LOVER SHOWED PISTOL TO HUSBAND AND TOOK AWAY HIS GIRLFRIEND PVN
Wife escape with lover :పెళ్లి అయిన 8 రోజులకే..భర్తకు చెమటలు పట్టించి ప్రియుడితో జంప్
భర్తతో మోనికుమారి
Woman ran way with lover : పెళ్లయిన 8 రోజులే అయింది. కాళ్ల పారాణి కూడా ఆరలేదు. ఇంతలోనే భర్తను వదిలి ప్రియుడితో కలిసి పారిపోయింది. కట్టుకున్న మొగుడిని అంత ఈజీగా వదిలి వెల్లలేదు. అతడికి చెమటలు పట్టించి మరీ వెళ్లింది.
పెళ్లయిన 8 రోజులే అయింది. కాళ్ల పారాణి కూడా ఆరలేదు. ఇంతలోనే భర్తను(Husband) వదిలి ప్రియుడి(Lover)తో కలిసి పారిపోయింది(Run away). కట్టుకున్న మొగుడిని అంత ఈజీగా వదిలి వెల్లలేదు. అతడికి చెమటలు పట్టించి మరీ వెళ్లింది. బీహార్(Bihar) లోని ముంగేర్ లో వెలుగులోకి వచ్చింది. ముంగేర్ లోని కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న దివంగత రాంవిలాస్ గుప్తా కుమారుడు వివేక్ పొద్దార్‌కు కొత్త రాంనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నౌవాగర్హిలో నివాసం ఉంటున్న రాంవిలాస్ పొద్దార్ కుమార్తె మోని కుమారితో జూన్ 14న వివాహం(Marriage) జరిగింది. జూన్ 18న మోని కుమారి అత్తారింటికి వెళ్లింది. జూన్ 22వ తేదీ సాయంత్రంమోని కుమారి తన భర్త వివేక్ పొద్దార్‌తో కలిసి గాజులు కొనేందుకు మార్కెట్‌కి వెళ్లింది. మర్కెట్ కి వెళ్లిన తర్వాత నువ్వు ఇక్కడే ఉండు నేను ఆ పక్కనే ఉన్న షాపులోకి వెళ్లి గాజులు కొనుక్కోవాలని భర్తకు చెప్పి ప్రియుడితో కలిసి పారిపోయింది. మార్కెట్లో ఓ అమ్మాయి ఒకరి చేయి పట్టుకుని పరిగెత్తడం చూసిన భర్త వివేక్‌కు అనుమానం వచ్చింది. వివేక్కి విషయం అర్థమయ్యేలో భార్య ప్రేమికుడితో కలిసి పారిపోయింది.
అయితే తన భార్యను ఎవరో బెదిరించి తీసుకెళ్తున్నాడని భావించి వివేక్ వారిని వెంబడించగా..అతడికి గన్ చూపించి భయపెట్టి అక్కడినుంచి కుమారిని ఆమె ప్రియుడు తీసుకెళ్లాడు. ముందుగానే ఇదంతా ఫ్లాన్ చేసుకున్న మోని కుమారి..తన సర్టిఫికెట్లు, నగలు అన్నీ కూడా ఆమె వెంట తీసుకువెళ్లింది. సాయంత్రం ఆలస్యంగా, వివేక్ తల్లి కంచన్ దేవి కొత్వాలి పోలీస్ స్టేషన్లో తన కోడలిని ఎవరినో కిడ్నాప్ కేసు నమోదు చేసింది. దీంతో పోలీసులు మోని కుమారి వెతకడం ప్రారంభించారు. గురువారం నయా రాంనగర్ పోలీస్ స్టేషన్ పోలీసులు కాంతాపూర్ లో మోని కుమారిని ఆమె ప్రేమికుడు దివ్యాన్షు కుమార్‌తో కలిసి పట్టుకుని కొత్వాలి పోలీసులకు అప్పగించారు. కొత్వాలి పోలీస్ స్టేషన్లో దివ్యాన్షు.. తాను ప్రైవేట్ కారు నడుపుతున్నానని, కుమారి తాను గత ఆరేళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని, తాము జీవించాలనుకుంటున్నామని. అయితే యువతికి,ఆమె ప్రియుడికి మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత తదుపురి చర్యలు ఉంటాయని పోలీసులు తెలిపారు.
మరోవైపు,హర్యానా(Haryana)లో ఘోరం జరిగింది. ప్రియుడితో కలిసి భర్తను కత్తితో గొంతు కోసి హత్య చేసింది ఓ భార్య. . హత్య అనంతరం మృతదేహాన్ని ఛిద్రం చేయాలనే ఉద్దేశంతో పొలంలో నిర్మించిన ట్యూబ్‌వెల్ చాంబర్లో దాచిపెట్టారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు భార్య,ఆమె ప్రియుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితులని పోలీసులు రెండు రోజుల రిమాండ్‌కు తరలించారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.