEDLY FELL INTO THE RIVER INSTEAD SSR

Lovers: సెలవులు కదా అని లవర్స్ ఇద్దరూ సరదాగా బయటకు వెళ్లారు.. కానీ పాపం ఇలా జరుగుతుందని...

పురుషోత్తమ పాటిల్, రక్షిత

పురుషోత్తమ పాటిల్, రక్షిత

పండుగ నేపథ్యంలో వరుస సెలవులు రావడంతో ఎక్కడికైనా టూర్‌కు వెళ్లాలని ఇద్దరూ అనుకున్నారు. వారికి కాస్త దూరంలో ఉన్న జోయిడా వద్ద అంబికానగర గణేశ్ ఆలయం సమీపంలోని వంతెన వద్దకు వెళ్లారు. అక్కడికి వెళ్లేందుకు బాడుగకు ఆటో మాట్లాడుకున్నారు. సోమవారం ఇద్దరూ కలిసి...

ఇంకా చదవండి ...
    బీదర్: స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చాక చాలామందికి సెల్ఫీలపై విపరీతంగా క్రేజ్ పెరిగింది. అయితే.. ఈ క్రేజ్ కొన్ని సందర్భాల్లో కొంప ముంచుతోంది. సెల్ఫీల మోజులో పడి ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన వారూ ఉన్నారు. కర్ణాటకలో తాజాగా అలాంటి ఘటనే జరిగింది. సెల్ఫీ తీసుకుందామనే తాపత్రయంలో కాలు జారి నదిలో పడిన ఓ ప్రేమ జంట ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన రెండు కుటుంబాల్లో పెను విషాదం నింపింది. కన్నవారికి కడుపుకోత మిగిల్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బీదర్‌లోని కర్ణాటక కాలేజీలో పురుషోత్తమ పాటిల్, ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిని రక్షిత స్నేహితులు. ఆ స్నేహం కాస్తా కొన్నాళ్లకు ప్రేమగా మారింది. రక్షిత గుల్బర్గాలో ఇంజనీరింగ్ చదువుతోంది. ఇద్దరూ సెలవులు వచ్చినప్పుడల్లా సరదాగా బయటకు వెళ్లేవారు. ఆ క్రమంలోనే.. పండుగ నేపథ్యంలో వరుస సెలవులు రావడంతో ఎక్కడికైనా టూర్‌కు వెళ్లాలని ఇద్దరూ అనుకున్నారు. వారికి కాస్త దూరంలో ఉన్న జోయిడా వద్ద అంబికానగర గణేశ్ ఆలయం సమీపంలోని వంతెన వద్దకు వెళ్లారు. అక్కడికి వెళ్లేందుకు బాడుగకు ఆటో మాట్లాడుకున్నారు. సోమవారం ఇద్దరూ కలిసి అక్కడికి వెళ్లారు. ఆ వంతెనపై ఎవరూ లేని సమయంలో స్మార్ట్‌ఫోన్‌లో పురుషోత్తమ, రక్షిత సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే.. సెల్ఫీ తీసుకుంటుండగా వంతైన పై నుంచి జారి పడి కాళీ నదిలో పడిపోయారు. ఇద్దరికీ ఈత రాదు. దీంతో.. నదిలో పడగానే మునిగిపోయారు. ఆ సమయంలో వంతెన వద్ద ఎవరూ లేకపోవడంతో వారిని రక్షించే వారే లేకపోయారు. నీటిలో పడిన పురుషోత్తమ, రక్షిత కొద్దిసేపటికి ప్రాణాలు కోల్పోయారు. సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో స్మార్ట్‌ఫోన్ వంతెనపై పడిపోయింది. ఆ ఫోన్ రక్షితది కావడం గమనార్హం. ఆ ఫోన్‌లో ఉన్న నంబర్ల ఆధారంగా యువతి కుటుంబ సభ్యులకు ఘటనా స్థలంలోని కొందరు సమాచారం అందించారు.

    సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మంగళవారం ఉదయం ఇద్దరి మృతదేహాలను పోలీసులు ఒడ్డుకు చేర్చారు. బీదర్ జిల్లా రామనగర పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదకరమైన ప్రదేశాల్లో సెల్ఫీలకు ప్రయత్నించవద్దని, సెల్ఫీలు తీసుకునే సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో కూడా కొన్ని జరిగాయి.

    భారత్‌‌లో సెల్ఫీలు తీసుకుంటున్న వారిలో సంవత్సరానికి 150 మందికి పైగానే మరణిస్తున్నారు. 2017లో 11 మందితో కూడిన బోట్ నదిలో వెళుతుండగా.. ఫేస్‌బుక్‌ లైవ్‌లో నది అందాలను చూపించారు. అనంతరం వారంతా గ్రూప్ సెల్ఫీ తీసుకుంటుండగా.. బోటు అదుపుతప్పి నీటిలో మునిగింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Karnataka, Lovers, Selfie, Selfie Deaths

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు