• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • LOVERS COMMITS SUICIDE IN ANANTHAPURAM DISTRICT OF ANDHRA PRADESH HANGED THEMSELVES WITH SAME ROPE AND DEAD BODIES IDENTIFIED AFTER A WEEK HERE ARE THE DETAILS PRN

Andhra Pradesh: వారం రోజులు చెట్టుకు వేలాడిన మృతదేహాలు... అసలు కారణం తెలిసి షాకైన స్థానికులు

Andhra Pradesh: వారం రోజులు చెట్టుకు వేలాడిన మృతదేహాలు... అసలు కారణం తెలిసి షాకైన స్థానికులు

ప్రతీకాత్మక చిత్రం

Lovers Suicide: ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పడానికి భయపడ్డారో లేక ధైర్యం చేసి చెప్పిన తర్వాత పెద్దలు అంగీకరించలేదో తెలియదుగానీ కఠిన నిర్ణయం తీసుకున్నారు.

  • Share this:
    వాళ్లిద్దరూ ప్రేమికులు.. కలిసి మెలసి తిరిగారు. ఎన్నో ఊసులు చెప్పుకున్నారు. పెళ్లి చేసుకొని నిండు నూరేళ్లు హాయిగా జీవిద్దామని కలలుగన్నారు. కానీ ఏమైందో ఏమో తెలియదు ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకే చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. వారం రోజులుగా మృతదేహాలు అలాగే ఉన్నాయి. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా శెట్టూరు మండలం లక్ష్మంపల్లికి చెందిన గంగాధర్, కంబదూరు మండలం అందేపల్లికి చెందిన అనిత ప్రేమించుకున్నారు. గంగాధర్ స్థానికంగా ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆ క్రమంలో అనితతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. త్వరలోనే పెద్కలు ఒప్పించి ఒకటవ్వాలని కలలుగన్నారు. కానీ వీరు అనుకున్నది ఒకటి.. అక్కడ జరిగింది మరొకటి.

    ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పడానికి భయపడ్డారో లేక ధైర్యం చేసి చెప్పిన తర్వాత పెద్దలు అంగీకరించలేదో తెలియదుగానీ కఠిన నిర్ణయం తీసుకున్నారు. శెట్టూరు మండలం, కంబాలపల్లి సమీపంలోని ఓ మామిడి తోటలో డ్రిప్ పైపుతో ఒకే చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవల అటువైపు ఎవరూ వెళ్లకపోవడంతో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం రైతులు తోటకు వెళ్లగా మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు.

    వారం రోజుల క్రితమే గంగాధర్-అనిత ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలిలో పురుగుమందు డబ్బాతో పాటు వాటర్ బాటిల్ కూడా లభ్యమైంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో విచారణ చేయగా.. వారు గంగాధర్, అనితగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

    ఇలాంటి ఘటనే ప్రకాశం జిల్లాలోనూ చోటు చేసుకుంది. వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీ పరిధిలోని విఘ్నేశ్వర కాలనీ సమీపంలో ఓ ప్రేమజంట రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. దేశాయిపేటలోని లోహియాపురానికి చెందిన మైలవరపు సాయి సతీష్(20) దేశాయిపేటలోని ఓ జీడిపప్పు మిల్లులో పనిచేస్తున్నాడు. పదో తరగతి వరకూ చదివిన గొర్రెముచ్చు షకీనా(19) కూడా అదే మిల్లులో పనిచేస్తోంది. ఈ క్రమంలోనే వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కొన్ని రోజులకు ప్రేమగా మారింది.

    అయితే.. ప్రేమించుకున్నంత సులువుగా తమ పెళ్లికి పెద్దలను ఒప్పించలేమన్న భయం ఈ జంటను వెంటాడింది. ఆ భయమే ఆత్మహత్య చేసుకునేందుకు కారణమైంది. కలిసి బతికే పరిస్థితులు లేవని భావించిన ఈ ప్రేమ జంట కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. కేరళ సూపర్‌ఫాస్ట్ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనా స్థలంలో సాయి సతీష్ మృతదేహం లభించగా, షకీనా మృతదేహం రైలు ఇంజిన్‌కు చిక్కుకుని చీరాల రైల్వేస్టేషన్ సమీపంలో లభ్యమైంది. ఈ ఘటన సతీష్, షకీనా కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు