విషాదం.. బాబాయ్‌ని ప్రేమించిన కూతురు.. చివరకు ఇద్దరు కలిసి..

వారిద్దరూ మూడేళ్లుగా ప్రేమాయణం సాగిస్తూ వస్తున్నారు. ఇది కాస్త వారింట్లో తెలిసింది. దీంతో యువతి తల్లిదండ్రులు వేరే వ్యక్తితో వివాహం ఖరారు చేశారు.

news18-telugu
Updated: July 31, 2020, 2:35 PM IST
విషాదం.. బాబాయ్‌ని ప్రేమించిన కూతురు.. చివరకు ఇద్దరు కలిసి..
ఫ్రతీకాత్మక చిత్రం
  • Share this:
సమాజంలో రోజురోజూకీ మానవ విలువలు మంటగలిసిపోతున్నాయి. కామం మోజులో పడి.. వావివరసలు మర్చిపోతున్నారు. కొంతమంది అన్నవరసయ్యే వారితో సంబంధాలు పెట్టుకుంటుంటే.. మరికొంతమంది తండ్రి తర్వాత స్థానంలో ఉండే వారితో కామవాంఛను తీర్చుకుంటున్నారు. ఇటీవల కాలంలో అల్లుడి వరుసయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. విషయం అందరికీ తెలిసిందని తన ప్రియుడితో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అలాంటి ఘటన ఒకటి రంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది. ఓ యువతి తనకు బాబాయి వరుసయ్యే వ్యక్తితో ప్రేమాయణం సాగించింది. తీరా విషయం ఇంట్లో తెలిసి.. పెద్దలు వేరే వ్యక్తితో వివాహం నిశ్చయించారు. దీంతో తాము విడిపోయి ఉండలేమంటూ ప్రేమికులిద్దరూ ఆత్మహత్యాయత్నం చేశారు.

ప్రియుడు చనిపోగా, ప్రియురాలు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ విషాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం సారాపూర్ తండాకు చెందిన సేనావత్ రమేశ్(24) వృత్తిరీత్యా కారు డ్రైవర్. హైదరాబాద్‌లో కారు డ్రైవింగ్ చేస్తున్నాడు. ఇదే తండాకు చెందిన ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. అయితే ఆ యువతి అతడికి కూతురు వరుస. ఈ విషయం తెలిసినా.. వారిద్దరూ మూడేళ్లుగా ప్రేమాయణం సాగిస్తూ వస్తున్నారు. ఇది కాస్త వారింట్లో తెలిసింది. దీంతో యువతి తల్లిదండ్రులు వేరే వ్యక్తితో వివాహం ఖరారు చేశారు. అయితే తల్లిదండ్రులు నిశ్చయించిన వివాహం జరిగితే.. ఆ ప్రేమికులిద్దరూ విడిపోవడం ఖాయమని భావించారు.

బాబాయి, కూతురు వరుస కావడంతో వారి ప్రేమను ఎవరూ అంగీకరించే పరిస్థితులు కన్పించలేదు. ఏలాగు కలిసి బతకలేం.. కనీసం కలిసైనా చనిపోదామనే నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలోనే జూలై 28 రాత్రి ప్రేమికులిద్దరూ కలిసి గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రం వద్దకు వెళ్లారు. అక్కడే ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే బుధవారం ఉదయం ప్రియుడు రమేష్‌కు స్పృహ వచ్చింది. లేచిచూసేసరికి పక్కనే ప్రియురాలు స్పృహ లేకుండా పడి ఉంది. అయితే ప్రియురాలు చనిపోయిందని భావించిన ప్రియుడు రమేశ్.. పక్కనే ఉన్న చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

వీరిని గమనించిన గ్రామస్తులు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, రమేష్ అప్పటికే చనిపోయాడు. యువతి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంది. ఆమె పరిస్థితి సైతం విషమంగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు.ఈ సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిజంగా వీరిది ఆత్మహత్యనా.. లేక పరువు హత్య ఏమైనా జరిగి ఉంటుందా.. అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.
Published by: Narsimha Badhini
First published: July 31, 2020, 2:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading