నిజామాబాద్ జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య.. అబ్బాయి మైనర్ కావడమే కారణామా?

Nizamabad: నిజామాబాద్‌ జిల్లాలోరి ఆర్మూర్ పట్టణంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఓ మామిడి తోటలో చెట్టుకు ఉరివేసుకుని వారు బలవన్మరణానికి పాల్పడ్డారు.

news18-telugu
Updated: November 29, 2020, 7:18 AM IST
నిజామాబాద్ జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య.. అబ్బాయి మైనర్ కావడమే కారణామా?
ఫ్రతీకాత్మక చిత్రం
  • Share this:
నిజామాబాద్‌ జిల్లాలోరి ఆర్మూర్ పట్టణంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఓ మామిడి తోటలో చెట్టుకు ఉరివేసుకుని వారు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కమ్మర్‌పల్లి మండలం ఉకునూర్‌కు చెందిన యువకుడు(17), ఆర్మూర్‌ పట్టణంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన యువతి(18) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరిద్దరు శనివారం పెర్కిట్ శివారులోని మామిడి తోటలో చెట్టుకు ఉరివేసుకుని కనపించారు. దీనిని గమనించిన తోట యజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందజేశాడు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. వివరాలు ఆరా తీశారు. సంఘటన స్థలాన్ని ఆర్మూర్ సీఐ రాఘవేందర్ పరిశీలించారు. ఇద్దరు మృతదేహాలను కిందకు దించి పోస్టుమార్టం నిమిత్ం ఆస్పత్రికి తరలించారు.

యువతి మేజర్‌ కాగా.. యువకుడు మైనర్. దీంతో వీరి ప్రేమకు తల్లిదండ్రులు అంగీకరించరేమోనన్న భయంతోనే వీరు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వారి ఇద్దరి మృతితో ఇరుకుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక, యువకుడు ప్రస్తుతం ఇంటర్ చదువుతున్నాడని.. ఏడాది క్రితమే యువతితో ప్రేమలో పడినట్టుగా తెలుస్తోంది.
Published by: Sumanth Kanukula
First published: November 29, 2020, 7:18 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading