దారుణం.. చదువుకున్న బడిలోనే ఆ పని చేశారు..

కులాలు వేరు కావడంతో ఇరువురి కుటుంబ సభ్యులు ప్రేమకు అడ్డు చెప్పారు. రెండేళ్ల క్రితం అమ్మాయి తరఫువారు పంచాయితీ పెట్టడంతో కనకయ్యకు గ్రామపెద్దలు రూ.30వేల జరిమానా విధించారు.

news18-telugu
Updated: May 17, 2019, 3:46 PM IST
దారుణం.. చదువుకున్న బడిలోనే ఆ పని చేశారు..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 17, 2019, 3:46 PM IST
వారి ప్రేమ ఎనిమిదో తరగతిలోనే చిగురించింది.. వయసుతో పాటు వారి ప్రేమ కూడా ఎక్కువైంది. ఎంతలా అంటే.. కలిసి చచ్చిపోయేంత. ఒకరికొకరు బతకాలనుకున్నా.. పెద్దలు అభ్యంతరం చెప్పడంతో, ప్రేమను చంపుకోలేక, ఒకరిని విడిచి మరొకరు ఉండలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. అదీ వారు చిన్నప్పడు చదువుకున్న పాఠశాలలోనే కావడం గమనార్హం. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం లకుడారం గ్రామానికి చెందిన మంజ కనకయ్య(21), రాచకొండ తార (19) మధ్య పాఠశాలలో చదువుతున్నపుడే ప్రేమ చిగురించింది. కులాలు వేరు కావడంతో ఇరువురి కుటుంబ సభ్యులు ప్రేమకు అడ్డు చెప్పారు. రెండేళ్ల క్రితం అమ్మాయి తరఫువారు పంచాయితీ పెట్టడంతో కనకయ్యకు గ్రామపెద్దలు రూ.30వేల జరిమానా విధించారు. ఆ తర్వాత ఊరు వదిలి వెళ్లిన కనకయ్య ఆర్నెల్లు వేరేచోట పెయింటర్‌గా పనిచేశాడు. ఇటీవలే మళ్లీ గ్రామానికి వచ్చాడు. అయితే, పెద్దలను కాదని రహస్యంగా కలుసుకుని మాట్లాడుకునేవారు.

విషయం తెలియని పెద్దలు అంతా సక్రమంగానే ఉందనుకున్నారు. అయితే, బుధవారం నుంచి కనకయ్య, తార కనిపించకుండాపోయారు. రాత్రంతా కుటుంబసభ్యులు వెతికినా ఎక్కడా కనిపించలేదు. గురువారం పొద్దున ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరూ ఉరి వేసుకొని కనిపించారు. ఎక్కడైతే ప్రేమ చిగురించిందో అదే చోట.. అంటే ఎనిమిదో తరగతి గదిలోనే ఆత్మహత్య చేసుకున్నారు.

First published: May 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...