హోమ్ /వార్తలు /క్రైమ్ /

girl elder than boy: ఆమె కంటే నాలుగేళ్ల చిన్నవాడితో ప్రేమలో పడింది.. పెళ్లి చేసుకుంటానని పెద్దల ముందుకు వెళ్లింది.. పెద్దలు ఒప్పుకోకపోవడంతో..

girl elder than boy: ఆమె కంటే నాలుగేళ్ల చిన్నవాడితో ప్రేమలో పడింది.. పెళ్లి చేసుకుంటానని పెద్దల ముందుకు వెళ్లింది.. పెద్దలు ఒప్పుకోకపోవడంతో..

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

అబ్బాయి కన్నా అమ్మాయి నాలుగేళ్లు పెద్దది కావడం,  మరోవైపు వాళ్ళిద్దరి కులాలు వివాహానికి అడ్డురావడంతో బతికి విడిపోవడం కన్నా.. చనిపోయి కలిసిపోదాం అనుకున్నారు.

(News 18 ప్రతినిధి కె.వీరన్నమెదక్ జిల్లా)

వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుని, అన్యోన్యంగా జీవనం సాగిద్దాం అనుకున్నారు. అయితే అబ్బాయి కన్నా అమ్మాయి నాలుగేళ్లు పెద్దది కావడం,  మరోవైపు వాళ్ళిద్దరి కులాలు వివాహానికి అడ్డురావడంతో బతికి విడిపోవడం కన్నా.. చనిపోయి కలిసిపోదాం అనుకున్నారు. ఇద్దరు రాయపల్లి బ్రిడ్జి పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా చోటు చేసుకుంది.

ఏం జరిగింది..?

సంగారెడ్డి జిల్లా భగత్ సింగ్ నగర్ కు చెందిన బెంగరి కృష్ణవేణి అదే పట్టణం పక్కనున్న రాజాం పేటకు చెందిన తడ్కల్ అనిల్​కు గత కొన్ని రోజుల క్రితం పరిచయం  ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఇరువురికి వేరు వేరు కులాలు కావడంతో వీరి పెళ్లికి ఆటంకాలు వస్తాయనే అనుకున్నారు. అయినా కకూడా ఒకసారి పెద్దవారికి చెప్పి చూద్దామని ఇరు కుటుంబాల పెద్దలను కలిశారు.

ఇంటి నుంచి పారిపోయారు..

ఇద్దరికీ వయసు మధ్య వ్యత్సాసం ఉందనీ, వేరువేరు సామాజిక వర్గాలకు చెందిన వారు కావడంతో పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో  ఈ నెల 5వ తేదీన కృష్ణవేణి, అనిల్ ఇద్దరు కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన పై ఇరు కుటుంబ సభ్యులు వేరువేరుగా సంగారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో  మిస్సింగ్ కేసు నమోదైంది. దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు సంగారెడ్డి మీదుగా ద్విచక్ర వాహనంపై ముబై హైవే నుంచి రాయిపల్లి బ్రిడ్జ్ వైపు  వెళ్లినట్లు పోలీసులు సిసి ఫుటేజ్ ద్వారా గుర్తించారు.

సిర్పూర్ మంజీర నది లో ఓ మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నదిలో దొరికిన మృతదేహం కృష్ణవేణి దే అని తేల్చారు. అనిల్ మృతదేహం కూడా నీటిలోనే ఉంటుందనే అనుమానం తో గాలింపు చర్యలు చేపట్టారు. అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.

నిజామాబాద్​లో..

ఇటీవలె నిజామాబాద్​లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.  మోస్రా మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పెడ్డిగారి మోహన్(19) అదే గ్రామానికి చెందిన ఎరుకల లక్ష్మి (19) ఇద్దరు గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి పెళ్లికి ఇరువురు కుటుంబాలు ఒప్పుకోకపోవడంతో లక్ష్మికి గత ఆరు నెలల క్రితం కొమలంచ గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది..ఇక అప్పటి నుండి ఇద్దరు దూరంగా ఉంటున్నా..వారిలో ప్రేమ మాత్రం చావలేదు..దీంతో ఇద్దరు తమ ప్రేమాయాణాన్ని కొనసాంచారు.

ఇలా ఆరునెలలుగా దూరంగా ఉంటున్న ప్రేమికులు చివరకు ఒక్కటవ్వాలని నిర్ణయించారు..ఈ క్రమంలోనే గత 25 రోజుల క్రితం లక్ష్మిని కొమలాంచ నుండి మోహన్ తీసుకువచ్చాడు.. ఇక అప్పటి నుండి ఇరువైపుల కుటుంబ సభ్యులు, బంధువులు వీరి కోసం వెదికారు..కాని ఎక్కడా దొరకపోవడంతో పోలీసు కేసు కూడా పెట్టకుండా సైలంట్‌గా ఉన్నారు...

కాని ఆ ఇరువురు ప్రేమికులు మాత్రం బయటి ప్రపంచానికి బయపడి తిరిగి గ్రామానికి చేరుకోలేక..సంసార జీవనాన్ని కొనసాగించలేక.. ఎవరికి కనిపించకుండా సైదాపూర్ సమీపంలోని అడవిలోకి వెళ్లారు.. అక్కడే చెట్టుకు ఇద్దరు ఒకేసారి ఉరి వేసుకుని మృతి చెందారు.

First published:

Tags: Lovers suicide, Medak, Sangareddy

ఉత్తమ కథలు