హోమ్ /వార్తలు /క్రైమ్ /

ప్రేమకి మతం మకిలీ... ఒకే తాడుకి ఉరేసుకుని ప్రేమికుల ఆత్మహత్య...

ప్రేమకి మతం మకిలీ... ఒకే తాడుకి ఉరేసుకుని ప్రేమికుల ఆత్మహత్య...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భిన్నమతాలకు చెందిన వారి మధ్య చిగురించిన ప్రేమ... పెద్దలు పెళ్లికి ఒప్పుకోరనే మనస్థాపంలో బలవన్మరణం...

వారి మతాలు వేరు... కాని మనసులు ఒకటే. పెద్దలకు తెలియకుండా ప్రేమించుకున్నారు... కానీ వారిని ఒప్పించి పెళ్లిచేసుకోలేని తెలుసుకోలేకపోయారు. పారిపోయి బతికేంత ధైర్యం లేక... బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. మతాలు వేరనే కారణంగా ప్రేమికులు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ పరిధిలోని ధమర్రా గ్రామానికి చెందిన అర్జున్ సింగ్ కుమార్తె శిల్పి... రెండు రోజులుగా కనిపించడం లేదు. ఉన్నట్టుండి కనిపించకుండా పోయిన కూతురి గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు అర్జున్ సింగ్.

శిల్పి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు... ఆమె, మరో యువకుడితో కలిసి ఆత్మహత్య చేసుకుందనే విషయం తెలిసింది. శిల్పి, ఆమె ప్రేమికుడు అర్జున్ కలిసి ఆత్మహత్య చేసుకున్నట్టు తేలింది. వీరిద్దరూ ఒకే బెంచిపై నిల్చొని, ఒకే తాడుపై నిల్చుని ఉరి వేసుకున్నారు. అయితే ప్రేమికుల దగ్గర ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. శిల్పి సిక్ మతానికి చెందిన అమ్మాయి కాగా... అర్జున్ హిందూమతానికి చెందిన వ్యక్తి. అర్జున్‌ తల్లిదండ్రులు చనిపోగా... నానమ్మ దగ్గరే ఉంటూ చదువుకుంటున్నాడు. కాలేజీలో కలిసిన వీరి పరిచయం కాస్తా... ప్రేమగా మారింది. అయితే అర్జున్ మతం వేరు కావడంతో పెళ్లి చేసుకోవడం కష్టమని భావించి, బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. నానమ్మ ఇంట్లో లేని సమయంలో అర్జున్, శిల్పి కలిసి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. అర్జున్ ఉద్యోగానికి రాకపోవడంతో ఏమైందని చూసేందుకు వచ్చిన అతని సహోద్యోగి... ఒకే బెంచ్‌పై ఉరేసుకుని చనిపోయిన ఇద్దరినీ చూసి షాక్ అయ్యాడు. పోలీసులకు సమాచారం అందించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి...

మీ ఫోన్‌లో ‘ఆ వీడియోలు’ ఉన్నాయా... అయితే జైలుకి వెళ్లక తప్పదు...


దుబాయ్‌‌లో రోడ్డుప్రమాదం... భార్య శవం కోసం రూ. 40 లక్షలు చెల్లించిన భర్త...


భర్త పొలం పనులకు వెళ్లగానే ప్రియుడితో సరసం... విషయం తెలిసిన భర్త ఏం చేశాడంటే...


చలి తట్టుకోలేక మంచం కింద హీటర్ పెట్టుకున్నారు... నిప్పంటుకుని...


8 ఏళ్ల బాలికపై రేప్... అత్యాచారానికి ఒడిగట్టిన ‘క్లాస్‌మేట్స్’...

First published:

Tags: Crime

ఉత్తమ కథలు