LOVERS WERE TALKING IN A SECLUDED AREA ON THE NATIONAL HIGHWAY IN KARUR HERE WHAT HAPPENED NEXT SSR
Shocking Incident: నైట్ టైంలో హైవే రోడ్డు పక్కన చెట్టు కింద లవర్స్ రొమాన్స్.. చివరికి ఏం జరిగిందంటే..
ఘటనకు సంబంధించిన దృశ్యాలు
ఆ యువతి వయసు 22 సంవత్సరాలు. బీటెక్ పూర్తి చేసింది. కోయంబత్తూర్‌లోని ఐటీ పార్క్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. పెరుందురైకి చెందిన ఓ యువకుడు, సదరు యువతి ప్రేమించుకున్నారు.
కరూరు: ఆ యువతి వయసు 22 సంవత్సరాలు. బీటెక్ పూర్తి చేసింది. కోయంబత్తూర్‌లోని ఐటీ పార్క్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. పెరుందురైకి చెందిన ఓ యువకుడు, సదరు యువతి ప్రేమించుకున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కరూర్‌లోని ఇంటికి వెళ్లిన ఆమె తన ప్రియుడిని కూడా అక్కడికి రావాలని పిలిచింది. కరూర్-తిరుచ్చి నేషనల్ హైవేపై ఉన్న తోరణక్కల్పట్టి ఫ్లైఓవర్ సమీపంలో 13వ తేదీ రాత్రి సమయంలో ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ ప్రేమ జంట మాటలతో ఆగకుండా కొంతసేపటికి అక్కడే సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న చెట్టు కిందకు వెళ్లి రొమాన్స్ చేసుకుంటూ ఉన్నారు. అయితే.. ఈ లవర్స్ మాట్లాడుకోవడం, ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఎవరికీ కనిపించని ప్రదేశంలోకి వెళ్లి రొమాన్స్ చేసుకుంటూ ఉండటాన్ని విరలైపట్టి ప్రాంతానికి చెందిన శరవణకుమార్ అలియాస్ శరవణన్ గమనించాడు.
వాళ్లిద్దరినీ ఫాలో అయి.. ఆ లవర్స్ ఇద్దరినీ హడలెత్తించాడు. పారిపోతున్న వాళ్లిద్దరినీ వెంటాడి ఆ యువకుడిని కొట్టి యువతిపై అత్యాచారానికి యత్నించాడు. అయితే.. ఆ యువతీయువకుడు భయంతో కాపాడండంటూ కేకలు వేయడంతో అటుగా వెళుతున్న ఇద్దరు యువకులు వాళ్లిద్దరి అరుపులు విని అక్కడికి రావడంతో శరవణన్ భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో.. ఆ లవర్స్ ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే జరిగిన ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ లవర్స్‌తో పాటు శరవణన్‌ను కూడా విచారించి అతను తప్పు చేసినట్లుగా తేల్చారు. ఆ యువతి ఫిర్యాదుతో ఆమెను లైంగికంగా వేధించేందుకు యత్నించిన శరవణన్‌ను అరెస్ట్ చేశారు.
పోలీసులు అతనిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. నిర్మానుష్య ప్రదేశంలో ప్రేమ జంట కలుసుకోవడం వల్ల ఇలా జరిగిందని.. ఇలా ప్రేమికులు పబ్లిక్ ప్లేస్ల్లో కాకుండా ఇతర చోట్ల కలుసుకుని ఇలాంటి పరిస్థితులను కొనితెచ్చుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. అంతేకాదు.. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడిన యువతీయువకులు పెళ్లీడుకొచ్చినప్పటికీ తల్లిదండ్రులు పెళ్లి చేయకపోవడం మూలాన కూడా ఇలాంటి ఘటనలు జరుగుతాయనడానికి ఇదొక ఉదాహరణ అని పోలీసులు చెప్పుకొచ్చారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన కొన్ని దృశ్యాలు సీసీ కెమెరాల్లో కూడా రికార్డయ్యాయి. వాటిని పరిశీలించిన పోలీసులు శరవణన్ ఆ యువతిపై అత్యాచారానికి యత్నించినట్లు తేల్చారు.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.