వివాహేతర సంబంధాలు (Extra Marital Affair) చివరకు అనర్ధాలకు దారి తీస్తాయని ఎన్ని ఘటనలు రుజువు చేస్తున్నా కొందరు కోరి తప్పు చేస్తూ తిప్పలు కొనితెచ్చుకుంటున్నారు. వారితో పాటు కన్న బిడ్డలను కూడా ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. సరిగ్గా.. ఇలాంటి ఘటనే నోయిడా పరిధిలో వెలుగుచూసింది. బీహార్లోని (Bihar) దర్భంగాకు చెందిన తల్లీకూతురు నోయిడాకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిస్రక్ జలాల్పూర్లో నివాసం ఉంటున్నారు. ఆ మహిళ భర్త కొన్నేళ్ల క్రితం మరణించాడు. దీంతో.. అప్పటి నుంచి పెళ్లీడుకొచ్చిన కూతురితో కలిసి ఉంటోంది. భర్త (Husband) దూరం కావడంతో కొన్ని రోజుల తర్వాత ఆమెకు పక్కింటి వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా కొన్నాళ్లకు వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే.. పెళ్లీడుకొచ్చిన కూతురు ఇంట్లో ఉందన్న సంగతి మరిచి పరాయి మగాడితో అదే ఇంట్లో సదరు మహిళ రాసలీలలు సాగించింది.
తల్లి (Mother) చేసే పని నచ్చకపోయినప్పటికీ కూతురు (Daughter) ఏమీ అనలేక మౌనం వహించింది. దీంతో.. ఇలా కొన్నేళ్లు గడిచాక ఆ వ్యక్తి తనతో వివాహేతర సంబంధం నడుపుతున్న మహిళ కూతురిపై కన్నేశాడు. తన కూతురి జోలికి వెళ్లొద్దని సదరు మహిళ అతనికి చెప్పినా వినిపించుకోలేదు. ఇంటికొచ్చినప్పుడల్లా తన ప్రియురాలి కూతురిపై ఎక్కడెక్కడో చేతులేస్తూ.. అసభ్యంగా ప్రవర్తిస్తుండేవాడు. తల్లీకూతురు అతని ప్రవర్తనతో విసిగిపోయారు. ఎంత చెప్పినా వినిపించుకోకపోవడంతో తన ఇంటికి రావొద్దని ఆ మహిళ తన ప్రియుడికి తెగేసి చెప్పింది. అయినా.. తాను మారిపోయానని.. కూతురితో తప్పుగా ప్రవర్తించనని చెప్పి ఇంటికి వెళుతుండేవాడు. ఇలా కొన్ని రోజులు ఆ మహిళ కూతురి జోలికి వెళ్లని ఆమె ప్రియుడు మళ్లీ ఎప్పటిలానే తప్పుగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఈసారి.. ఏకంగా ప్రియురాలి కూతురిని చేతులు పట్టుకుని లాగుతూ తనను కౌగించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ పరిణామాలతో విసిగిపోయిన తల్లీకూతురు అతనిని చంపాలని నిర్ణయించుకున్నారు.
ఐదేళ్లుగా తనతో సహ జీవనం చేసిన వ్యక్తి తన కూతురితో తప్పుగా ప్రవర్తించడాన్ని సహించలేకపోయిన మహిళ కూతురితో కలిసి ప్రియుడి హత్యకు కుట్రపన్నింది. తన ఇంటికొచ్చిన ప్రియుడిని ప్రేమగా ఇంట్లోకి పిలిచిన మహిళ కూతురితో కలిసి అతనిని హత్య చేసింది. పోలీసులు ఈ ఘటనలో తల్లీకూతురిని అరెస్ట్ చేశారు. ఇద్దరిపై హత్య కేసు నమోదు చేశారు. ఇలా తల్లి వివాహేతర సంబంధం కూతురి జీవితాన్ని కూడా నాశనం చేసింది. పెళ్లి చేసుకుని అత్తారింట్లో ఉండాల్సిన యువతి తల్లి అఫైర్ కారణంగా హత్య కేసులో జైలుకెళ్లాల్సి వచ్చింది. పోలీసులు హత్య జరిగిన గదిలో ఆ వ్యక్తి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్బుక్, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. అతనిని కత్తితో పొడిచి హత్య చేసినట్లు తెలిసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Extra marital affair, Married women, Noida, Telangana crime news