‘కలిసి బతకకున్నా.. కలిసి చనిపోదాం..’ కామారెడ్డిలో ఓ ప్రేమ జంట విషాదం

ప్రతీకాత్మక చిత్రం

Lovers Commits Suicide: వయసుతో పాటు ఇద్దరి మధ్య ప్రేమ కూడా పెరిగింది. పెళ్లి చేస‌కుందాం అనుకున్నారు. కల‌కాలం ఆనంద‌ంగా బతకాల‌నుకున్నారు. పెద్దలు కాదన్నా.. కాలానికి ఎదురొడ్డి నిలబడదాం అని ఆశించారు. కానీ ఇంతలోనే...

 • News18
 • Last Updated :
 • Share this:
  వారిద్ద‌రూ వరసకు బావ మరదల్లు.. చిన్ననాటి నుంచే ఒకరంటే ఒకరికి ప్రేమ. ఆ పసి వయసులోనే వారి మనసులలో నాటుకున్న ప్రేమ.. పెరిగిన కొద్దీ ఇంకా ఎక్కువైంది. వారి వయసుతో పాటు ఇద్దరి మధ్య ప్రేమ కూడా పెరిగింది. పెళ్లి చేస‌కుందాం అనుకున్నారు. కల‌కాలం ఆనంద‌ంగా బతకాల‌నుకున్నారు. పెద్దలు కాదన్నా.. కాలానికి ఎదురొడ్డి నిలబడదాం అని ఆశించారు. కానీ ఇంతలో ఆ అమ్మ‌యికి మ‌రో అబ్బాయితో పెళ్లి కుదిర్చారు వారి ఇంటి పెద్దలు. వారికి ఏం చేయాలో పాలుపోలేదు. ఇంట్లోంచి పారిపోయి.. పెళ్లి చేసుకుందామనకుంటే.. సమాజం నుంచి వచ్చే సూటి పోటి మాటలు తట్టుకోలేమని భావించారు. దీంతో కలిసి జీవించ‌డ సాద్యం కాద‌ని.. క‌లిసి చావాల‌ని నిర్ణ‌యించుకున్నారు. చివ‌రికి క్రిమిసంహ‌రక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

  ఈ ఘటన కు చెందిన వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పోతంగల్ కలాన్ గ్రామానికి చెందిన గాండ్ల సాయి కుమార్, కామారెడ్డి మండలం వ‌డ్లూర్ గ్రామానికి చెందిన‌ రమ్య వరుసకు బావ మరదళ్లు. గ‌త కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమ విషయం కుటుంబస‌భ్యుల‌కు చెప్పలేదు. కానీ రమ్య కుటుంబ సభ్యులు.. ఇటీవలే ఆమెకు మరొక‌రితో పెళ్లికి నిశ్చయం చేసారు.

  ఇదే విషయం ఆమె తన బావతో చెప్పింది. అతడికి కూడా ఏం చేయాలో పాలు పోలేదు. పెళ్లి సమయమేమో దగ్గర పడుతుంది. ఇంట్లో వాళ్లు పెళ్లి పనులకు రెడీ అవుతున్నారు. కానీ ఇష్టం లేని వాడితో కలకాలం బతకడం అసాధ్యం అనుకుంది ఆ యువతి. మరదలు లేని ఈ జీవితం వృథా అనుకున్నాడు ఆ యువకుడు. దీంతో.. తీవ్ర ఆందోళన చెందిన ఆ ప్రేమికులు లేచిపోతే కుటుంబ‌ప‌రువు పొతుంద‌ని.. చుట్టు పక్కల వాళ్లు సూటి పోటి మాటలతో తమ పెద్దల మనసును గాయపరుస్తారని భావించారు. దాంతో ఒక నిర్ణయానికి వచ్చారు.కలిసి బతకకపోయినా.. కలిసి చచ్చిపోదాం అని అనుకున్నారు. మ‌రో దారి లేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

  ఇది కూడా చదవండి.. కాళ్ల పారాణి ఆరకముందే... రక్తపు మడుగులో నవ దంపతులు.. కామారెడ్డిలో దారుణం

  శనివారం ఆ బావమరదల్లిద్దరూ.. పురుగుల మందు తాగారు. ఆ పై కామారెడ్డికి వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కారు. బస్సులో ప్రేమ జంట అపస్మారక స్థితిలో ఉండడాన్ని చూసిన తోటి ప్రయాణికులు కండక్టర్ తో విష‌యం చెప్పారు. దీంతో అప్రమత్తమైన ఆ కండక్టర్.. పోలీసులకు సమాచారమందించాడు. అనంతరం వారిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు.

  విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కామారెడ్డి ఆస్పత్రికి చేరుకుని మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుప‌త్రికి తీసుకు వెళ్లారు. కానీ అమ్మాయి పరిస్థితి విషమించి ఆదివారం చికిత్స పొందుతూ మృతి చెందింది. సాయికుమార్ అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి కూడా విషమంగానే ఉంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
  Published by:Srinivas Munigala
  First published: