• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • LOVERS COMMIT SUICIDE IN MEDCHAL DISTRICT NS

Lovers Suicide: పెళ్లైన కొన్ని గంటలకే ప్రాణాలు తీసుకున్న ప్రేమజంట.. ఇంటికి వెళ్తే పెద్దలు ఏమంటారోనన్న భయంతో..

Lovers Suicide: పెళ్లైన కొన్ని గంటలకే ప్రాణాలు తీసుకున్న ప్రేమజంట.. ఇంటికి వెళ్తే పెద్దలు ఏమంటారోనన్న భయంతో..

ఫ్రతీకాత్మక చిత్రం

Telangana: పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో మరో ప్రేమ జంట ప్రాణాలు తీసుకుంది. మొదట ధైర్యంగా ఇంట్లో నుంచి పారి పోయి పెళ్లి చేసుకున్న ఆ ప్రేమికులు.. తర్వాత భయపడ్డారు. ఇలా ఇంట్లోకి వెళ్తే పెద్దలు ఏమంటారోన్న భయంతే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

  • Share this:
    పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో మరో ప్రేమ జంట ప్రాణాలు తీసుకుంది. మొదట ధైర్యంగా ఇంట్లో నుంచి పారి పోయి పెళ్లి చేసుకున్న ఆ ప్రేమికులు.. తర్వాత భయపడ్డారు. ఇలా ఇంట్లోకి వెళ్తే పెద్దలు ఏమంటారోన్న భయంతే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనా స్థలంలో బాధితుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎంవీ-42 గ్రామానికి చెందిన బిక్కి సుఖ్‌ధర్, సోరిత గత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ విషయం వారి కుటుంబ సభ్యులకు తెలియడంతో వీరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రేమను అంగీకరించకుండా పెళ్లికి ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పారు. దీంతో తమ పెద్దలు తమ పెళ్లికి అస్సలు ఒప్పుకోరు అని భావించిన ఆ ప్రేమికులు బుధవారం రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఇంటి నుంచి బయటకు పారిపోయారు. అనంతరం రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. కానీ.. ఇంటికి వెళ్తే పెద్దలు ఏమైనా అంటారేమోనని భయపడ్డారు.

    ప్రాణాలు తీసుకోవడమే ఈ సమస్యకు పరిష్కారమని భావించి గ్రామ శివారులోని ఓ మర్రి చెట్టుకు ఉరేసుకుని చనిపోయారు. గురువారం ఉదయం గ్రామస్తులు వారి మృతదేహాలను గమనించిన స్థానికులు బాధిత కుటుంబీకులు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలంలో బాధిత కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

    ఇదిలా ఉంటే.. కొద్ది క్షణాల్లో న్యూ ఇయర్ లోకి అడుగుపెట్టనున్న వేళ హైదరాబాద్ నగరంలో విషాదం చోటు చేసుకుంది. మెట్రో పిల్లర్ ను ఢీ కొని ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి అక్కడిక్కడే చనిపోయాడు. వివరాల ప్రకారం.. హైదరాబాద్  చైతన్యపురి పోలీసు స్టేషన్ పరిధి‌లోని దిల్‌సుఖ్‌నగర్ మెయిన్ రోడ్డుపై రాజు అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగా అతివేగంగా బైక్ పై వెళ్తూ మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టాడు. అయితే ప్రమాదంలో అతను అక్కడకక్కడే దుర్మరణం చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు.
    Published by:Nikhil Kumar S
    First published: