HOME »NEWS »CRIME »lover killed girlfriend and hides her body in wall of his home in maharasthra hsn

ఓరి దేవుడో.. ప్రేయసిని చంపి.. తన ఇంట్లోనే ఆ ప్రియుడు ఎక్కడ దాచిపెట్టాడో తెలిస్తే..

ఓరి దేవుడో.. ప్రేయసిని చంపి.. తన ఇంట్లోనే ఆ ప్రియుడు ఎక్కడ దాచిపెట్టాడో తెలిస్తే..
ప్రతీకాత్మక చిత్రం

పల్గార్ జిల్లా కేంద్రంలో ఓ 30 ఏళ్ల వ్యక్తి, తనకంటే వయసులో రెండేళ్ల పెద్దదయిన 32 ఏళ్ల మహిళతో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడు. కొన్నేళ్లుగా వాళ్లిద్దరి మధ్య పరిచయం ఉంది. ఆమె అతడు ఉండే ఇంటికి వస్తూ పోతూ ఉండేది అయితే గతేడాది అక్టోబర్ నెల నుంచి ఆమె కనిపించకుండా పోయింది. ఆమె ఏమయిందోనన్న ఆందోళనతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమచారం ఇచ్చారు.

  • Share this:
    మీరు, అవును సినిమాను చూశారా.? దాంట్లో విలన్ గా నటించిన రవిబాబు ఓ తాపీ మేస్త్రి. మహిళలను వేధించడం అతడికి సరదా. దీంతో అతడి ఆగడాలను భరించలేక తోటి కూలీలే అతడిని చంపి, అతడి శవాన్ని స్లాబులో కప్పెట్టేస్తారు. అతడి శవాన్ని ఉంచే ఆ బిల్డింగ్ స్లాబును కాంక్రీట్ తో పూర్తి చేస్తారు. ఇలాంటి సన్నివేశాలు సినిమాల్లో చాలానే ఉన్నాయి. అచ్చం అలాగే ఇంటి గోడల మధ్య ఓ 30 ఏళ్ల మహిళకు సంబంధించిన అస్థిపంజరం బయటపడింది. అసలు ఆమె మృతదేహం అక్కడకు ఎలా వచ్చిందో తెలిసి పోలీసులే అవాక్కయ్యారు. మహారాష్ట్రలోని పల్గార్ జిల్లా పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    పల్గార్ జిల్లా కేంద్రంలో ఓ 30 ఏళ్ల వ్యక్తి, తనకంటే వయసులో రెండేళ్ల పెద్దదయిన 32 ఏళ్ల మహిళతో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడు. కొన్నేళ్లుగా వాళ్లిద్దరి మధ్య పరిచయం ఉంది. ఆమె అతడు ఉండే ఇంటికి వస్తూ పోతూ ఉండేది అయితే గతేడాది అక్టోబర్ నెల నుంచి ఆమె కనిపించకుండా పోయింది. ఆమె ఏమయిందోనన్న ఆందోళనతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమచారం ఇచ్చారు. ఆమెకు ఓ ప్రియుడు ఉన్నాడని తెలిసి ఆరా తీశారు. అతగాడు కూడా తన ప్రేయసి కనిపించకుండా పోయిందంటూ లబోదిబో మని ఏడ్చాడు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి, అతడు ఎక్కడికెళ్తున్నాడు. ఎవరెవరిని కలుస్తున్నాడన్నది ఆరా తీయడం మొదలు పెట్టారు. అతడు రోజులో అధిక భాగం తన ఇంట్లోనే గడుపుతుండటం పోలీసులకు అనుమానం తెచ్చింది.



    ఈ శనివారం పోలీసులు అతడి ఇంటిని సోదా చేశారు. ఎక్కడా ఎలాంటి క్లూ దొరకలేదు. ఆ సమయంలో అతడి చూపులు ఇంటి గోడవైపు ఉండటాన్ని పోలీసులు గమనించారు. ఆ గోడ ప్లాస్టింగ్ ఇటీవల చేసినట్టుగా అనిపించడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఆ గోడను తవ్వితే అతడి ప్రియురాలి మృతదేహం తాలుకా ఆనవాళ్లు బయటపడ్డాయి. దీంతో ఆమె అస్తిపంజరాన్ని పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతడిని అరెస్ట్ చేసి విచారన ప్రారంభించారు. ఆమెను గతేడాది అక్టోబర్ నెలలోనే చంపి, గోడలో పూడ్చిపెట్టాడని విచారణలో తేలింది. పెళ్లి చేసుకోమని తరచూ ఇబ్బందులు పెట్టడం వల్లే తాను ఈ పనికి పూనుకున్నానని ఆ ప్రియుడు అంగీకరించడం గమనార్హం.
    Published by:Hasaan Kandula
    First published:January 16, 2021, 14:59 IST