• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • LOVERS AND FAMILIES SUICIDE ATTEMPT IN SANGAREDDY DISTRICT IN A SINGLE DAY BA MDK

Telangana: అయ్యో పాపం.. ఒకే రోజు, ఒకే జిల్లాలో రెండు ప్రేమ జంటలు.. ఆరు పెళ్లయిన జంటలు..

Telangana: అయ్యో పాపం.. ఒకే రోజు, ఒకే జిల్లాలో రెండు ప్రేమ జంటలు.. ఆరు పెళ్లయిన జంటలు..

ప్రతీకాత్మక చిత్రం

వివిధ కారణాల వల్ల భార్యభర్తల గొడవలు నిన్న ఒకే రోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆరు మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వారు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

  • Share this:
    తెలిసీ తెలియని వయసులో యువతీ యువకులు ఫ్రెండ్స్ తో మొదలై మెల్లగా మెల్లగా అది కాస్త లవ్ గా మారుతుంది. కొన్ని రోజులు షికార్లు కొట్టి ఆ ప్రేమ కాస్త తల్లిదండ్రులు దగ్గరకు వచ్చేసరికి లవ్ ఫెయిల్‌గా మారిపోయి యువతీ యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లాలో నిన్న ఒకే రోజు రెండు ప్రేమ జంటలు లవ్ ఫెయిల్ అవ్వడం తో పురుగుల మందు తీసుకొని ఆత్మహత్యాయత్నం చేశాయి. యువతి, యువకుడు ఇద్దరూ వేరేవాళ్లను ప్రేమించడంతో యువతి పెద్దలు తెచ్చిన సంబంధాన్ని వదులుకొని ప్రేమించిన అబ్బాయితో పెళ్లి చేసుకోవాలనుకుంది. ఆ యువతి ప్రియుడుతో కొన్ని రోజులు గడిచాక ప్రియుడు క్యారెక్టర్ నచ్చక పురుగుల మందు తీసుకొని ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించింది. ఆ యువతి సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతుంది. మరో యువకుడు గత రెండు సంవత్సరాల నుంచి ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పడంతో ప్రేమ నిరాకరించడంతో యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. వారి బంధువులు సంగారెడ్డి హాస్పిటల్ తరలించారు. లవ్ ఫెయిల్ అవ్వడంతో చాలా మంది యువతీ యువకులు లవ్ ఫెయిల్ కాగానే చనిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. యువతీ యువకులకు తెలిసీ తెలియని వయసులో ప్రేమించుకోవడం గొప్ప అనుకొని ప్రేమించుకుంటున్నారు. కానీ అది కాస్త ప్రాణాల మీదికి వస్తుందని తెలుసుకోలేకపోతున్నారు.

    ప్రేమికులే కాదు పెళ్లయిన వారు కూడా
    వివిధ కారణాల వల్ల భార్యభర్తల గొడవలు నిన్న ఒకే రోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆరు మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వారు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇది ఇలా ఉంటే మెదక్ సిద్దిపేట మరో రెండు జిల్లాల్లో ఆత్మహత్యలు కేసులు పెరుగుతున్నాయని జిల్లా dm & ho అధికారులు చెప్తున్నారు. భార్య భర్తల మధ్య గొడవలు పడి భార్య భర్త ఆత్మహత్యకు పాల్పడుతూ పుట్టిన పిల్లలలను అనాధలు చేస్తున్నారు. కొంతమంది ఆర్థిక సమస్యలతో, మరికొంతమంది చిన్నచిన్న గొడవలకే ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. దీని వల్ల ఆ కుటుంబాలను వీధి పాలు అవుతున్నాయని చెపుతున్నారు డాక్టర్లు. వారు మానసికంగా దెబ్బతిని సూసైడ్ చేసుకుంటున్నారని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ సంగారెడ్డి అన్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: