Home /News /crime /

LOVERS COMMIT SUICIDE BY JUMPING IN FRONT OF GOODS TRAIN BECAUSE OF PARENTS REFUSED THEIR MARRIAGE HSN

ఒకే కులం అయినా ప్రేమ పెళ్లికి నో చెప్పిన యువతి కుటుంబ సభ్యులు.. మరో యువకుడితో పెళ్లి ఫిక్స్.. చివరకు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వాళ్లిద్దరిదీ ఒకే కులం. ఇద్దరూ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమ పెళ్లికి పెద్దగా అడ్డంకులు రావేమోనని ఆశించారు. కానీ యువతి తల్లిదండ్రులు మాత్రం వారి ప్రేమ పెళ్లికి నో చెప్పేశారు. మరో పెళ్లి కూడా ఫిక్స్ చేశారు. దీంతో..

    క్షణికావేశంలో యువత దారుణ నిర్ణయాలు తీసుకుంటోంది. చిన్న చిన్న కారణాలకే ప్రాణాలను తీసుకుంటోంది. తల్లిదండ్రులు తిట్టారనో, స్కూళ్లో టీచర్లు కోప్పడ్డారనో ఆత్మహత్యకు పాల్పడుతున్న ఉదంతాలు కోకొల్లలు. ప్రేమించిన యువతి మరో యువకుడితో సన్నిహితంగా ఉంటోందని ఇటీవలే గుంటూరులో ఓ తోటి విద్యార్థి ఆ యువతిని చంపేశాడు. ఇంట్లో తమ పెళ్లికి ఒప్పుకోలేదన్న కారణంతో సూర్యాపేట జిల్లాలోని కోదాడలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా అలాంటి ఘటనే మరొకటి జరిగింది. ఒకే కులానికి చెందిన వాళ్లయినా, వాళ్లిద్దరూ ఉన్నత విద్యావంతులయినా కుటుంబ సభ్యులు మాత్రం వారి పెళ్లికి ఒప్పుకోలేదు. ఆ యువతికి మరో పెళ్లిని నిశ్చయం చేశారు. దీంతో వారిద్దరూ కలిసి ఓ దారుణానికి పాల్పడ్డారు. ఇంతకీ అసలేం జరిగిందంటే..

    ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ పరిధిలోని నిగోహీ ప్రాంతానికి చెందిన షాలినీ అనే 21 ఏళ్ల యువతి, పవన్ కుమార్ అనే 22 ఏళ్ల యువకుడు ప్రేమించుకున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకుందామనుకున్నారు. తమ ప్రేమ గురించి ఇద్దరూ కుటుంబ సభ్యులకు చెప్పారు. అయితే వారి ఇళ్లల్లో కుటుంబ సభ్యులు మాత్రం పెళ్లికి ఒప్పుకోలేదు. ఒకే కులం కదా, ప్రేమ పెళ్లికి పెద్దగా అడ్డు చెప్పరనుకున్న ఆ జంటకు ఇది కాస్తా తీవ్ర ఆవేదనను మిగిల్చింది. పెద్దలను ఒప్పించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. అంతే కాకుండా ఆ యువతికి మరో యువకుడితో పెళ్లి నిశ్చయం చేశారు.
    ఇది కూడా చదవండి: శోభన్ బాబు చనిపోయిన రోజు అసలేం జరిగింది..? తండ్రితో మాట్లాడి కొడుకు బయటకు వెళ్లగానే..

    దీంతో షాలిని, పవన్ కుమార్ ఇద్దరూ కలిసి దారుణ నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరూ శుక్రవారం సాయంత్రం ఇళ్లలోంచి కనిపించకుండా పోయారు. అదే రోజు ఓ బ్రిడ్జి పై నుంచి వేగంగా వస్తున్న గూడ్స్ రైలుకు ఎదురుగా పట్టాలపైకి దూకేశారు. వారిని గమనించిన లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులను వేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వారిద్దరి పై నుంచి రైలు దూసుకెళ్లింది. ఘటనపై షాహజన్ పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుల వివరాలను తెలుసుకుని, వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. అప్పటికే వాళ్లు ఆ జంట కోసం వెతుకుతుండటం గమనార్హం.
    ఇది కూడా చదవండి: ‘ఆ శోభన్ బాబు చచ్చిపోయాడురా.. అనేవాడు.. ప్రతి నెలా నాకు రూ.10 లక్షలు.. అంతా ఆయన చలవే..’.. దర్శకుడు కోదండరామిరెడ్డి కామెంట్స్
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Crime news, Crime story, CYBER CRIME, Love marriage, Uttar pradesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు