పెళ్లికి ఒప్పుకోని పెద్దలు... రైలు కింద పడ్డ ప్రేమ జంట

వీరిద్దరు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం తెలుసుకున్న పెద్దలు పెళ్లికి ససేమిరా అన్నారు.

news18-telugu
Updated: March 31, 2019, 2:57 PM IST
పెళ్లికి ఒప్పుకోని పెద్దలు... రైలు కింద పడ్డ ప్రేమ జంట
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: March 31, 2019, 2:57 PM IST
మరో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. తమ ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతో చావే శరణమనుకున్నారు. అనుకున్నదే తడువు ఇద్దరు కలిసి ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పిల్లోనిగూడ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం నందిగామ మండలం పిట్టలగూడేనికి చెందిన శ్రవణ్ డిగ్రీ చదువుతున్నాడు. మహేశ్వరం మండలం కల్వకోల్ గ్రామానికి చెందిన మయూరి ఇంటర్ చదువుతోంది. వీరిద్దరు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం తెలుసుకున్న పెద్దలు పెళ్లికి ససేమిరా అన్నారు. దీంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నారు. వీరి శవాలను గుర్తించిన రైతులు... వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఇద్దరి మృతదేహాల్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

మార్చి 27న కూడా ఇలానే ఓ ప్రేమజంట నొయిడాలో రైల్వేట్రాక్‌పై పడి ఆత్మహత్య చేసుకుంది. ఇదే ఏడాది ఫిబ్రవరిలో కోయంబత్తూరు‌లో మరో జంట రైలు ఎదుట దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాలేజ్ నుంచి నేరుగా రైల్వే స్టేషన్‌కు వచ్చిన ప్రేమజంట కాసేపు స్టేషన్‌లోని కూర్చొని కబుర్లు చెప్పుకున్నారు. ట్రైన్ రాగానే దూకి ఆత్మహత్య చేసుకున్నారు .

 

First published: March 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు