అడ్డ కూలీలనే టార్గెట్ చేస్తున్న ఓ జంటన అతి కిరాతకమైన సంఘటనలకు పాల్పడుతున్నారు..తోటి ఆడవాళ్లు అనికూడా చూడకుండా తన ప్రియుడికి సహాకరిస్తోంది ప్రియురాలు.. కనీస మానవ విలువలు లేకుండా అక్రమంగా తమ జీవితాలకు కొనసాగిస్తూ... హత్యలకు పాల్పడుతున్నారు..
ఈ నేపథ్యంలోనే వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం జనగాం ప్రాంతానికి చెందిన కురువ స్వామి అనే యువకుడు జల్సాలకు అలవాడు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనకు దిగాడు. ఈ నేపథ్యంలోనే నర్సమ్మ అనే ముప్పై సంవత్సరాల వయస్సున్న మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇలా ఇద్దరు కలిసి సంగారెడ్డి జిల్లా వైఎస్ఆర్ కాలనీలోని ఉంటూ సహాజీవనం చేస్తున్నారు.
ఇక ఇద్దరు కలిసి అడ్డా కూలీలను టార్గెట్ చేస్తారు..ఇందుకోసం స్వామికి నర్సమ్మ సహకరిస్తుంది. మహిళలపై కన్నేయడం వారిని మాయమాటలు చెప్పి పని ఉందంటూ తీసుకెళ్లడం వీరిపని అనంతరం నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకువెళ్లి..ఆ మహిళలపై స్వామి ముందుగా అత్యాచారం చేస్తాడు..అందుకోసం నర్సమ్మ సహకరిస్తుంది..వ్యతిరేకిస్తే..కాళ్లు గట్టిగా పట్టుకుని స్వామికి సహాకరిస్తుంది. ఇలా అత్యాచారం చేసిన తర్వాత వారిపై ఉన్న నగలు ఇతర వస్తువులను ఎత్తుకెళ్లడం వారి హాబీగా మారింది..ఇలా ఇప్పటేకే ముగ్గురు మహిళలపై అత్యాచారం చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది..
. నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం చంద్రతండాకు చెందిన భామిని అనే 39 సంవత్సరాల మహిళ అడ్డకూలీగా పని చేస్తోంది. ఈ క్రమంలోనే ఇద్దరు కలిసి ఈనెల 25న ఓ గుడికి సున్నం వేయాలని చెప్పి బైక్ పై తీసుకువెళ్లారు.. అనంతరం ఆమెను జిన్నారం మండలం మాదారం గ్రామపంచాయితీ మంత్రికుంట శివారు అటవీ ప్రాంతంలో బండరాళ్ల పైకి తీసుకువెళ్లారు..పోలీసులు చెబుతున్న దాని ప్రకారం అక్కడికి మనుష్యులు ఎవరు పోరని చెబుతున్నారు. మనుష్యులు ఎవరు ఎక్కలేని గుట్టకు భామినిని తీసుకువెళ్లినట్టు చెప్పారు. ఇక మధ్యలో తనకు ఆకలి అవుతుంటే తెచ్చుకున్న భోజనం కూడా చేసినట్టు వివరించారు.
ఈ నేపథ్యంలోనే స్వామితో భామినితో గడపాలని నర్సమ్మ కోరడంతో భామిని తిరస్కరించిందని ..ఈ నేపథ్యంలోనే ఆమెపై క్రూరంగా పడి అత్యాచారం చేశాడని పోలీసులు వివరించారు. అనంతరం ఆమె మర్మాంగాలపై కట్టలతో దాడి చేయడంతో ఆమె మరణించిందని చెప్పారు. ఈనేపథ్యంలోనే వారిద్దరిని కస్టడిలోకి తీసుకుని విచారించనున్నట్టు డీసీపి పద్మజ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Hyderabad