విశాఖలో విషాదం.. ఫోన్‌లో మాట్లాడుతూ ప్రేమికుల ఆత్మహత్య

శిరీష మనస్థాపానికి గురై.. ఇంటి మేడ మీద నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. తన ప్రియురాలు చనిపోయిందని తెలిసి వెంకట్ కూడా సూసైడ్ చేసుకున్నాడు. ప్రియురాలు లేని జీవితం వ్యర్థమని భావించి.. కంచరపాలెంలో చెట్టుకు ఉరి వేసుకొని మరణించాడు.


Updated: February 12, 2020, 9:09 PM IST
విశాఖలో విషాదం.. ఫోన్‌లో మాట్లాడుతూ ప్రేమికుల ఆత్మహత్య
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
విశాఖపట్నంలో విషాదం నెలకొంది. ప్రేమికుల రోజుకు ముందు ఓ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఫోన్‌లో మాట్లాడుతూ ఒకేసారి వేర్వేరుగా సూసైడ్ చేసుకున్నారు. గోపాలపట్నంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. గోపాలపట్నానికి చెందిన మక్కా శిరీషా బ్యూటీ పార్లర్ నడుపుతోంది. కొంత కాలంగా ఆమె కంచరపాలెంకు చెందిన వెంకట్‌ను ప్రేమిస్తోంది. తరచూ ఫోన్‌లో మాట్లాడుకోవడంతో పాటు అప్పుడప్పుడూ కలుస్తుండేవారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ఇరువురు ఫోన్‌లో మాట్లాడుతూ గొడవపడ్డారు. మాటా మాటా పెరగడంతో శిరీష మనస్థాపానికి గురై.. ఇంటి మేడ మీద నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. తన ప్రియురాలు చనిపోయిందని తెలిసి వెంకట్ కూడా సూసైడ్ చేసుకున్నాడు. ప్రియురాలు లేని జీవితం వ్యర్థమని భావించి.. కంచరపాలెంలో చెట్టుకు ఉరి వేసుకొని మరణించాడు. పోస్టు మార్టం కోసం ఇద్దరి మృతేదేహాలను కేజీహెచ్‌కు తరలించారు. శిరీష, వెంటక్ మృతితో రెండు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఐతే ఇద్దరి మధ్య గొడవకు కారణమేంటన్నది తెలియాల్సి ఉంది.
Published by: Shiva Kumar Addula
First published: February 12, 2020, 9:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading