Andhra Pradesh: ఇద్దరిదీ ఒకే గ్రామం.. ఒకరి నొకరు ఇష్టపడ్డారు.. ప్రేమించుకున్నారు. కానీ వారి పెళ్లికి మాత్రం పెద్దలు నిరాకరించారు. దీంతో మనస్తాపం చెందారు.. జీవించినా.. మరణించినా మనిద్దరమే అనుకున్నారు.. అనుకున్న విధంగా మరణంలో కూడా వీరి ప్రేమ విడదీయలేని బంధంగా నిలిచింది. ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నారు.. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) రేగిడి మండలం తునివాడ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన హరీష్, దివ్య ప్రేమజంట ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య(Lovers Suicide)కు పాల్పడింది. ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జిల్లాలో ఈ విషాదకరమైన ఘటన విషాదాన్ని నింపింది. తునివాడ గ్రామానికి చెందిన హరీష్, దివ్య ఇద్దరూ పక్కపక్క ఇళ్లలో నివాసముండేవారు. గత రెండు సంవత్సరాలుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఇంట్లో వాళ్లకి కూడా వీరి ప్రేమ విషయం తెలుసు. కానీ పెళ్లి చేసుకుందామన్న వీరి ఆశకు ఇరు కుటుంబాలు అడ్డుపడ్డాయి. ప్రేమ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఇంట్లో వారికి తెలియకుండా.. హరీష్, దివ్య విశాఖపట్నం (Visakhapatnam) లోని ఒక ఆలయంలో రహస్యంగా వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకుని తిరిగి తునివాడకు వచ్చిన తర్వాత.. వివాహమైన రెండు నెలలకే ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆ రెండు కుటుంబాలను శోక సంద్రంలో ముంచింది. ఈ రెండు నెలలు హ్యాపీగానే కనిపించారు. ఇంతలోనే ఏమైందో ఏమో తెలియదు గానీ ఇద్దరు ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని గ్రామస్తులు చెబుతున్నారు.
మరొక వాదన కూడా వినిపిస్తోంది. హరీష్, దివ్యల పెళ్లికి మొదట దివ్య తల్లిదండ్రులు అడ్డుపడ్డా.. ఊర్లో పెద్దల మాట విని ఇద్దరికీ పెళ్లి చేసేందుకు దివ్య తల్లిదండ్రులు ఒప్పుకున్నారని. కానీ తమ కూతురిని ఇచ్చి పెళ్లి చేయాలంటే.. తమ కూతుని పోషించగలగాలని, మంచి ఉద్యోగం సంపాదించాలని కండీషన్ పెట్టినట్టు తెలుస్తోంది. ఉద్యోగం రాగానే పెళ్ళిచేస్తామని దివ్య తల్లిదండ్రులు తెలిపారన్న వెర్షన్ వినిపిస్తోంది.
ఇదీ చదవండి: టీడీపీ-బీజేపీ పొత్తుపై ఎంపీ సంచలన వ్యాఖ్యలు.. ఫైనల్ చేసేది వారే అంటూ క్లారిటీ
డిగ్రీ పూర్తి చేసిన హరీష్ ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు. ఉద్యోగం కోసం రకరకాల ప్రయత్నాలు చేశాడు హరీష్. తన చదువుకు తగ్గట్లుగా కుటుంబాన్ని పోషించాల్సినంత జీతం ఉన్న ఉద్యోగం హరీష్‌కు దొరకలేదు. దీంతో హరీష్ ఎన్నిప్రయత్నాలు చేసినా ఉద్యోగం లేకుండా పోయింది. దీంతో దీపావళి లోగా నైనా ఉద్యోగం తెచ్చుకుంటే పెళ్ళి చేస్తామన్న కుటుంబ సభ్యులు.. చివరకు ఉద్యోగం లేకపోవడంతో దివ్యకు వేరే పెళ్ళి చేసేందుకు సిద్థమయ్యారని గ్రామస్తులు కొంతమంది పోలీసుల విచారణలో తెలిపారు.
ఇదీ చదవండి: మళ్లీ భయపెడుతున్న డెల్టా వేరియంట్ AY4.2.. ఒక్క రోజే 52 వేలకుపైగా కేసులు..
ఆ కారణంతోనే.. హరీష్, దివ్యలు మనస్థాపానికి గురయ్యారని, ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అంటున్నారు.. మొత్తానికి కారణమేదైనా.. ప్రేమ జంట మృతితో తునివాడ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆత్మహత్య విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులను హరీష్, దివ్యగా గుర్తించి కేసు నమోదు చేసారు. అనుమానాస్పద మ్ళతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. రెండు కుటుంబాల వారిని విచారిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Crime news, Lovers suicide, Srikakulam