• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • LOVERS COMMIT SUICIDE IN VIKARABAD DISTRICT NS

పురుగుల మందు తాగి ప్రేమికుల ఆత్మహత్య.. మరో ప్రేమకథ విషాదాంతం

పురుగుల మందు తాగి ప్రేమికుల ఆత్మహత్య.. మరో ప్రేమకథ విషాదాంతం

ప్రతీకాత్మక చిత్రం

వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారం ఓ యువతి, యువకుడి ప్రాణాలు తీసింది. కలిసి జీవించడం ఇక కుదరదు అనుకున్నారో ఏమో కానీ.. కలిసి చనిపోదామని నిర్ణయించుకున్న ఆ ప్రేమికులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

  • Share this:
    వికారాబాద్ జిల్లా తాండూరులో పెను విషాదం చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారం ఓ యువతి, యువకుడి ప్రాణాలు తీసింది. కలిసి జీవించడం ఇక కుదరదు అనుకున్నారో.. ఏమో కానీ.. కలిసి చనిపోదామని నిర్ణయించుకున్న ఆ ప్రేమికులు పురుగుల మందు తాగారు. అయితే ఆ యువతి వెంటనే చనిపోగా.. యువకుడు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. బాధిత కుటుంబాల్లో పెను విషాదం నింపింది. వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్ రెడ్డిపల్లికి చెందిన కీర్తన(16), బాలరాజ్(22) కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు.

    అయితే వీరి ప్రేమ విషయం ఇటీవల వారి కుటుంబ సభ్యులకు తెలిసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. యువతి, యువకుడు ఇద్దరూ చనిపోదామని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు కలిసి నిన్న పురుగుల మందు తాగారు. అయితే కీర్తన నిన్ననే మృతి చెందగా.. చావుబతుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాలరాజ్(22)ను చూసిన కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఉస్మానియా హాస్పిటల్ కు చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలరాజు సైతం కన్నుమూశాడు. దీంతో వీరి ప్రేమ కథ విషాదాంతంగా ముగిసింది.
    Published by:Nikhil Kumar S
    First published:

    అగ్ర కథనాలు